రైల్వే మంత్రిత్వ శాఖ
నెల రోజుల పాటు కీలక భద్రత తనిఖీ కార్యక్రమాలు చేపట్టిన భారతీయ రైల్వే
प्रविष्टि तिथि:
19 FEB 2023 3:13PM by PIB Hyderabad
ఈ రోజు నుంచి నెల రోజుల పాటు కీలక భద్రత తనిఖీ కార్యక్రమాలను భారతీయ రైల్వే శాఖ నిర్వహిస్తుంది, రైళ్లు పట్టాలు తప్పడాన్ని నివారించడం, ప్రమాద సమయంలో సందేశాలు పంపడం (ఎస్‌పీఏడీ), ఇతర రకాల ప్రమాదాలను అరికట్టడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రమాదాలు లేదా అసాధారణ సంఘటనలను నిరోధించడానికి వివిధ విభాగాలు, లాబీలు, నిర్వహణ కేంద్రాలు, పని ప్రదేశాలు వంటి వాటికి వెళ్లి నిర్దేశించిన సురక్షిత నిర్వహణ పద్ధతులు ఉన్నాయో, లేదో తనిఖీ చేయాలని, సరైన పని విధానాలు అమలయ్యేలా సమీక్షించాలని రైల్వే బోర్డు, ప్రాంతీయ రైల్వే, డివిజన్లకు చెందిన సీనియర్ అధికారులకు ఆదేశాలు అందాయి. రైలు డ్రైవర్లు సిగ్నలింగ్, బ్రేకింగ్ పద్ధతులు పాటించడం; వేగ పరిమితులను పాటించడం; ట్రాక్ మెషీన్లు/టవర్ వ్యాగన్ల ఆపరేటర్లకు కౌన్సెలింగ్; పని ప్రాంతంలో రక్షణ; పని ఎగవేతలను నివారించడం వంటి వాటికి ఈ కార్యక్రమంలో ప్రాధాన్యత ఇచ్చారు. సెక్షన్/లాబీ/నిర్వహణ కేంద్రాలు/పని ప్రాంతాల్లో కార్యకలాపాలు/నిర్వహణ/పని విధానాలను గమనించడానికి, సిబ్బందితో మాట్లాడడానికి తగినంత సమయం వెచ్చించాలని అధికారులకు సూచనలు అందాయి. సరైన, తప్పుడు పని విధానాల గురించి సిబ్బందికి వివరించాలని, క్షేత్ర సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకుని పరిష్కారాలు సూచించాలని ఉన్నతాధికారులకు సూచనలు అందాయి.
***
(रिलीज़ आईडी: 1900608)
आगंतुक पटल : 223