ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం

జెపిఎమ్ చట్టం 1987 లో భాగం గా జనపనార సంవత్సరం 2022-23 కు గాను జనుము ప్యాకేజింగ్ పదార్థాల కుఉద్దేశించిన రిజర్వేషన్ నియమాలు


జనపనార సంవత్సరం 2022-23 కు గాను ఆహార ధాన్యాలు మరియు చక్కెర ప్యాకేజింగ్ లో జనుము ను విధి గా ఉపయోగించడం కోసం రిజర్వేషన్ నియమాల కు ఆమోదం తెలిపిన సిసిఇఎ

పశ్చిమ బంగాల్ కు చెందిన జనపనార శ్రమికులు, రైతులు, మిల్లుల  కు పెద్ద ప్రోత్సాహకర చర్య కానున్న ప్రభుత్వనిర్ణయం

ఈ నిర్ణయం 40 లక్షల మంది రైతు కుటుంబాల కు,  జూట్ మిల్లుల లోని మరియు అనుబంధ యూనిట్ ల లోని 3.7 లక్షలమంది శ్రమికుల కు తోడ్పడనుంది

ప్యాకింగ్ కోసం ఏటా 9,000 కోట్ల రూపాయల విలువైన జనుము ను ప్రభుత్వం కొనుగోలుచేయనుండడం అనేది జనపనార రైతుల కు మరియు శ్రమికుల కు హామీ తో కూడిన మార్కెట్ నుఅందించనుంది

దేశీయంగా జనపనార ఉత్పత్తి కి సమర్థన నుఅందించాలన్న ప్రభుత్వ నిర్ణయం ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాని కి అనుగుణం గా ఉంది

Posted On: 22 FEB 2023 4:54PM by PIB Hyderabad

జనపనార సంవత్సరం 2022-23 కు గాను ధాన్యం, గోధుమలు, ఇంకా చక్కెర ల ప్యాకింగ్ లో జనపనార ను తప్పనిసరి గా ఉపయోగించాలి అనేటటువంటి రిజర్వేషన్ నియమాల కు భారతదేశ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఈ విధ్యాత్మకమైనటువంటి నియమాల వల్ల ఆహార ధాన్యాల ప్యాకేజింగ్ విషయం లో పూర్తి స్థాయి లో, చక్కెర ప్యాకింగు కు వచ్చేసరికి 20 శాతం రిజర్వేషన్ అనే నియమాలు వర్తించనున్నాయి. ఇది పశ్చిమ బంగాల్ కు ఒక పెద్ద ప్రోత్సాహకర చర్య కానుంది.

భారతదేశం ఆర్థిక వ్యవస్థ లో జనపనార పరిశ్రమ ఒక ముఖ్య స్థానాన్ని కలిగివుంది. మరీ ముఖ్యం గా పశ్చిమ బంగాల్ లో దాదాపు గా 75 జూట్ మిల్లులు నడుస్తున్నాయి. అవి లక్షల కొద్దీ శ్రమికుల కు బ్రతుకు తెరువు ను చూపిస్తున్నాయి. ఇది జనపనార రంగం లో 40 లక్షల రైతు కుటుంబాల కు దన్ను గా నిలవనున్నది. ఈ నిర్ణయం బిహార్, ఒడిశా, అసమ్, త్రిపుర, మేఘాలయ, ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లలో జనపనార రంగాని కి సైతం సహాయకారి కానుంది.

జెపిఎమ్ చట్టం లో భాగం గా ఉన్నటువంటి రిజర్వేషన్ సంబంధి నియమాలు 3.70 లక్షల మంది శ్రమికుల కు ప్రత్యక్ష ఉపాధి ని కల్పించడం తో పాటు జనపనార రంగం లో సుమారు గా 40 లక్షల రైతు కుటుంబాల కు మేలు ను చేస్తున్నాయి. జెపిఎమ్ చట్టం, 1987 జనపనార రైతుల , జనపనార తో తయారు చేసే వస్తువుల ఉత్పత్తి లో నిమగ్నం అయిన శ్రమికుల మరియు వ్యక్తుల ప్రయోజనాల ను పరిరక్షిస్తున్నది. జనుము పరిశ్రమ మొత్తం ఉత్పత్తి లో జనపనార తో రూపొందించేటటువంటి సంచులే 75 శాతం వరకు ఉంటాయి. మళ్ళీ ఇందులో కూడాను 85 శాతం సంచుల ను భారత ఆహార సంస్థ (ఎఫ్ సిఐ) కి మరియు స్టేట్ ప్రొక్యూర్ మెంట్ ఏజెన్సీస్ (ఎస్ పిఎ స్) కు సరఫరా చేయడం జరుగుతోంది. మిగిలిన ఉత్పత్తి ని ప్రత్యక్షం గా విక్రయించడం గాని లేదా ఎగుమతి చేయడం గాని జరుగుతున్నది.

ప్రభుత్వం ప్రతి సంవత్సరం లో ఆహార ధాన్యాల ప్యాకింగ్ కోసమని దాదాపు గా 9,000 కోట్ల రూపాయల విలువైన జూట్ సాకింగ్ బ్యాగ్స్ ను కోనుగోలు చేస్తుంటుంది. ఇది జనపనార రైతులు పండించే పంట కు మరియు ఈ రంగం లోని శ్రమికుల కు ఒక అభయం ఇచ్చేటటువంటి బజారు ను ఏర్పరుస్తున్నది.

జూట్ సాకింగ్ బ్యాగ్స్ సరాసరి ఉత్పత్తి ని పరిశీలించి చూసినప్పుడు దాదాపు గా 30 లక్షల బేళ్ళు (9 లక్షల ఎమ్ టి) గా ఉంది; జనపనార రైతులు, జనపనార పరిశ్రమ లో పాలుపంచుకొంటున్న శ్రమికులు మరియు వ్యక్తుల ప్రయోజనాల ను పరిరక్షించడం కోసం జనపనార సంచుల ఉత్పత్తి ని పూర్తి స్థాయి లో వినియోగించేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకొందిది.

రిజర్వేషన్ కు సంబంధించిన నియమాలు భారతదేశం లో ముడి జనపనార ను దేశీయం గా ఉత్పత్తి చేయడానికి మరియు జనపనార సంబంధి ప్యాకేజింగ్ తాలూకు ప్రయోజనాల ను పెంపొందింప చేయగలుగుతాయి. తద్వారా ఆత్మనిర్భర్ భారత్ ఆశయాని కి అనుగుణం గా భారతదేశాన్ని స్వయం సమృద్ధి దిశ లో ముందుకు తీసుకు పోనున్నాయి. ఇది పర్యావరణాన్ని పరిరక్షించడం లో సైతం దోహదకారి కానుంది. ఎలాగంటే జనపనార అనేది ప్రాకృతికమైనటువంటిది, జనపనార వల్ల కాలుష్యం ఏమంత ఉత్పన్నం కాదు కూడాను, జనపనార ను మళ్ళీ మళ్ళీ ఉపయోగించుకోవచ్చును, అంతేకాకుండా జనపనార ను పునర్ నవీకరించుకోవచ్చును; ఈ కారణం గా స్థిర వృద్ధి సంబంధి కొలమానాల కు ఇది తుల తూగుతుంది.

 

 

 

**

 

 



(Release ID: 1901763) Visitor Counter : 171