మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గ్రేడ్-1 అడ్మిషన్ వయస్సును 6+ సంవత్సరాలకు సమలేఖనం చేయాలని రాష్ట్రాలు మరియు యుటిలను ఆదేశించిన విద్యా మంత్రిత్వ శాఖ


రెండు సంవత్సరాల డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ (డిపిఎస్‌ఈ) కోర్సు రూపకల్పన మరియు అమలు ప్రక్రియను ప్రారంభించాలని కూడా రాష్ట్రాలు/యూటీలు అభ్యర్థించబడ్డాయి.

Posted On: 22 FEB 2023 12:28PM by PIB Hyderabad

జాతీయ విద్యా విధానం 2020 దేశానికి జాతీయ ప్రాధాన్యతగా 'పునాది దశలో' పిల్లల అభ్యాసాన్ని బలోపేతం చేయాలని సిఫార్సు చేసింది. పునాది దశలో పిల్లలందరికీ (3 నుండి 8 సంవత్సరాల మధ్య) 5 సంవత్సరాల అభ్యాస అవకాశాలను కలిగి ఉంటుంది. ఇందులో 3 సంవత్సరాల ప్రీ-స్కూల్ విద్య మరియు 2 సంవత్సరాల ప్రారంభ ప్రైమరీ గ్రేడ్-I మరియు గ్రేడ్-II ఉన్నాయి. ఈ విధానం ప్రీ-స్కూల్ నుండి గ్రేడ్- II వరకు పిల్లలకు అవాంతరాలు లేని అభ్యాసాన్ని మరియు అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. అంగన్‌వాడీలు లేదా ప్రభుత్వ/ప్రభుత్వ-సహాయం పొందిన, ప్రైవేట్ మరియు ఎన్‌జీఓ ఆధ్వర్యంలోనడిచే ప్రీస్కూల్ సెంటర్‌లలో చదువుతున్న పిల్లలందరికీ మూడు సంవత్సరాల నాణ్యమైన ప్రీస్కూల్ విద్యను అందించడం నిర్ధారించడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది.అంతేకాకుండా పునాది దశలో ఉన్న అతి ముఖ్యమైన అంశం వయస్సు మరియు అభివృద్ధికి తగిన పాఠ్యాంశాలు మరియు బోధనా విధానంలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన అర్హతగల ఉపాధ్యాయుల లభ్యత కలిగి ఉండటం. ఫౌండేషన్ స్టేజ్ (ఎన్‌సిఎఫ్‌-ఎఫ్‌ఎస్‌) కోసం నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్ కూడా ఇటీవల 20.10.2022న ప్రారంభించబడింది.

ఈ దృక్పథాన్ని నెరవేర్చడానికి పాఠశాల విద్య & అక్షరాస్యత శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ డి.ఓ. లెటర్ 22-7/2021-ఈఈ.19/ఐఎస్.13 తేదీ 09.02.2023న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేషన్‌లకు వారి వయస్సును పాలసీతో అడ్మిషన్ చేయడానికి మరియు గ్రేడ్-1కి అడ్మిషన్ అందించడానికి  6+ సంవత్సరాలు ఉండాలన్న ఆదేశాలను పునరుద్ఘాటించింది.

రాష్ట్రాలు తమ రాష్ట్రం మరియు యుటిలో రెండేళ్ల డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ (డిపిఎస్‌ఈ) కోర్సు రూపకల్పన మరియు అమలు ప్రక్రియను ప్రారంభించాలని కూడా సూచించబడింది. ఈ కోర్సును స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్‌సిఈఆర్‌టి) రూపొందించి ఎస్‌సిఈఆర్‌టిల పర్యవేక్షణ మరియు హోల్డ్‌లో డిస్ట్రిక్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ & ట్రైనింగ్ (డైట్స్‌) ద్వారా అమలు చేయాలని భావిస్తున్నారు.


 

****


(Release ID: 1901373) Visitor Counter : 258