ఆర్థిక మంత్రిత్వ శాఖ
మధ్యతరగతికి గణనీయంగాప్రయోజనం చేకూర్చేలా వ్యక్తిగత ఆదాయపు పన్నులో కీలక ప్రకటనలు
రూ. 7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు కొత్త పన్నువిధానంలో ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదుపన్ను మినహాయింపు పరిమితి రూ.3 లక్షలకుపెంపు
పన్ను విధానంలో మార్పు: శ్లాబుల సంఖ్య ఐదుకు తగ్గింపు
కొత్త పన్నువిధానానికి ప్రామాణిక తగ్గింపు ప్రయోజనాన్ని పొడిగించడం ద్వారా వేతన జీవులు మరియుపెన్షనర్లు ప్రయోజనం పొందుతారుగరిష్ట పన్నురేటు 42.74 శాతం నుంచి 39 శాతానికి తగ్గింపు
డిఫాల్ట్ట్యాక్స్ గా కొత్త పన్ను విధానంపాత పన్ను విధానం యొక్క ప్రయోజనాన్నిపొందేందుకు పౌరులు ఎంపికను కలిగి ఉంటారు
Posted On:
01 FEB 2023 12:57PM by PIB Hyderabad
దేశంలోని కష్టపడి పనిచేసే మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో, కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంటులో 2023-24 కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడుతూ వ్యక్తిగత ఆదాయపు పన్నుకు సంబంధించి ఐదు ప్రధాన ప్రకటనలు చేశారు. రిబేట్, పన్ను నిర్మాణంలో మార్పు, స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనాన్ని కొత్త పన్ను విధానానికి పొడిగించడం, అత్యధిక సర్ఛార్జ్ రేటు తగ్గింపు, ప్రభుత్వేతర వేతన ఉద్యోగుల పదవీ విరమణపై సెలవు ఎన్క్యాష్మెంట్పై పన్ను మినహాయింపు పరిమితిని పొడిగించడం వంటి ఈ ప్రకటనలు శ్రామిక మధ్యతరగతికి గణనీయమైన ప్రయోజనాలను అందిస్తాయి.
రాయితీకి సంబంధించి ఆమె మొదటి ప్రకటనలో, కొత్త పన్ను విధానంలో రాయితీ పరిమితిని రూ.7 లక్షలకు పెంచాలని ఆమె ప్రతిపాదించారు, అంటే కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తులు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు పాత, కొత్త పన్ను విధానంలో ఆదాయపు పన్ను చెల్లించడం లేదు.
మధ్యతరగతి వ్యక్తులకు ఉపశమనం కలిగించేలా, శ్లాబుల సంఖ్యను ఐదుకు తగ్గించడం, పన్ను మినహాయింపు పరిమితిని రూ.3 లక్షలకు పెంచడం ద్వారా కొత్త వ్యక్తిగత ఆదాయపు పన్ను విధానంలో పన్ను వ్యవస్థలో మార్పును ఆమె ప్రతిపాదించారు. కొత్త పన్ను రేట్లు ఇలా ఉన్నాయి.
మొత్తం ఆదాయం (రూ.)
|
రేటు (శాతం)
|
0-3 లక్షల వరకు
|
పన్ను లేదు |
3-6 లక్షల నుండి
|
5
|
6-9 లక్షల వరకు
|
10
|
9-12 లక్షల వరకు
|
15
|
12-15 లక్షల వరకు
|
20
|
15 లక్షలకు పైనే
|
30
|
దీంతో కొత్త విధానంలో పన్ను చెల్లింపుదారులందరికీ భారీ ఊరట లభించనుంది. రూ.9 లక్షల వార్షికాదాయం ఉన్న వ్యక్తి రూ.45,000 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఇది అతని లేదా ఆమె ఆదాయంలో 5 శాతం మాత్రమే. అంటే ఇప్పుడు చెల్లించాల్సిన రూ.60,000పై 25 శాతం తగ్గింపు. అదేవిధంగా రూ.15 లక్షల ఆదాయం ఉన్న వ్యక్తి రూ.1.5 లక్షలు లేదా తన ఆదాయంలో 10 శాతం మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతమున్న రూ.1,87,500 నుంచి 20 శాతం తగ్గింపు.
కొత్త పన్ను విధానానికి స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనాన్ని విస్తరించాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించినందున బడ్జెట్ యొక్క మూడవ ప్రతిపాదన వేతన వర్గానికి మరియు కుటుంబ పెన్షనర్లతో సహా పెన్షనర్లకు పెద్ద ఉపశమనం కలిగిస్తుంది. రూ.15.5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్న ప్రతి వేతన జీవికి రూ.52,500/- ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుతం వేతన జీవులకు రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్, రూ.15,000 వరకు ఫ్యామిలీ పెన్షన్ నుంచి మినహాయింపు ప్రస్తుతం పాత విధానంలో మాత్రమే అనుమతి ఉంది.
వ్యక్తిగత ఆదాయపు పన్నుకు సంబంధించి తన నాల్గవ ప్రకటనలో భాగంగా, శ్రీమతి నిర్మలా సీతారామన్ కొత్త పన్ను విధానంలో రూ.2 కోట్లకు పైగా ఆదాయంపై అత్యధిక సర్ఛార్జ్ రేటును 37 శాతం నుండి 25 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించారు. దీంతో గరిష్ట పన్ను రేటు 42.74 శాతం నుంచి 39 శాతానికి తగ్గనుంది. అయితే, ఈ ఆదాయ గ్రూపులో పాత విధానంలో ఉండాలనుకునే వారికి సర్ ఛార్జీలో ఎలాంటి మార్పును ప్రతిపాదించలేదు.
- ప్రకటనలో భాగంగా ప్రభుత్వ వేతన వర్గానికి అనుగుణంగా ప్రభుత్వేతర వేతన ఉద్యోగుల పదవీ విరమణపై సెలవు ఎన్క్యాష్మెంట్పై పన్ను మినహాయింపు పరిమితిని రూ.25 లక్షలకు పెంచాలని బడ్జెట్లో ప్రతిపాదించారు. ప్రస్తుతం గరిష్టంగా రూ.3 లక్షల వరకు మినహాయింపు పొందొచ్చు.
కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని శాశ్వత పన్ను వ్యవస్థగా మార్చాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. అయితే, పౌరులు కూడా పాత పన్ను విధానాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది.
****
(Release ID: 1895470)
Visitor Counter : 419