ఆర్థిక మంత్రిత్వ శాఖ
అమృత కాల దార్శనికతకు చిహ్నం-‘2023-24 బడ్జెట్’; సాధికార, సమ్మిళిత ఆర్థిక వ్యవస్థకు బ్లూ ప్రింట్
నాలుగు పరిణామాత్మక అవకాశాలతో ముక్కోణ దృక్పథం అమృత కాలానికి పునాది
అమృతకాల దార్శనికతకు మార్గదర్శనం చేసే ఏడు ప్రధానే అంశాలే సప్తర్షి మండలం
సంప్రదాయ హస్తకళా నిపుణులకు కొత్త పథకం – పిఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ ప్రకటన
Posted On:
01 FEB 2023 1:34PM by PIB Hyderabad
కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖామంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంటుకు సమర్పించిన 2023-24 కేంద్ర బడ్జెట్ లో అమృత్ కాల దార్శనికతను సూత్ర ప్రాయంగా వివరించారు. ఇది సాధికార, సమ్మిళిత ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబిస్తుందన్నారు. “సుసంపన్నమైన, సమ్మిళిత భారతదేశాన్ని స్వప్నిస్తున్నాం. అభివృద్ధి ఫలాలు అన్ని ప్రాంతాలకూ, ప్రజలకూ అందుతాయి. మరీ ముఖ్యంగా యువతకు, మహిళలాలకు, రైతులకు ఓబీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అందుతాయి” అన్నారు.
అమృత్ కాల్ దార్శనికత: సాధికార, సమ్మిళిత ఆర్థిక వ్యవస్థ
అమృత కాలానికి మన దార్శనికతలో టెక్నాలజీ ఆధారిత, జ్ఞాన సంపదతో కూడిన ఆర్థిక వ్యవస్థ, బలమైన ప్రజా ఆర్థిక బలం, చురుకైన ఆర్థిక రంగం చాలా కీలకమని మంత్రి అన్నారు. దీన్ని సాధించటానికి సబ్ కా సాథ్ సబ్ కా ప్రయాస్ ద్వారా జన భాగీదారీ ముఖ్యమన్నారు.
ఈ లక్ష్య సాధనకు ఆర్థిక ఎజెండా మూడు అంశాలమీద దృష్టి సారిస్తుంది:
పౌరులకు విస్తృత అవకాశాలు కల్పించటం, ముఖ్యంగా యువత తమ ఆకాంక్షలు నెరవేర్చుకోవటానికి అవకాశమివ్వటం
ఎదుగుదలకు, ఉద్యోగ సృష్టికి తగిన ప్రోత్సాహమివ్వటం
స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేయటం
ఈ అంశాల మీద దృష్టి సారిస్తూ వందేళ్ల స్వతంత్ర భారత దేశానికి చేసే యాత్రలో ఈ బడ్జెట్ నాలుగు పరిణామాత్మక అంశాలమీద దృష్టిపెట్టింది.
స్వయం సహాయక బృందాల ద్వారా మహిళల ఆర్థిక సాధికారత:
దీన దయాళ్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ చెప్పుకోదగిన విజయం సాధించిందని, ఇది 81 స్వయం సహాయక బృందాలకు గ్రామీణ మహిళలను సమీకరించటం ద్వారా ఇది సాధ్యమైందని మంత్రి అన్నారు. ఈ బృందాలు తరువాత దశకు ఎదిగి ఆర్థిక సాధికారత సాధించేలా పెద్ద సంస్థలు నెలకొల్పటానికి ప్రోత్సహించి వేలాది మంది సభ్యులతో వృత్తి నిపుణుల సాయంతో నిర్వహించేట్టు చూస్తామన్నారు. వారు తమ ఉత్పత్తులకు మెరుగైన డిజైన్, ముడి సరకు, నాణ్యత, బ్రాండింగ్, మార్కెటింగ్ లాంటివి పొందగలిగేలా సాయపడతామని చెప్పారు. వారికి అండగా నిలిచే విధానాల రూపకల్పన వలన వారు తమన కార్యకలాపాలను ఎపమచ్చుకోవటానికి , పెద్ద మార్కెట్లకు తగినట్టు సరఫరా చేయటానికి వీలుకలుగుతుందని, తద్వారా యూనికార్న్ సంస్థల తరహాలో ఎదిగే వీలుంటుందని చెప్పారు. .
పి ఎం విశ్వ కర్మ కౌశల్ సమ్మాన ( పిఎం వికాస్)
విశ్వ కర్మలుగా పిలిచే సంప్రదాయ హస్త కళాకారులకు కేంద్ర ఆర్థికమంత్రి కొత్త పథకం ప్రకటించారు. వాళ్ళు సృష్టించే కళారూపాలు ఆత్మ నిర్భర భారత్ కు నిజమైన స్ఫూర్తి అని ఆమె అభివర్ణించారు. మొదటి సారిగా వాళ్లకోసం ఒక పాకేజ్ ప్రకటిస్తున్నామన్నారు.
