ఆర్థిక మంత్రిత్వ శాఖ
విస్త్రత శ్రేణి సంస్కరణలు, బలమైన విధానాలపై భారత్ దృష్టిపెట్టిన ఫలితంగా సంక్షోభ సమయంలో స్థితిస్థాపకతను ప్రదర్శించగలిగింది
క్లిష్ట సమయంలో తోడ్పడిన సబ్‌కా ప్రయాస్ & జన్ భాగీదారీ
విశిష్టైన ప్రపంచ స్థాయి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, అసమానమైన కోవిడ్ టీకాకరణ కార్యక్రమం, మిషన్ లైఫ్, హైడ్రొజెన్ మీషన్ వంటి విజయాల ఫలితంగా అంతర్జాతీయంగా పెరుగుతున్న భారత్ ప్రొఫైల్
Posted On:
01 FEB 2023 1:32PM by PIB Hyderabad
బహుళ సంక్షోభాల నడుమ భారత్ ప్రదర్శించిన స్థితిస్థాపకతను ప్రశంసిస్తూ, ఆ ఘనత విస్త్రత సంస్కరణలు, బలమైన విధానాలపై దేశం దృష్టి పెట్టడానికే దక్కుతుందని, కేంద్ర ఆర్థిక & కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
సబ్ కా ప్రయాస్ ఫలితంగా ఉద్భవించిన జన్‌భాదీదారీ (ప్రజల భాగస్వామ్యం) ద్వారా అమలు జరిగిందన్నారు. ఇది పేదలకు తోడ్పాటునందించే లక్ష్యంతో జరిగిందని, ఇవి క్లిష్ట సమయంలో మనం బాగా పని చేయడానికి సహాపడ్డాయని ఆమె వివరించారు.
అంతర్జాతీయంగా పెరుగుతున్న భారత్ ప్రొఫైల్ః
కేంద్ర బడ్జెట్ 2023-24ను బుధవారం పార్లమెంటులో ప్రవేశపెడుతూ, అనేక విజయాల కారణంగా భారత్ అంతర్జాతీయ ప్రొఫైల్ పెరుగుతోందని ఆర్ధిక మంత్రి నొక్కి చెప్పారు. ఇందులో -
విశిష్టమైన ప్రపంచస్థాయి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉదాః యుపిఐ, కో-విన్, ఆధార్.
అసమాన స్థాయిలో, వేగంతో కోవిడ్ టీకాకరణ డ్రైవ్
వాతావరణ సంబంధిత లక్ష్యాలను సాధించేందుకు సరిహద్దు ప్రాంతాలలో చురుకైన, సానుకూల పాత్ర
మిషన్ లైఫ్
జాతీయ హైడ్రోజెన్ (ఉదజని) మిషన్
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పిఎంజికెఎవై)
కోవిడ్ -19 మహమ్మారి కాలంలో చేసిన కృషిని పట్టి చూపుతూ, ఎవరూ ఆకలితో నిద్రపోకూడదన్న ఉద్దశ్యంతో 28 నెలల పాటు దాదాపు 80 కోట్లమందికి ఉచిత ఆహార ధాన్యాల సరఫరా చేసేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్టు శ్రీమతి సీతారామన్ పేర్కొన్నారు. ఆహార, పౌష్టికాహార భద్రతను ఖరారు చేయాలన్న మా నిబద్ధతను కొనసాగిస్తూ, రానున్న ఏడాది పాటు అంత్యోదయ, ప్రాధాన్యత గల కుటుంబాలకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పిఎంజికెఎవై) కింద 1 జనవరి 2023 నుంచి ఉచిత ఆహార ధాన్యాల సరఫరా పథకాన్ని అమలు చేస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు. దీనికయ్యే మొత్తం వ్యయం సుమారు రూ. 2 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వమే భరాయిస్తుందని ఆర్ధిక మంత్రి తెలిపారు.
***
(Release ID: 1895606)
Visitor Counter : 328