ప్రధాన మంత్రి కార్యాలయం

స్పెయిన్ ప్ర‌ధాని శ్రీ పెడ్రో సాంచెజ్‌ తో టెలిఫోన్ లో మాట్లాడిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

పరస్పర హితం ముడిపడ్డ అనేక ద్వైపాక్షిక మరియు అంతర్జాతీయ విషయాలపై చర్చించిన నేత లు; రక్షణ రంగం, ఆర్థిక రంగం మరియు వాణిజ్య రంగం లలో సహకారం పెరుగుతూ ఉండడం పై సమీక్ష జరిపారు

డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, జలవాయు సంబంధి కార్యాచరణ, స్వచ్ఛ శక్తి వైపునకు మళ్లడం మరియు నిలకడతనం తో కూడిన అభివృద్ధి వంటి రంగాల లో సహకరించుకోవడాని కి వారు సమ్మతి ని వ్యక్తం చేశారు
జి20 కోసం భారతదేశం ప్రాధాన్యాల ను స్పెయిన్ ప్రధాని కి వివరించిన ప్రధాన మంత్రి; జి20 కి భారతదేశం అధ్యక్ష బాధ్యతల ను నిర్వర్తించే క్రమం లో చేపట్టబోయే కార్యక్రమాల కు పూర్తి సమర్ధన ను ప్రకటించిన ప్రధాని శ్రీ పెడ్రో సాంచెజ్‌

Posted On: 15 FEB 2023 9:09PM by PIB Hyderabad

స్పెయిన్ ప్ర‌ధాని శ్రీ పెడ్రో సాంచెజ్‌ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ ద్వారా మాట్లాడారు.

నేత లు ఇరువురు పరస్పర హితం ముడిపడ్డ అనేక ద్వైపాక్షిక అంశాల ను గురించి మరియు అంతర్జాతీయ అంశాల ను గురించి చర్చించారు. ప్రస్తుతం అమలవుతున్నటువంటి ద్వైపాక్షిక కార్యక్రమాల ను వారు సమీక్షించారు. ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి ఆదాన ప్రదానం, రక్షణ రంగం లో, ఆర్థిక రంగం లో మరియు వాణిజ్య రంగం లో సహకారం పెరుగుతూ ఉండడం పట్ల వారు సంతృప్తి ని వ్యక్తం చేశారు. డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, జలవాయు సంబంధి కార్యాచరణ, స్వచ్ఛ శక్తి వైపున కు మళ్లడం మరియు నిలకడతనం తో కూడిన అభివృద్ధి వంటి అంశాల లో సహకరించుకోవాలని వారు వారి యొక్క సమ్మతి ని వ్యక్తం చేశారు.

భారతదేశం జి20 కి భారతదేశం అధ్యక్షత వహించే కాలం లో చేపట్టబోయే ప్రాధాన్య కార్యక్రమాల ను గురించి స్పెయిన్ ప్రధాని దృష్టి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీసుకు వచ్చారు. వీటిలో భాగం గా భారతదేశం ‘వసుధైవ కుటుంబకమ్’ (ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు) అనే సిద్ధాంతం ఆధారం గా ఏకాత్మ భావన ను ప్రోత్సహించడం కోసం కృషి చేస్తున్నట్లు వివరించారు. జి20 కి అధ్యక్ష బాధ్యతల ను స్వీకరించిన భారతదేశం తన హయాం లో అవలంబించే కార్యక్రమాల కు స్పెయిన్ ప్ర‌ధాని శ్రీ పెడ్రరో సాంచెజ్‌ పూర్తి సమర్థన ను వ్యక్త పరచారు.

 

నేత లు ఉభయులూ క్రమం తప్పక సంప్రదింపులు జరుపుకొంటూ ఉండడానికి అంగీకరించారు. 

 

 

***



(Release ID: 1899766) Visitor Counter : 169