గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫిబ్రవరి 16న న్యూఢిల్లీలోని ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో జాతీయ ఆది మహోత్సవ్ ను ప్రారంభిస్తారు: శ్రీ అర్జున్ ముండా
28 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 1000 మంది గిరిజన చేతి వృత్తుల వారు, కళాకారులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు.
గ్లోబల్ వార్మింగ్ సవాలును ఎదుర్కోవడంలో గిరిజనులు ఉత్పత్తి చేసే సేంద్రియ ఉత్పత్తుల పాత్ర కీలకం: శ్రీ అర్జున్ ముండా
17 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 39 వాన్ ధన్ వికాస్ కేంద్రాలు ఈ మహోత్సవ్ లో పాల్గొంటాయి.
Posted On:
13 FEB 2023 6:54PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఫిబ్రవరి 16న న్యూఢిల్లీ లోని మేజర్ ధ్యాన్ చంద్ జాతీయ స్టేడియంలో జాతీయ ఆది మహోత్సవ్ ను ప్రారంభిస్తారు. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అర్జున్ ముండా ఈ రోజు న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రేణుకా సరుత కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
మహోత్సవ్ లో భాగంగా వివిధ స్టాళ్లలో ప్రదర్శించే ఉత్పత్తుల గురించి ప్రధాన మంత్రికి వివరిస్తారని, గిరిజన సమూహాలకు చెందిన కమ్యూనిటీలకు చెందిన హస్తకళాకారులు , చేతి వృత్తుల వారితో ప్రధానమంత్రి ముచ్చటిస్తారని శ్రీ అర్జున్ ముండా తెలియజేశారు.
ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతను సాకారం చేయడంలో గిరిజన వర్గాల పూర్తి భాగస్వామ్యం, ప్రమేయం ఉండేలా గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్ని ప్రయత్నాలు చేస్తోందని మంత్రి తెలిపారు. గిరిజనులు సేంద్రియ ఉత్పత్తుల ఉత్పత్తికి ప్రాధాన్యమివ్వడం గ్లోబల్ వార్మింగ్ సవాలును ఎదుర్కోవడంలో పెద్ద పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించే ఆది మహోత్సవాల్లో పాల్గొనేందుకు మారుమూల ప్రాంతాల నుంచి తక్కువ తెలిసిన, ప్రత్యేకమైన వస్తువులను తయారు చేసే కళాకారులను మరింతగా ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి తెలిపారు. గిరిజన ఉత్పత్తులను జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలోకి తీసుకురావడానికి ఆది మహోత్సవ్ ప్రధాన వేదిక అని ఆయన అన్నారు.
గిరిజన ఉత్పత్తుల్లో నాణ్యత, సమకాలీన డిజైన్లను నిర్ధారించడానికి, అదే సమయంలో వాటి సహజత్వాన్ని కాపాడటానికి ట్రైఫెడ్ ఉన్నత స్థాయి డిజైనర్లతో సంప్రదింపులు జరుపుతోందని మంత్రి తెలిపారు.
ట్రైఫెడ్ ఫ్లాగ్ షిప్ ఈవెంట్ ప్రస్తుత ఎడిషన్ "గిరిజన హస్తకళలు, సంస్కృతి, వంటకాలు , వాణిజ్య సమాహార స్ఫూర్తి దాయక వేడుక" ఇతివృత్తాన్ని కలిగి ఉంది, ఇది గిరిజన జీవితాల ప్రాథమిక నైతికతకు ప్రాతినిధ్యం వహిస్తుంది.
ఈ ఫెస్టివల్ లో గిరిజన హస్తకళలు, చేనేత, పెయింటింగ్స్, ఆభరణాలు, చెరకు, వెదురు, మట్టి వస్తువులు, ఆహారం సహజ ఉత్పత్తులు, బహుమతులు, గిరిజన వంటకాలు మొదలైన ఎన్నో వాటిని 200 స్టాల్స్ ద్వారా ఎగ్జిబిషన్ కం సేల్ లో ప్రదర్శించనున్నారు.
