ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
హర్ ఘర్ ధ్యాన్ ప్రచారం కింద ధ్యానం, మానసిక ఆరోగ్యం పై ఒక గంట పరిచయ సెషన్‌ను నిర్వహించిన ఈశాన్యప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎడిఒఎన్ఇఆర్)
నాడు పోస్టు చేయడమైనది:
31 JAN 2023 10:37AM by PIB Hyderabad
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఆధ్వర్యంలో ఈశాన్యప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎండిఒఎన్ఇఆర్) హర్ ఘర్ ధ్యాన్ ప్రచారంలో భాగంగాతమ అధికారులు/ సిబ్బందికి ధ్యానం, మానసిక ఆరోగ్యం పై ఒక గంట పరిచయ సెషన్‌ను న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ అనెక్స్‌లో నిర్వహించింది.
ఈ సెషన్‌కు ఆర్ట్ ఆఫ్ లివింగ్ నుంచి వచ్చిన ఆరుణిమా సిన్హా, సుయష్ రాజ్ శివంలు అధ్యక్షత వహించారు.
ఈ సెషన్ లో పాలుపంచుకునేవారి మానసిక, భావోద్వేగ ఆరోగ్యంపై దృష్టి సారించి, సులువుగా స్వకరించి, సాధన చేయగల ధ్యానాన్ని పరిచయం చేయడమే కాక స్వీయ అభివృద్ధి అనే నిరంతర ప్రయాణానికి అవసరమైన పలు అంశాలను అందించింది.
సమీప భవిష్యత్తులో అన్ని వర్గాల ప్రజల మానసిక ఆరోగ్యం కోసం ధ్యాన సాధనను ముందుకు, నూతన ఎత్తులకు తీసుకువెళ్ళాలని ఎండిఒఎన్ఇఆర్ ఆశిస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 1895216)
సందర్శకుల సూచీ సంఖ్య : : 156