ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘ప్రగతి’ 41వ సమావేశాని కి అధ్యక్షత వహించినప్రధాన మంత్రి


13 రాష్ట్రాల లో విస్తరించినటువంటి 41,500 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన  తొమ్మిది కీలక మౌలిక సదుపాయాల రంగ ప్రాజెక్టులను సమీక్షించిన ప్రధాన మంత్రి

మౌలిక సదుపాయాల కల్పన పథకాల ప్రణాళిక రచన కోసం పిఎమ్ గతిశక్తి పోర్టల్ నుఉపయోగించుకోవాలని సలహా ఇచ్చిన ప్రధాన మంత్రి

మిశన్ అమృత్ సరోవర్ ను ప్రధాన మంత్రిసమీక్షించారు;   వర్షరుతువు ఆరంభం కావడాని కంటే ముందుగానేమిశన్ మోడ్ లో అమృత్ సరోవర్ సంబంధి పనుల ను పూర్తి చేయాలని అన్ని మంత్రిత్వ శాఖ లకు మరియు రాష్ట్రప్రభుత్వాల కు ఆయన సలహా ఇచ్చారు

Posted On: 22 FEB 2023 7:14PM by PIB Hyderabad

కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయంతో ఐసిటి ఆధారితం అయిన మల్టి మాడల్ ప్లాట్ ఫార్మ్ ఫార్ ప్రొ-యాక్టివ్ గవర్నెన్స్ ఎండ్ టైమ్ లీ ఇంప్లిమెంటేశన్ (పిఆర్ఎజిఎటిఐ- ప్రగతి’) యొక్క 41 వ సమావేశం ఈ రోజు న జరగగా, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ సమావేశాని కి అధ్యక్షత వహించారు.

 

మౌలిక సదుపాయాల రంగం లో కీలకం అయినటువంటి తొమ్మిది ప్రాజెక్టు లను ఈ సమావేశం లో సమీక్షించడమైంది. ఆయా ప్రాజెక్టుల లో.. మూడు ప్రాజెక్టులు రహదారి రవాణా మరియు రాజమార్గాల మంత్రిత్వ శాఖ కు, రెండు ప్రాజెక్టుల రైలు మార్గాల మంత్రిత్వ శాఖ కు చెందినవి ఉండగా, మిగతా నాలుగు ప్రాజెక్టులు విద్యుత్తు మంత్రిత్వ శాఖ, బొగ్గు మంత్రిత్వ శాఖ, పెట్రోలియమ్ & సహజ వాయువు మంత్రిత్వ శాఖ తో పాటు, ఆరోగ్యం & కుటుంబ సంక్షేమం మంత్రిత్వ శాఖ కు సంబంధించిన ఒక్కొక్క ప్రాజెక్టు.. ఉన్నాయి. ఈ తొమ్మిది ప్రాజెక్టు ల మొత్తం వ్యయం 41,500 కోట్ల రూపాయల కు పైబడింది. ఈ ప్రాజెక్టు లు 13 రాష్ట్రాల కు సంబంధించినవి. ఆ పదమూడు రాష్ట్రాల లో ఛత్తీస్ గఢ్, పంజాబ్, బిహార్, మధ్య ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, ఝార్ ఖండ్, కేరళ, కర్నాటక, తమిళ నాడు, అసమ్, గుజరాత్, మహారాష్ట్ర మరియు అరుణాచల్ ప్రదేశ్ ఉన్నాయి. ఈ సమావేశం లో మిశన్ అమృత్ సరోవర్ ను గురించి కూడా సమీక్షించడమైంది.

 

మౌలిక సదుపాయాల రంగ ప్రాజెక్టుల తాలూకు ప్రణాళిక రచన కోసం పిఎమ్ గతిశక్తి పోర్టల్ ను ఉపయోగించుకోవాలి అంటూ మంత్రిత్వ శాఖల కు మరియు రాష్ట్ర ప్రభుత్వాల కు ప్రధాన మంత్రి సలహా ఇచ్చారు. ప్రాజెక్టుల ను అనుకున్న సమయాని కి పూర్తి చేయడం కోసమని భూమి సేకరణ, ఉపయోగించే వస్తు సామగ్రి తరలింపు మరియు ఇతరత్రా అంశాల ను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకొంటే బాగుంటుందని ఆయన నొక్కిచెప్పారు. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల కు మరియు రాష్ట్ర ప్రభుత్వాల కు మధ్య తగిన సమన్వయాన్ని నెలకొల్పుకోవడం ముఖ్యం అని ఆయన ఉద్ఘాటించారు.