ఈ కొత్త పథకం
(a) నాణ్యత మెరుగు పరచుకోవటానికి, తయారీ పరిమాణం పెంచటానికి, తమ ఉత్పత్తుల అందుబాటు పెంచుకోవటానికి, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలలో సమీకృతం చేయటానికి సహాయపడుతుంది.
(b) కేవలం ఆర్థిక సహాయం అందజేయటమే కాకుండా అత్యాధునిక నైపుణ్య శిక్షణ, ఆధునిక డిజిటల్ టెక్నిక్ లు నేర్పటం, సమర్థవంతమైన కాలుష్యరహిత టెక్నాలజీల వినియోగం, బ్రాండ్ ప్రమోషన్, స్థానిక మార్కెట్లను అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం చేయటం, డిజిటల్ చెల్లింపులు, సామాజిక భద్రత అందిస్తుంది
(c) షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఓబీసీలు, మహిళలు బలహీన వర్గాలకు చెందినవారు ఎక్కువగా లబ్ధిపొందుతారు.
అత్యవసరంగా పర్యాటకరంగ ప్రోత్సాహం
దేశంలో పర్యాటక రంగానికున్న అవకాశాల దృష్ట్యా స్వదేశీ, విదేశీ పర్యాటకులకు అవకాశాలు మెరుగుపడుతున్నాయని గుర్తు చేశారు. ఇందులోనే ఉద్యోగాలకు, వ్యాపారాలకు యువతకు అనేక అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని మంత్రి చెప్పారు. ఇంకా వాడుకోని అనేక అవకాశాలను వెలికి తీయాలని సూచించారు. పర్యాటకరంగాన్ని అత్యవసరంగా ప్రోత్సాహిస్తామన్నారు. రాష్ట్రాలు పాల్గొనటం, ప్రైవేట్-ప్రభుత్వ భాగస్వామ్యాలు చాల కీలకమవుతాయని మంత్రి చెప్పారు.
కాలుష్య రహిత పురోగతి
భారత ప్రభుత్వ దృష్టి కాలుష్య రహిత పురోగతి మీదనే ఉన్నదని కేంద్ర ఆర్థికమంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. కాలుష్య తీవ్రత తగ్గించటం కోసం జరిగే కృషిలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడతాయన్నారు. కాలుష్య రహిత ఇంధనం కాలుష్య రహిత వ్యవసాయం, కాలుష్య రహిత రవాణా, భవనాలు, పరికరాల కోసం అనేక కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయన్నారు. వివిధ ఆర్థిక రంగాలలో ఇందుకు అవసరమైన విధానాలు అమలు చేస్తున్నామన్నారు.
సప్తర్షి : బడ్జెట్ 2023-24 కు ఏడు మార్గదర్శక ప్రాధాన్యాలు
కేంద్ర ఆర్థిక మంత్రి ఈ అమృత కాలపు తొలి బడ్జెట్ ప్రకటించారు. దీన్ని ఏడు ప్రాధాన్యాలు మార్గదర్శనం చేస్తాయని ఒకదానికొకటి అవి సప్తారషి మండలం అవుతాయని అన్నారు.
1) సమ్మిళిత అభివృద్ధి
2) చిట్టచివరి దాకా చేరటం
3) మౌలిక వసతులు, పెట్టుబడి
4) సామర్థ్యాన్ని వెలికితీయటం
5) కాలుష్యరహిత పురోగతి
6) యువ శక్తి
7) ఆర్థిక రంగం
సబ్ కా సాథ్ సబ్ కా వికాస్
కేంద్ర బడ్జెట్ 2023-24లో కీలక అంశం సమ్మిళిత అభివృద్ధి మీద దృష్టిపెట్టటం. ప్రభుత్వ సిద్ధాంతమైన సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ సమ్మిళిత అభివృద్ధికి దోహదం చేసిందని, ముఖ్యంగా రైతులు, మహిళలు, యువత, ఓబీసీలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, దివ్యాంగులు, ఆర్థికంగా వెనుకబడినవారు, మొత్తంగా బడుగు బలహీన వర్గాల వారు అందులో భాగ్యమయ్యారన్నారు. జమ్ము కాశ్మీర్ మీద, లద్దాఖ్ మీద ఈశాన్య రాష్ట్రాలమీద కూడా ప్రత్యేక దృష్టి కొనసాగుతోందని, ఈ కృషిమీద ఆధారపడే ఈ బడ్జెట్ రూపకల్పన జరిగిందని చెప్పారు.
***
(Release ID: 1895605)
Visitor Counter : 661
Read this release in:
Malayalam
,
Kannada
,
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil