హోం మంత్రిత్వ శాఖ

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో శ్రీ స్వామినారాయణ్ సంస్థాన్ వడ్తాల్ నిర్మించిన ఎస్ జిఎంఎల్ కంటి ఆసుపత్రిని ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా


‘ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ యోజన ద్వారా దేశంలోని 80 కోట్ల మంది పేదలకు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయాలు కల్పించడమే కాకుండా వైద్య కళాశాలలు, ఎంబీబీఎస్ సీట్లు, పీజీ సీట్ల సంఖ్యను కూడా పెంచారు.’

‘ప్రజలకు అందుబాటు ధరల్లో ఆరోగ్య సౌకర్యాలు కల్పించేందుకు స్వామినారాయణ్ చూపిన ప్రజాసంక్షేమ మార్గంలో శ్రీ స్వామినారాయణ్ సంస్థాన్ వడ్తాల్ కృషి చేస్తున్నారు’

‘రూ.15 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ 50 పడకల ఆసుపత్రిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిరుపేద కంటి రోగులకు అందుబాటు ధరల్లో వైద్యం అందుతుంది.’

‘స్వామినారాయణ్ దేశమంతటా పర్యటించి విజ్ఞానాన్ని సంపాదించి, దానిని ప్రజలలో ప్రచారం చేసి యావత్ ప్రపంచం, ముఖ్యంగా గుజరాత్ సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారు’

‘స్వామినారాయణ్ వర్గం అనేక రకాల సామాజిక సేవ చేసింది, గుజరాత్ లోని స్వామినారాయణ్ వర్గానికి చెందిన అనేక సంస్థలు విద్యారంగంలో ఎంతో కృషి చేశాయి, ఈ వర్గం దేశంలోని కోట్లాది మంది యువతకు మాదకద్రవ్యాల వ్యసనం నుండి బయటపడటానికి సహాయపడటం ద్వారా గొప్ప పని చేసింది’

‘డీ-అడిక్షన్ అనేది స్వామినారాయణ్ కు చాలా ముఖ్యమైన విషయం. దానిని మతంతో కలపడం ద్వారా, ప్

Posted On: 30 JAN 2023 4:53PM by PIB Hyderabad

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో శ్రీ స్వామినారాయణ్ సంస్థాన్ వడ్తాల్ నిర్మించిన ఎస్ జిఎంఎల్ కంటి ఆసుపత్రిని కేంద్రహోం, , సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ తో సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

మహాత్మాగాంధీ 75వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించి అమిత్ షా తన ప్రసంగాన్ని ప్రారంభించారు. బాపూజీ భారత అహింసా సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడమే కాకుండా, దాన్ని స్థాపించారని ఆయన అన్నారు.

 

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని ధామ్ దేశంలోని కోట్లాది మంది భక్తులకు ఎల్లప్పుడూ విశ్వాస కేంద్రంగా ఉందని, వేదాల కాలం నుండి మన దేశ చరిత్రలో మహాకాళ్ ఆలయం చాలా ముఖ్యమైనదని కేంద్ర హోం మంత్రి అన్నారు. ఉజ్జయినిలోని అనేక దేవాలయాలు యావత్ ప్రపంచానికి ఆకర్షణ కేంద్రంగా మారాయని, ఇటీవల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉజ్జయిని వైభవాన్ని , దాని విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి 'మహాకాల్ లోక్' గొప్ప కారిడార్ ను ప్రారంభించారని ఆయన అన్నారు. మహాకాల్ లోక్ నిర్మాణంతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల భక్తికి కేంద్ర బిందువు మరింత బలపడింది.

 

ఈ రోజు ఇక్కడ ఒక కంటి ఆసుపత్రిని ప్రారంభిస్తున్నట్లు శ్రీ అమిత్ షా తెలిపారు. భగవాన్ స్వామినారాయణ్ ఉత్తరప్రదేశ్ నుంచి గుజరాత్ కు వచ్చి అక్కడే శాశ్వతంగా నివసిస్తున్నారని, దేశమంతా తిరుగుతూ జ్ఞానాన్ని సంపాదించి వచనామృతం ద్వారా ప్రజల్లో ప్రచారం చేశారని, యావత్ ప్రపంచానికి, ముఖ్యంగా గుజరాత్ ప్రజల సంక్షేమానికి ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. 200 సంవత్సరాల క్రితం ఆయన స్థాపించిన స్వామినారాయణ్ శాఖ ఎదుగుతూ నేడు భారతదేశంలో ధృవ తారలా ప్రకాశిస్తోందన్నారు.

