ఆర్థిక మంత్రిత్వ శాఖ

ప్రభుత్వ ఉద్యోగులకు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి, ప్రజా సేవా కేంద్రీకృత విధానానికి దోహదపడే అవకాశాలను మిషన్ కరమియోగి అందిస్తుంది: ఆర్థిక మంత్రి


అగ్రశ్రేణి విద్యాసంస్థల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం మూడు ఎక్స్ లెన్స్ సెంటర్లు

అజ్ఞాత డేటా తెలుసుకునే నేషనల్ డేటా గవర్నెన్స్ పాలసీ

సరళీకృత కె వై సి ప్రక్రియ కోసం ఆర్థిక రంగ రెగ్యులేటర్లకు ప్రోత్సాహం

డిజిలాకర్, ఆధార్ ఉపయోగించి గుర్తింపు, చిరునామాను అప్ డేట్ చేయడానికి వన్ స్టాప్ సొల్యూషన్

అన్ని ప్రభుత్వ ఏజెన్సీ వ్యవస్థల కోసం వ్యాపారాల ద్వారా కామన్ ఐడెంటిఫయర్ గా పాన్ ఉపయోగం

ప్రభుత్వ సంస్థలకు ఒకే సమాచారాన్ని విడిగా సమర్పించాల్సిన అవసరాన్ని నివారించడానికి ఏకీకృత ఫైలింగ్ ప్రక్రియ

Posted On: 01 FEB 2023 1:20PM by PIB Hyderabad

సామాన్య పౌరుల అభ్యున్నతి, సంక్షేమం కోసం పనిచేసే పారదర్శక, జవాబుదారీ పాలన అందించాలన్న ప్రభుత్వ దార్శనికతను వివరిస్తూ కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంటులో 2023-24 కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.అమృత్ కాల్ ద్వారా దేశానికి మార్గనిర్దేశనం చేస్తున్న ఏడు ప్రాధాన్యాల్లో ఒకటైన 'సప్తర్షి'లో 'అన్ లీజింగ్ ది పొటెన్షియల్' ఒక ముఖ్యమైన అంశంగా ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001C2GE.jpg

 

మిషన్ కర్మయోగి

 

మిషన్ కర్మయోగి కింద కేంద్రం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సివిల్ సర్వెంట్ల కోసం సామర్థ్యాన్ని పెంపొందించే ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తున్నాయని ఆర్థిక మంత్రి అన్నారు. లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు వారి నైపుణ్యాలను మెరుగుపరచడానికి అభ్యాస అవకాశాన్ని కల్పించడానికి ఐజిఒటి కర్మయోగి చొరవను ఆర్థిక మంత్రి ప్రముఖంగా వివరించారు.

 

ట్రస్ట్ ఆధారిత పాలనను ప్రోత్సహించడం

 

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం 39,000 కాంప్లయన్స్ తగ్గించామని, 3,400కు పైగా చట్టపరమైన నిబంధనలను తొలగించామని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. 42 కేంద్ర చట్టాలను సవరించే జన్ విశ్వాస్ బిల్లును కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

 

ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాన్ని వెలికితీసేందుకు ఆర్థిక మంత్రి పలు చర్యలను ప్రతిపాదించారు.

 

సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

 

 'మేక్ ఏఐ ఇన్ ఇండియా, మేక్ ఏఐ వర్క్ ఫర్ ఇండియా' అనే దార్శనికతను సాకారం చేసేందుకు ప్రముఖ విద్యాసంస్థల్లో కృత్రిమ మేధస్సు కోసం మూడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

వ్యవసాయం, ఆరోగ్యం , సుస్థిర నగరాలు వంటి వివిధ రంగాలలో ఇంటర్ డిసిప్లినరీ పరిశోధనలు నిర్వహించడం, అత్యాధునిక అనువర్తనాలు , స్కేలబుల్ సమస్య పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో ప్రముఖ పరిశ్రమ సంస్థలు భాగస్వాములు అవుతాయని, తద్వారా సమర్థవంతమైన ఎ ఐ పర్యావరణ వ్యవస్థను ఉత్తేజపరుస్తాయని ,నాణ్యమైన మానవ వనరులను పెంపొందిస్తాయని ఆర్థిక మంత్రి ప్రకటించారు.

 

నేషనల్ డేటా గవర్నెన్స్ పాలసీ

 

అంకుర సంస్థలు, విద్యావేత్తల ఆవిష్కరణలు, పరిశోధనలకు ఊతమిచ్చేందుకు జాతీయ డేటా గవర్నెన్స్ పాలసీని ప్రతిపాదించారు.

 

భారతదేశం కోసం డిజిటల్ పరిష్కారాలు

 

‘వన్ సైజ్ ఫిట్స్ ఆల్' విధానానికి బదులుగా 'రిస్క్ బేస్డ్' విధానాన్ని అవలంబిస్తూ కేవైసీ ప్రక్రియను సులభతరం చేయనున్నారు. డిజిటల్ ఇండియా అవసరాలను తీర్చడానికి పూర్తిగా అనుకూలమైన కెవైసి వ్యవస్థను కలిగి ఉండటానికి ఆర్థిక రంగ నియంత్రణ సంస్థలను కూడా ప్రోత్సహిస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు.

 

 డిజిలాకర్ సేవ మరియు ఆధార్ ను ప్రధాన గుర్తింపుగా ఉపయోగించి వివిధ ప్రభుత్వ సంస్థలు, నియంత్రణ సంస్థలు నియంత్రిత సంస్థలచే నిర్వహించబడే వ్యక్తుల గుర్తింపు ,చిరునామాను సర్దుబాటు చేయడానికి ,నవీకరించడానికి వన్ స్టాప్ పరిష్కారాన్ని ఏర్పాటు చేయాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు.

 

సులభ వ్యాపారం

 

శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) కలిగి ఉండాల్సిన వ్యాపార సంస్థలకు, నిర్దిష్ట ప్రభుత్వ సంస్థల అన్ని డిజిటల్ వ్యవస్థలకు పాన్ ను కామన్ ఐడెంటిఫైయర్ గా ఉపయోగిస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు.

 

ఒకే సమాచారాన్ని వేర్వేరు ప్రభుత్వ సంస్థలకు వేర్వేరుగా సమర్పించాల్సిన అవసరాన్ని నివారించడానికి 'యూనిఫైడ్ ఫైలింగ్ ప్రాసెస్' వ్యవస్థను కూడా ప్రతిపాదించారు. కామన్ పోర్టల్ లో సరళీకృత ఫారాల్లో సమాచారం లేదా రిటర్నులు దాఖలు చేయడం, ఫైల్ చేసేవారి ఇష్టానుసారం ఇతర ఏజెన్సీలతో పంచుకోబడుతుందని ఆమె తెలిపారు.

 

***

 (Release ID: 1895603) Visitor Counter : 244