భారత ఎన్నికల సంఘం
25 జనవరి 2023న 13వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకోనున్న భారత ఎన్నికల కమిషన్
ఓటింగ్ వంటిది మరొకటి లేదు, నేను ఖచ్చితంగా ఓటువేస్తాను అన్నది ఈ ఏడాది ఎన్‌విడి ఇతివృత్తం
Posted On:
24 JAN 2023 3:50PM by PIB Hyderabad
భారత ఎన్నికల కమిషన్ న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలోకేంద్ర న్యాయశాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు గౌరవ అతిథిగా పాల్గొంటారు.
ఓటు శక్తి ద్వారా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలన్న వ్యక్తి భావన, ఆకాంక్షను తెలియచేసే విధంగా ఈ ఏడాది ఇతివృత్తం ఎన్‌విడి, నథింగ్ లైక్ ఓటింగ్, ఓ ఓట్ ఫర్ ష్యూర్ ( ఓటింగ్ వంటిది లేదు, నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను)ను అంకితం చేశారు. ఎన్నికల ప్రక్రియ వేడుకను, సమ్మిళితత్వాన్ని ప్రతిఫలించే విధంగా లోగోను రూపొందించారు. నేపథ్యంలో ఉన్న అశోక చక్రం ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్యానికి ప్రాతినిధ్యం వహిస్తుండగా, వేలి మీద ఇంక్ దేశంలోని ప్రతి ఒక్క ఓటరు భాగస్వామ్యానికి ప్రాతినిద్యం వహిస్తుంది. లోగోపై ఉన్న టిక్ మార్కు ఓటరు అవగాహనతో కూడిన నిర్ణయానికి ప్రతినిధిగా నిలుస్తుంది.
న్యూఢిల్లీలో జరుగనున్న ఈ కార్యక్రమంలో గౌరవ రాష్ట్రపతి 2022 సంవత్సరానికి జాతీయ అవార్డులను అందచేస్తారు. ఈ అవార్డులను 2022లో జరిగిన ఎన్నికల సమయంలో ఐటి చొరవలు, భద్రతా నిర్వహణ, ఎన్నికల నిర్వహణ, అందుబాటులో ఎన్నికలు, ఎలక్టరల్ పట్టీ, ఓటరు అవగాహన క్షత్రం సహా ఓటరుకు చేరువ కావడం సహా పలు అంశాలు సహా ఉత్తమ ఎన్నికల పద్ధతులను పాటించి. అత్యుత్తమమైన ప్రతిభను కనబరచి, రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులకు ఇస్తారు. జాతీయ అవార్డులను ప్రభుత్వ శాఖ, మీడియా సంస్థల వంటి కీలక భాగస్వాములకు ఓటర్లలో అవగాహన కల్పించేందుకు దోహదం చేసినందుకు అందచేస్తారు.
ఇసిఐ (భారత ఎన్నికల కమిషన్) ప్రచురించిన, ఎలక్టింగ్ ది ఫస్ట్ ప్రెసిడెంట్- యాన్ ఇలస్ట్రేటెడ్ క్రానికల్ ఆఫ్ ఇండియాస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అన్న పుస్తక తొలి కాపీని ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ రాజీవ్ కుమార్ గౌరవ రాష్ట్రపతికి బహుకరిస్తారు. ప్రత్యేక ప్రచురణ అయిన ఈ పుస్తకం దేశంలోని రాష్ట్రపతి ఎన్నికల చారిత్రిక ప్రయాణం సంగ్రహావలోకనాన్ని ఇస్తుంది. గత 16 రాష్ట్రపతి ఎన్నికల కాలక్రమం ద్వారా రాష్ట్రపతి ఎన్నికల వ్యవస్థలో, అనుబంధ రాజ్యాంగ ప్రొవిజన్లలో ఉన్న సూక్ష్మ అంశాలపై వెలుగును ప్రసరిస్తుంది.
సుభాష్ ఘాయ్ ఫౌండేషన్ సహకారంతో ఇసిఐ రూపొందించిన మై భారత్ హూ- హమ్ భారత్ కె మత్‌దాతా హై అన్న పాటను కూడా ప్రదర్శించనున్నారు. ఓటు శక్తి ప్రాధాన్యతను పట్టి చూపడమే కాక ప్రపంచంలోని అతిపెద్ద, అత్యంత చైతన్యవంతమైన ప్రజాస్వామ్య సమ్మిళిత, అందుబాటులో, నైతిక, భాగస్వామ్య, వేడుకతో కూడిన ఎన్నికల స్ఫూర్తిని జరుపుకుంటుంది.
భారత ఎన్నికల కమిషన్‌ను 25 జనవరి, 1950లో ఏర్పాటు చేసిన సందర్భాన్ని నుంచి దాని వ్యవస్థాపకతను పురస్కరించుకొని 2011 నుంచి ప్రతి ఏడాది జనవరి 25ను జాతీయ ఎన్నికల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఎన్‌విడి వేడుక ప్రధాన ఉద్దేశ్యం పౌరులలో ఎన్నికల చైతన్యాన్ని సృష్టించి, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనవలసిందిగా వారిని ప్రోత్సహించడం. దేశంలోని ఓటర్లకు అంకితం చేసిన జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఓటర్ నమోదు, ముఖ్యంగా నూతన, అర్హత కలిగిన యువ ఓటర్లను నమోదు చేస్తారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఎన్‌విడి వేడుకలలో నూతన ఓటర్లను వారి ఎలక్టర్ ఫోటో ఐడెంటిటీ కార్డు (ఇపిఐసి)ను అందచేసి, సత్కరిస్తారు. ఎన్‌విడిని జాతీయ, రాష్ట్ర, జిల్లా, నియోజికవర్గ, పోలింగ్ బూతు స్థాయిల్లో జరుపుకుంటారు. దీనితో ఇది దేశంలో జరుపుకునే అతి పెద్ద వేడుకలలో ఒకటిగా ఉంటుంది.
***
(Release ID: 1893479)
Visitor Counter : 419