ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజీ వద్ద ‘ఆరోగ్యం కోసం సైకిల్’ ర్యాలీ నిర్వహించిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
ఈరోజు దేశవ్యాప్తంగా 1.56 లక్షల ఆయుష్మాన్ భారత్ - హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్లలో మెగా సైక్లింగ్ కార్యక్రమంతో పాటు ఇతర కార్యకలాపాల నిర్వహణ
ఏడాది పొడవునా ఆరోగ్యకరమైన జీవనం గురించి అవగాహన కల్పించి ప్రోత్సహించడం లక్ష్యంగా "స్వస్థ మాన్, స్వస్థ ఘర్"లో భాగంగా చేపట్టిన కార్యక్రమాల నిర్వహణ
Posted On:
14 FEB 2023 10:58AM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య ,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈరోజు లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజీలో ‘ఆరోగ్యం కోసం సైకిల్’ అనే నినాదంతో సైక్లాథాన్‌ను నిర్వహించింది. కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శారీరక, మానసిక సంరక్షణ అవసరం పై ప్రజల్లో అవగాహన కల్పించి ప్రోత్సహించడంతో పాటు పర్యావరణ అనుకూలమైన రవాణా వ్యవస్థ అవసరాన్ని ప్రజలకు విస్తరించాలన్న లక్ష్యంతో మంత్రిత్వ శాఖ సైకిల్ ర్యాలీలతో పాటు ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
సైక్లథాన్, సైకిల్ ర్యాలీ లేదా ‘ఆరోగ్యం కోసం సైకిల్’ పేరుతో మంత్రిత్వ శాఖ ఈ రోజు మొత్తం 1.56 లక్షల ఆయుష్మాన్ భారత్ – హెల్త్ అండ్ వెల్ నెస్ కేంద్రాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. గత ఏడాది నవంబర్‌లో ప్రారంభించిన “స్వస్థ మాన్, స్వస్థ ఘర్” ఏడాది పొడవునా ప్రచారంలో భాగంగా ఈ కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఆరోగ్యకరమైన జీవన విధానంపై అవగాహనను ప్రోత్సహించడం మెరుగుపరచడం లక్ష్యంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి.యోగా, జుంబా, టెలి కన్సల్టేషన్, నిశ్చయ్ పోషణ్ అభియాన్, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఔషధాల పంపిణీ, మరియు డ్రగ్ డిస్ట్రిబ్యూషన్, రక్తహీనత పరీక్షలు దేశంలోని అన్ని ఆయుష్మాన్ భారత్ - హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్లలో నిర్వహించడంతో పాటు ప్రతి నెల 14వ తేదీన ఆరోగ్య మేళాలు కూడా నిర్వహిస్తారు.
ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమానికి మరింత ప్రచారం కల్పించడానికి సైకిల్ తొక్కడం పట్ల ఉత్సాహం చూపిస్తూ “గ్రీన్ ఎంపీ” అని గుర్తింపు పొందిన కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఆరోగ్యం, ఫిట్‌నెస్ కోసం సైకిల్ తొక్కాలని ప్రజలను సూచించారు. లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఆరోగ్యం, శరీర దృఢత్వానికి ప్రాధాన్యత ఇస్తూ శారీరక, మానసిక ఆనందం పొందాలని కోరారు. శారీరక శ్రమ అనేక అంటువ్యాధులు, జీవనశైలి వల్ల సంక్రమించే వ్యాధులను దూరం చేస్తుందని మంత్రి పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో పాల్గొనాలని కేంద్ర ఆరోగ్య మంత్రి నిన్న పోస్ట్ చేసిన ట్వీట్‌లోఆయన కోరారు.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన మెగా సైక్లింగ్ ఈవెంట్ దృశ్య మాలిక
***
(Release ID: 1899105)
Visitor Counter : 203