పర్యటక మంత్రిత్వ శాఖ

భారతదేశ జీ20 ప్రెసిడెన్సీలో జరిగిన మొదటి టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశం గుజరాత్‌లోని రాన్ ఆఫ్ కచ్‌లో నేడు విజయవంతంగా ముగిసింది


అన్ని సభ్య దేశాలు, ఆహ్వానిత దేశాలు మరియు అంతర్జాతీయ సంస్థలతో మొత్తం 5 కీలక ప్రాధాన్యతా అంశాలు చర్చల కోసం ఆమోదించబడ్డాయి

ప్రతినిధులు వైట్ రాన్‌లో సూర్యోదయ సమయంలో యోగా సెషన్‌లో పాల్గొన్నారు అనంతరం ధోలావిరాలోని యునెస్కో ప్రపంచ వారసత్వ పురావస్తు ప్రదేశాన్ని సందర్శించారు

Posted On: 10 FEB 2023 2:06PM by PIB Hyderabad

భారతదేశ  జీ20 ప్రెసిడెన్సీలో ఫిబ్రవరి 7 నుండి 10వ తేదీ వరకూ గుజరాత్‌లోని రాన్ ఆఫ్ కచ్‌లో జరిగిన మొదటి టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశం ఈరోజు ముగిసింది. ఈ సమావేశంలో రెండు సైడ్ ఈవెంట్‌లు, ప్రారంభ సెషన్, గుర్తించబడిన ఐదు ప్రాధాన్యతలపై రెండు రోజుల కార్యవర్గ సమావేశాలు, ద్వైపాక్షిక సమావేశాల శ్రేణి మరియు విహార యాత్రలు ఉన్నాయి.

కార్యవర్గ సమావేశానికి ముందుగా ఫిబ్రవరి 7వ తేదీ సాయంత్రం ‘కమ్యూనిటీ సాధికారత మరియు పేదరిక నిర్మూలన కోసం గ్రామీణ పర్యాటకం’ అనే అంశంపై సైడ్ ఈవెంట్ జరిగింది. ప్యానెల్ చర్చలో ప్యానెలిస్టులు గ్రామీణ పర్యాటక రంగంలోని ఉత్తమ పద్ధతులు, విజయగాథలు, అవకాశాలు మరియు సమస్యలను హైలైట్ చేస్తూ ప్రదర్శనలు ఇచ్చారు  మరియు చర్చలు నిర్వహించారు. ఒక ప్రత్యేక కార్యక్రమంలో ధోర్డో విలేజ్ హెడ్ (సర్పంచ్) శ్రీ మియా హుస్సేన్ గుల్ బేగ్..పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు రన్ ఉత్సవ్ వంటి పర్యాటక ప్రోత్సాహక కార్యకలాపాల యొక్క సానుకూల ప్రభావాన్ని అలాగే గ్రామ ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగ అవకాశాల కల్పనపై హైలైట్ చేశారు.

ప్రారంభ సమావేశానికి గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ. భూపేంద్ర భాయ్ పటేల్, పర్యాటక, సాంస్కృతిక మరియు దాత శ్రీ. జి. కిషన్ రెడ్డి; మరియు కేంద్ర మంత్రి శ్రీ పర్షోత్తం రూపాలా, మత్స్య, పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ శాఖ మంత్రి హాజరయ్యారు.

ప్రారంభ సెషన్‌లో భారతీయ ప్రముఖులు భారతీయ పర్యాటక ప్రాంతాలు, పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు, పర్యాటకుల భద్రత, పర్యాటక రంగంలో డిజిటలైజేషన్ మరియు స్థానిక ఆర్థిక వ్యవస్థ మరియు ఉపాధిపై పర్యాటక ప్రభావంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