 

సమావేశం లో భాగం గా, ప్రధాన మంత్రి మిశన్ అమృత్ సరోవర్ను గురించి కూడా సమీక్షించారు. ఆయన డ్రోన్ మాధ్యం ద్వారా బిహార్ లోని కిశన్ గంజ్ లో మరియు గుజరాత్ లోని బోటాడ్ లో అమృత్ సరోవర్ ప్రదేశాల వాస్తవ కాల పరిశీలన ను కూడా చేపట్టారు. వర్షరుతువు వచ్చే లోపే మిశన్ మోడ్ లో అమృత్ సరోవర్ సంబంధి పనుల ను పూర్తి చేయాలంటూ అన్ని మంత్రిత్వ శాఖల కు మరియు రాష్ట్ర ప్రభుత్వాల కు ప్రధాన మంత్రి సూచించారు. ఈ పథకం లో భాగం గా 50,000 అమృత సరోవరాల లక్ష్యాన్ని అనుకున్న కాలం కంటే ముందుగానే పూర్తి చేయడం కోసం బ్లాక్ స్థాయి పర్యవేక్షణ అవసరమని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.

 

రాబోయే కాలాన్ని దృష్టి లో పెట్టుకొని నీటి ని సంరక్షించడం లో సహాయకారి గా ఉండేటట్లు దేశవ్యాప్తం గా అన్ని జలాశయాల ను పునరుత్తేజితం చేసేందుకు తోడ్పడాలన్న విశిష్టమైనటువంటి ఆలోచన తో మిశన్ అమృత్ సరోవర్ను చేపట్టడం జరిగింది. ఈ మిశన్ గనుక పూర్తి అయిందీ అంటే నీటి ని నిలవ ఉంచే సామర్థ్యం దాదాపు గా 50 కోట్ల ఘనపు మీటర్ ల కు చేరుకోగలదన్న అంచనా ఉంది. అదే విధం గా కర్బనం అడ్డగింత ఏటా దాదాపు గా 32,000 టన్నుల కు చేరుకొంటుంది; ఇక భూగర్భ జలాలు తిరిగి నిండడం లో 22 మిలియన్ ఘనపు మీటర్ ల పైచిలుకు వృద్ధి చోటుచేసుకోవచ్చన్న అంచనా ఉంది. దీనికి అదనం గా, ఇప్పటికే సిద్ధం అయిన అమృత్ సరోవరాలు సార్వజనిక భాగస్వామ్యం నెలకొన్న కేంద్రాలు గా ఉంటూ, జన్ భాగీదారి భావన ను పెంపొందింపచేస్తున్నాయి. అనేక అమృత్ సరోవర్ ప్రదేశాల లో స్వచ్ఛత ర్యాలీ, నీటిని పొదుపు గా వాడుకొంటాం అంటూ జల శపథం, బడిపిల్లల కు ముగ్గుల పోటీ ల వంటి సామాజిక కార్యాలు మరియు ఛఠ్ పూజ వంటి ధార్మిక ఉత్సవాలు మొదలైన వాటిని నిర్వహించడం జరుగుతున్నది.

 

సమావేశం లో భాగం గా ప్రధాన మంత్రి మిశన్ అమృత్ సరోవర్ను గురించి కూడా సమీక్షించారు. బిహార్ లోని కిశన్ గంజ్ మరియు గుజరాత్ లోని బోటాడ్ లలో డ్రోన్ ల సాయం తో అమృత్ సరోవర్ ప్రదేశాల వాస్తవకాల వీక్షణాన్ని కూడా ఆయన చేపట్టారు. వర్షకాలం ప్రవేశించే కంటే ముందే అమృత్ సరోవర్ సంబంధి పనుల ను ఉద్యమం తరహా లో ముగించాలంటూ ప్రధాన మంత్రి అన్ని మంత్రిత్వ శాఖల కు మరియు రాష్ట్ర ప్రభుత్వాల కు సూచించారు. ఈ పథకం లో భాగం గా 50,000 అమృత సరోవరాల లక్ష్యాన్ని అనుకున్న కాలం లోపే పూర్తి చేయడం కోసం బ్లాక్ స్థాయి పర్యవేక్షణ చేపట్టాలి అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.

 

ప్రగతి సమావేశాల లో ఇంతవరకు మొత్తం 15.82 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయినటువంటి 328 ప్రాజెక్టుల ను సమీక్షించడమైంది.

 

 

***

 


(Release ID: 1901729) Visitor Counter : 202