యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

సెకండ్ ర్యాంకింగ్ సిరీస్ లో పాల్గొనేందుకు 27 మంది రెజ్లర్ల బృందానికి పర్యవేక్షణ కమిటీ అనుమతి

Posted On: 20 FEB 2023 12:39PM by PIB Hyderabad

రానున్న రెండో ర్యాంకింగ్ సిరీస్ 'ఇబ్రహీం-మౌస్తఫా' టోర్నమెంట్ లో పాల్గొనేందుకు 27 మంది రెజ్లర్లతో సహా 43 మంది సభ్యుల బృందానికి యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ (ఎంవైఏఎస్) పర్యవేక్షణ కమిటీ ఆమోదం తెలిపింది.

ఈజిప్టులోని అలెగ్జాండ్రియాలో ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు జరిగే ఈ టోర్నీ సీనియర్ ఆసియా చాంపియన్ షిప్ 2023, సీనియర్ వరల్డ్ ఛాంపియన్ షిప్ 2023లో మెరుగైన సీడింగ్ కోసం ర్యాంకింగ్ పాయింట్లు సాధించడానికి కీలకం కానుంది.

భారత జట్టులో 9 మంది ఫ్రీస్టైల్ రెజ్లర్లు, 8 మంది మహిళా రెజ్లర్లు, 10 మంది గ్రీకో-రోమన్ రెజ్లర్లతో పాటు 16 మంది కోచ్ లు, , సహాయక సిబ్బంది ఉంటారు.

27 మంది రెజ్లర్లలో 3 టార్గెట్ ఒలింపిక్స్ పోడియం స్కీమ్ (టాప్స్) రెజ్లర్లు - అషు 67 కిలోల జిఆర్, భటేరి 65 కిలోల డబ్ల్యుడబ్ల్యు ,సుజీత్ 65 కిలోల ఎఫ్ఎస్.

కూడా ఉన్నారు.

భారత జట్టు పాల్గొనడం గురించి ఒలింపిక్ పతక విజేత, పర్యవేక్షక కమిటీ చైర్ పర్సన్ ఎంసి మేరీ కోమ్ మాట్లాడుతూ, "క్రీడ , అథ్లెట్లు దెబ్బతినకుండా చూడాలని మేము కోరుకుంటున్నాము.ఎక్కువ మంది రెజ్లర్లకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుంది, తద్వారా వారు ప్రపంచంలోని ఉత్తమమైన వారితో పోటీపడే అవకాశం లభిస్తుంది" అని అన్నారు.

 

ఇప్పటి వరకు తొమ్మిది మంది ప్రస్తుత, మాజీ ప్రపంచ ఛాంపియన్ షిప్ స్వర్ణ పతక విజేతలు రెండో ర్యాంకింగ్ సిరీస్ కోసం రిజిస్టర్ చేసుకున్నారు.

 

రెజ్లర్ల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

*****



(Release ID: 1900775) Visitor Counter : 167