ప్రధాన మంత్రి కార్యాలయం
ఝార్ ఖండ్ లోని ధన్ బాద్ లో మంటలు రేగి ప్రాణనష్టం వాటిల్లినందుకుసంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి
పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి పరిహారాన్నిప్రకటించారు
Posted On:
31 JAN 2023 11:45PM by PIB Hyderabad
ఝార్ ఖండ్ లోని ధన్ బాద్ లో ఒక అగ్ని ప్రమాదం జరిగిన కారణం గా ప్రాణనష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.
ఈ ప్రమాదం లో ప్రాణాల ను కోల్పోయిన వారి దగ్గరి సంబంధికుల కు 2 లక్షల రూపాయల వంతున మరియు ఈ దుర్ఘటన లో గాయపడిన వ్యక్తుల కు 50,000 రూపాయల వంతున ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి ఇవ్వడం జరుగుతుందని కూడా ప్రధాన మంత్రి ప్రకటించారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -
‘‘ధన్ బాద్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటన కారణం గా ప్రాణనష్టం వాటిల్లిన విషయం తెలిసి ఎంతో బాధ పడ్డాను. ప్రియతముల ను కోల్పోయిన వ్యక్తుల కు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఈ దుర్ఘటన లో గాయపడిన వారు త్వరలోనే పునః స్వస్థత ను పొందుదురు గాక: ప్రధాన మంత్రి @narendramodi’’
‘‘ధన్ బాద్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటన లో మృతుల దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి 2 లక్షల రూపాయల వంతున పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది. క్షతగాత్రుల కు 50,000 రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుంది: ప్రధాన మంత్రి@narendramodi’’ అని తెలిపింది.
*******
DS/ST
(Release ID: 1895499)
Visitor Counter : 170
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam