హోం మంత్రిత్వ శాఖ
కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు
ఒక పిల్లవాడు తన మాతృభాషలో చదివి, మాట్లాడి, ఆలోచించినప్పుడు, అది అతనిలో ఆలోచించే, తర్కించే, విశ్లేషించే, పరిశోధించే సామర్థ్యాన్ని పెంచుతుంది
దీన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 'నూతన విద్యా విధానం' ద్వారా మాతృభాషలో విద్యకు ప్రాధాన్యమిచ్చింది. ఇది భారత దేశ ఉజ్వల భవిష్యత్తుకు ఆధారమవుతుంది
మన మాతృభాష తో అనుసంధానం కావడానికి, మరింత అభివృద్ధి చెందడానికి తీర్మానించు కోవాల్సిన రోజు ఇది
ఒక వ్యక్తి తన మాతృ భాషను సుసంపన్నం చేసినప్పుడే దేశంలోని అన్ని భాషలు అభివృద్ధి చెందుతాయి, దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది, మీ మాతృభాషను గరిష్టంగా ఉపయోగించుకుంటామని ప్రతిజ్ఞ చేయండి.
Posted On:
21 FEB 2023 1:16PM by PIB Hyderabad
కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
కేంద్ర హోంమంత్రి ఈ మేరకు సామాజిక మాధ్యమం ద్వారా ట్వీట్ చేస్తూ, అందరికీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మన మాతృభాష తో అనుసంధానమై మరింత అభివృద్ధి చెందేలా తీర్మానం చేయాల్సిన రోజు ఇదే నని ఆయన పిలుపునిచ్చారు. ఒక వ్యక్తి తన మాతృ భాషను సుసంపన్నం చేసినప్పుడే దేశంలోని అన్ని భాషలూ సుభిక్షంగా ఉంటాయనీ, దేశం కూడా సుభిక్షంగా ఉంటుందనీ, ఆయన పేర్కొన్నారు. మాతృభాషను గరిష్టంగా వినియోగించుకుంటామని మనం ప్రతిజ్ఞ చేయాలని ఆయన కోరారు.
ఒక పిల్లవాడు తన మాతృభాషలో చదివినప్పుడు, మాట్లాడినప్పుడు, ఆలోచించినప్పుడు, అది అతనిలో ఆలోచించే, తర్కించే, విశ్లేషించే, పరిశోధన చేసే సామర్థ్యాన్ని పెంపొందిస్తుందని శ్రీ అమిత్ షా అభిప్రాయపడ్డారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం 'నూతన విద్యా విధానం' ద్వారా మాతృభాషలో విద్యకు ప్రాధాన్యతనిచ్చిందని, ఆయన పేర్కొన్నారు. ఇది భారత దేశ ఉజ్వల భవిష్యత్తుకు ఆధారం అవుతుందని, ఆయన సూచించారు.
*****
(Release ID: 1901096)
Visitor Counter : 229