రైల్వే మంత్రిత్వ శాఖ

వాట్సప్ ద్వారా ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్: కొత్త సర్వీసును ప్రారంభించిన భారతీయ రైల్వే

Posted On: 06 FEB 2023 1:10PM by PIB Hyderabad

ఈ-క్యాటరింగ్ సేవల ద్వారా  రైల్వే ప్రయాణికులు తమకు కావలసిన ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి భారతీయ రైల్వే అనుబంధ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ  ఐఆర్సిటిసి వాట్సాప్ సేవలను ప్రారంభించింది.

 వాట్సాప్ నెంబర్ +91-8750001323 ద్వారా  రైల్వే ప్రయాణికులు తమకు కావలసిన ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు. ఇంటర్ యాక్టీవ్ నెంబర్ గా పనిచేసే +91-8750001323 రెండు వైపులా సంభాషణకు వీలు కల్పిస్తుంది.

ఈ-క్యాటరింగ్ సేవలకు సంబంధించి ప్రయాణికుల అన్ని సందేహాలను నివృత్తి చేయడంతో పాటు వారి భోజనం ఆర్డర్ కూడా ఏఐ పవర్ చాట్ బాట్ తీసుకుంటుంది.

ఎంపిక చేసిన రైళ్లు, ప్రయాణికులకు ఈ-క్యాటరింగ్ సేవల సౌకర్యం కోసం రూపొందించిన వాట్సాప్ సేవలు అందుబాటులోకి వస్తాయి.

ప్రయాణికుల నుంచి అందిన అభిప్రాయాలు, సూచనలు ఆధారంగా ఈ సౌకర్యాన్ని ఇతర రైళ్లలో ఐఆర్సిటిసి ప్రవేశపెడుతుంది.

ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన వెబ్ సైట్ www.catering.irctc.co.in, ద్వారా భారతీయ రైల్వే కు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ రైల్వే కాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్సీటీసీ) -క్యాటరింగ్ యాప్ ఫుడ్ ఆన్ ట్రాక్ ద్వారా ఈ-క్యాటరింగ్ సేవలను ప్రారంభించింది.

వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని భారతీయ రైల్వే శాఖ ఆన్ లైన్ విధానంలో ప్రయాణికులు తమకు కావలసిన ఆహారాన్ని పొందడానికి వీలు కల్పిస్తూ ఇటీవల వాట్సాప్ నెంబర్ +91-8750001323ను అందుబాటులోకి తెచ్చింది. ఈ-క్యాటరింగ్ సేవలు ద్వారా  ప్రయాణికులకు మరింత సౌలభ్యం అందించే విషయంలోమరో అడుగు ముందుకేసింది.

 

వాట్సాప్ సౌకర్యం రెండు దశల్లో అమలు జరుగుతుంది. మొదటి దశలో బిజినెస్ వాట్సాప్ నెంబర్ ఈ-టికెట్ తీసుకున్న ప్రయాణీకులకు ఈ- క్యాటరింగ్ పొందే అవకాశాన్ని www.ecatering.irctc.co.in.ద్వారా కల్పిస్తుంది.
ఈ సౌకర్యాన్ని ఎంచుకునే ప్రయాణికులు తమకు నచ్చిన ఆహారాన్ని తాము ప్రయాణిస్తున్న మార్గంలో ఉన్న స్టేషన్లలో పనిచేస్తున్న రెస్టారెంట్ల ద్వారా బుక్ చేసుకోవడానికి వీలవుతుంది. యాప్ ను డౌన్లోడ్ చేసుకోకుండా ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు.
రెండవ దశలో వాట్సాప్ నెంబర్ ప్రసార సాధనంగా పనిచేస్తుంది.

ఈ-క్యాటరింగ్ సేవలకు సంబంధించి ప్రయాణికుల అన్ని సందేహాలను నివృత్తి చేయడంతో పాటు వారి భోజనం ఆర్డర్ ను  కూడా ఏఐ పవర్ చాట్ బాట్ తీసుకుంటుంది.

తొలుత ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన రైళ్లలో ఈ-క్యాటరింగ్ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. ప్రయాణికుల నుంచి అందిన అభిప్రాయాలు, సూచనలు ఆధారంగా ఈ సౌకర్యాన్ని ఇతర రైళ్లలో ఐఆర్సిటిసి ప్రవేశపెడుతుంది.

ప్రస్తుతం ప్రతిరోజూ ఈ-క్యాటరింగ్ సౌకర్యం ద్వారా ఐఆర్సిటిసి తన వెబ్ సైట్ ద్వారా 50000 భోజనాలు సరఫరా చేస్తోంది.  

   

 

ఈ -కేటరింగ్ సేవలను మరింత కస్టమర్ కేంద్రీకృతం చేసే దిశగా భారతీయ రైల్వే

***



(Release ID: 1896815) Visitor Counter : 178