ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత్, సింగపూర్ మధ్య ఫిబ్రవరి 21న రెండు దేశాల రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్స్ లింకేజీ ప్రారంభం : వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించనున్న ఇరు దేశాల ప్రధానులు


భారత్ కు చెందిన యు పి ఐ ,, సింగపూర్ కు చెందిన పేనౌ మధ్య ప్రారంభం కానున్నక్రాస్ బోర్డర్ కనెక్టివిటీ

రెండు దేశాల చెల్లింపు వ్యవస్థల అనుసంధానం వల్ల వేగంగా, తక్కువ చార్జీతో డబ్బు బదిలీకి వీలు

సింగపూర్ - భారత్ మధ్య పరస్పర నగదు బదిలీలో సింగపూర్ లోని ప్రవాస భారతీయులకుప్రయోజనం

Posted On: 20 FEB 2023 12:52PM by PIB Hyderabad

భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, సింగపూర్ ప్రధాన మంత్రి శ్రీ లీ సియెన్ లూంగ్ 2023 ఫిబ్రవరి 21న ఉదయం 11 గంటలకు భారత దేశానికి చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యుపిఐ) , సింగపూర్ కు చెందిన పే నౌ మధ్య సీమాంతర అనుసంధానం ప్రారంభాన్ని వీడియో కాన్ఫ రెన్స్ ద్వారా వీక్షిస్తారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) గవర్నర్ శ్రీ శక్తికాంత దాస్, మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ (ఎంఎఎస్) మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రవి మీనన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

 

ఫిన్ టెక్ ఇన్నోవేషన్ కోసం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పర్యావరణ వ్యవస్థలలో ఒకటిగా భారత్ అవతరించింది. భారతదేశపు అత్యుత్తమ డిజిటల్ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్లోబలైజేషన్ ను నడిపించడంలో ప్రధాని నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వం కీలక పాత్ర పోషించింది. యుపిఐ ప్రయోజనాలు కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాకుండా, ఇతర దేశాలు కూడా దీని నుండి ప్రయోజనం పొందేలా చూసేందుకు ప్రధాన మంత్రి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.

 

రెండు చెల్లింపు వ్యవస్థల అనుసంధానం రెండు దేశాల నివాసితులకు సీమాంతర చెల్లింపులను వేగంగా ,తక్కువ ఖర్చుతో బదిలీ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇది సింగపూర్ లోని భారతీయ ప్రవాసులకు, ముఖ్యంగా వలస కార్మికులు ,విద్యార్థులకు తక్షణ, తక్కువ ఖర్చుతో డబ్బు బదిలీ సౌలభ్యం కల్పిస్తుంది.

 

***


(Release ID: 1900739) Visitor Counter : 222