కార్యవర్గ సమావేశంలో గ్రీన్ టూరిజంతో సహా ఐదు ప్రాధాన్యతాంశాలను గుర్తించిన ఇండియన్ ప్రెసిడెన్సీపై చర్చలు జరిగాయి. వాటిలో "సుస్థిరమైన, బాధ్యతాయుతమైన మరియు స్థితిస్థాపకమైన పర్యాటక రంగం కోసం పర్యాటక రంగానికి పచ్చదనం"; డిజిటలైజేషన్: “పర్యాటక రంగంలో పోటీతత్వాన్ని మరియు స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి డిజిటలైజేషన్ శక్తిని ఉపయోగించడం”; నైపుణ్యాలు: “పర్యాటక రంగంలో ఉద్యోగాలు మరియు వ్యవస్థాపకత కోసం నైపుణ్యాలతో యువతకు సాధికారత కల్పించడం”; టూరిజం ఎంఎస్ఎంఈలు: “పర్యాటక రంగంలో ఆవిష్కరణలు మరియు చైతన్యాన్ని వెలికితీసేందుకు టూరిజం ఎంఎస్ఎంఈలు/స్టార్టప్‌లు/ప్రైవేట్ రంగాన్ని పెంపొందించడం” మరియు డెస్టినేషన్ మేనేజ్‌మెంట్: “ఎస్‌డీజీలపై అందించే సమగ్ర విధానం వైపు గమ్యస్థానాల వ్యూహాత్మక నిర్వహణపై పునరాలోచన” వంటి అంశాలు ఉన్నాయి. అన్ని జీ20 సభ్య దేశారు,అతిథి దేశాలు మరియు అంతర్జాతీయ సంస్థల ద్వారా చర్చల కోసం సెట్ చేయబడిన 5 కీలక ప్రాధాన్యతా అంశాలు ఆమోదించబడ్డాయి.

కార్యవర్గ సమావేశం చివరి రోజున ‘పురావస్తు పర్యాటకానికి ప్రోత్సాహం: భాగస్వామ్య సాంస్కృతిక వారసత్వాన్ని కనుగొనడం’ అనే అంశంపై సెకండ్ సైడ్  కార్యక్రమం నిర్వహించబడింది. ప్యానెల్ చర్చలో వక్తలు పురావస్తు ప్రదేశాల పరిరక్షణ మరియు అటువంటి ప్రదేశాలలో ఎదుర్కొంటున్న సవాళ్లపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. స్థానిక కమ్యూనిటీల సాధికారత మరియు స్థిరమైన జీవనోపాధి కోసం పురావస్తు పర్యాటకాన్ని ప్రోత్సహించడం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా వారు హైలైట్ చేశారు. పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీ అరవింద్ సింగ్ తన ముగింపులో మాట్లాడుతూ పురావస్తు పర్యాటకం స్థానిక సమాజాల సామాజిక ఆర్థిక అభివృద్ధిని స్థిరమైన రీతిలో అందించగలదని అన్నారు.

ధోర్డో టెంట్ సిటీలో ఉన్న సమయంలో ప్రతినిధులు వైట్ రాన్‌లో సూర్యోదయ సమయంలో యోగా సెషన్‌కు హాజరయ్యే అవకాశం లభించింది. ప్రతినిధులు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ధోలవీరాకు చెందిన హరప్పా ప్రదేశాన్ని కూడా సందర్శించారు.  ధోలవీరా వద్ద సమర్థవంతమైన  నీటి నిర్వహణ గురించి ఇక్కడ ప్రతినిధులకు వివరించబడింది. ప్రతినిధులకు స్థానిక కచ్చి కళలు మరియు సంప్రదాయాల గురించి కూడా అవగాహన కల్పించారు. సాంస్కృతిక సాయంత్రం సందర్భంగా వారు కూడా ఉత్సాహంగా జానపద కళాకారులతో కలిసి నృత్య ప్రదర్శన చేశారు.

ప్రతినిధులు బయలుదేరే ముందు భుజ్‌లోని అత్యాధునిక స్మృతివన్ భూకంప స్మారక మ్యూజియాన్ని కూడా సందర్శించారు.

 

image.png

image.png

image.png


గోవాలో జరిగే మంత్రివర్గంతో సహా మరో మూడు సమావేశాల కోసం టూరిజం వర్కింగ్ గ్రూప్ మళ్లీ సమావేశమవుతుంది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి ఒక మంత్రి స్థాయి కమ్యూనిక్ మరియు పర్యాటకం కోసం గోవా రోడ్‌మ్యాప్ ప్రణాళికాబద్ధమైన కార్యక్రమాలు ఉన్నాయి.

image.png

 

జీ20 టూరిజం ట్రాక్‌కు చెందిన నాలుగు జీ20 సమావేశాలతో పాటు భారతదేశ జీ20 ప్రెసిడెన్సీ కాలంలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి మూడు మెగా ఈవెంట్‌లు కూడా ప్లాన్ చేయబడ్డాయి. పర్యాటక మంత్రిత్వ శాఖ న్యూ ఢిల్లీలో ఏప్రిల్/మేలో మొదటి గ్లోబల్ టూరిజం ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జిటిఐఎస్)ని నిర్వహించనుంది; మేలో మైస్ గ్లోబల్ కాన్ఫరెన్స్; మరియు జూన్‌లో జీ20 టూరిజం సీఈఓ ఫోరంను కూడా మంత్రిత్వ శాఖ నిర్వహించనుంది.



*****



(Release ID: 1898145) Visitor Counter : 245