 

స్వామినారాయణ్ వర్గం అనేక రకాల సేవలను అందించిందని హోం మంత్రి తెలిపారు. గుజరాత్ లోని స్వామినారాయణ్ వర్గానికి చెందిన వివిధ సంస్థలు విద్యారంగంలో ఎంతో కృషి చేశాయన్నారు. గుజరాత్ లోని స్వామినారాయణ్ వర్గానికి చెందిన వివిధ సంస్థలు విద్యారంగంలో ఎంతో కృషి చేశాయన్నారు. స్వామినారాయణ్ వర్గానికి చెందిన గురుకులాల్లో ధార్మిక విలువలతో పాటు పేద విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ఏర్పాట్లు చేశారని అన్నారు. విద్యారంగంతో పాటు దేశంలోని కోట్లాది మంది యువతకు మాదకద్రవ్యాల వ్యసనం నుంచి బయటపడేందుకు స్వామినారాయణ్ వర్గం ఎంతో కృషి చేసిందన్నారు. స్వామి నారాయణ్ భగవాన్ కు డీ అడిక్షన్ చాలా ముఖ్యమైన అంశమని, దానిని మతంతో కలపడం ద్వారా ప్రజలను మాదకద్రవ్యాల నుంచి విముక్తులను చేసేందుకు భారీ ప్రచారానికి శ్రీకారం చుట్టారన్నారు. 50 పడకల ఈ కంటి ఆసుపత్రి ప్రజలకు వివిధ రకాల కంటి వ్యాధుల నుంచి విముక్తి కల్పిస్తుందన్నారు. రూ.15 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ 50 పడకల ఆసుపత్రిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిరుపేద కంటి రోగులకు అందుబాటు ధరల్లో వైద్యం అందుతుందన్నారు.

 

ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ యోజన ద్వారా దేశంలోని 80 కోట్ల మంది పేద ప్రజలకు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయాలు కల్పించడమే కాకుండా వైద్య కళాశాలలు, ఎంబీబీఎస్ సీట్లు, పీజీ సీట్ల సంఖ్యను కూడా పెంచామని శ్రీ అమిత్ షా తెలిపారు.

80 కోట్ల మందికి రూ.5 లక్షల వరకు సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ కవరేజీని అందించడం ప్రపంచం లోనే మొదటి, ఏకైక ఉదాహరణ అని ఆయన అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం లోని ప్రభుత్వం వైద్య కళాశాలల సంఖ్యను 387 నుంచి 596కు, ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను 51 వేల నుంచి 89 వేలకు, పీజీ సీట్ల సంఖ్యను 31 వేల నుంచి 60 వేలకు పెంచిందని చెప్పారు. కాలేజీల సంఖ్యను 55 శాతం పెంచడం, ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను ఒకటిన్నర రెట్లు పెంచడం, ఎంఎస్, ఎండీ సీట్లను రెట్టింపు చేయడం ద్వారా భారతదేశ ఆరోగ్య మౌలిక సదుపాయాలు ఎంతో బలోపేతం అవుతాయని ఆయన అన్నారు.

 

భారత ప్ర భుత్వం 22 కొత్త ఎయిమ్స్ లను ఏర్పాటు చేసిందని, దీని ద్వారా పేదలకు ఎంతో మేలు జరుగుతుందని శ్రీ షా అన్నారు. యావత్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా భారతీయ భాషలో వైద్య విద్యను ప్రారంభించినందుకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ను శ్రీ షా అభినందించారు. ఎంబిబిఎస్ కోర్సు మొత్తాన్ని పూర్తిగా హిందీలోకి అనువదించడం ద్వారా శివరాజ్ సింగ్ చౌహాన్ భారతీయ భాషలకు కొత్త ఊపును అందించారని అన్నారు.

 

*****



(Release ID: 1894784) Visitor Counter : 162