28 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 1000 మందికి పైగా గిరిజన చేతి వృత్తి కళాకారులు, కళాకారులు ఈ ఫెస్టివల్ లో పాల్గొంటారు. ఇందులో 19 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన గిరిజన వంటవారు ఉన్నారు, వారు తయారు చేసే వంటకాల కోసం కోసం 20 ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. చిరుధాన్యాలు గిరిజన సమాజాల ఆహారంలో అంతర్భాగంగా ఉన్నాయి. భారత ప్రభుత్వ ప్రతిపాదన ఆదేశాల మేరకు ఐక్యరాజ్యసమితి 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. ఈ సందర్భంగా, గిరిజన చిరుధాన్యాల ఉత్పత్తి వినియోగాన్ని పెంచడానికి, అవగాహన కల్పించడానికి , దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన చేతివృత్తుల వారిని చిరుధాన్యాల (శ్రీ అన్న) ఉత్పత్తులు వంటకాలను ప్రదర్శించడానికి, విక్రయించడానికి ఈ ఉత్సవానికి
ఆహ్వానించారు.
వాన్ ధన్ ఉత్పత్తుల అమ్మకాలు, ప్రదర్శన కోసం ప్రత్యేక పెవిలియన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. 17 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 39 వాన్ ధన్ వికాస్ కేంద్రాలు ఈ మహోత్సవ్ లో పాల్గొంటాయి. ఈ ఫెస్టివల్ లోని ఇతర ముఖ్యాంశాలు:
గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల గ్యాలరీ
జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (ఎన్ సిఎస్ టి) ద్వారా గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల గాథలు, ఎన్ సిజెడ్ సిసి ద్వారా రోజుకు రెండుసార్లు వారి కథలను వినిపిస్తారు.
ఇఎంఆర్ఎస్
నేషనల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నాలజీ ఆధారిత జోక్యాలపై వివిధ రంగాలలోనూ, ఇఎంఆర్ఎస్ పాఠశాలల్లోనూ ఉన్నత విజయాలు సాధించిన పూర్వ విద్యార్థుల గురించి సమాచారాన్ని అందిస్తారు. 2023 గణతంత్ర దినోత్సవం సందర్భంగా మొదటి బహుమతి పొందిన గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ శకటాన్ని కూడా ప్రదర్శనకు ఉంచనున్నారు.
ఎన్ ఎస్ టి ఎఫ్ డి సి
గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ట్రైబల్ స్టార్టప్ లతో సహా షెడ్యూల్డ్ తెగలకు అందించబడుతున్న వివిధ పథకాలు , ఆర్థిక సహాయం గురించి
ఎన్ ఎస్ టి ఎఫ్ డి సి ద్వారా సమాచారాన్ని అందిస్తారు.
తపాలా శాఖ
మారుమూల ప్రాంతాల్లో తమ పథకాలతో పాటు గిరిజన పోస్టల్ స్టాంపుల ప్రదర్శన ను తపాలా శాఖ నిర్వహిస్తుంది.
ఈ కార్యక్రమంలో దేశంలోని సుమారు 20 రాష్ట్రాలకు చెందిన సుమారు 500 మంది గిరిజన కళాకారులు గిరిజన ఆచారాలు, పంటలు, పండుగలు, యుద్ధ కళలు మొదలైన వాటి పై గిరిజన సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రదర్శనలు గొప్ప గిరిజన సాంస్కృతిక వైవిధ్యాన్ని ఈ కార్యక్రమంలో చాటి చెబుతాయి.
ప్రధాన నగరాల్లో ఆది మహోత్సవ్ ను నిర్వహించడం మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పెద్ద మార్కెట్లలో నేరుగా ప్రవేశానికి గిరిజన కళాకారులకు వరంగా మారింది.
భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ట్రైఫెడ్ సంస్థ పెద్ద మెట్రోలు ,రాష్ట్ర రాజధానులలో గిరిజన చేతి వృత్తుల పురుష, మహిళ కళాకారులకు ప్రత్యక్ష మార్కెట్ ప్రాప్యతను అందించడానికి "ఆది మహోత్సవ్ - నేషనల్ ట్రైబల్ ఫెస్టివల్" ను నిర్వహిస్తోంది.
*****
(Release ID: 1898973)
Visitor Counter : 223