ప్రధాన మంత్రి కార్యాలయం

సర్వోన్నతన్యాయస్థానం తీర్పుల ను ప్రాంతీయ భాషల లో అందుబాటు లోకి తీసుకురావాలన్న భారతప్రధాన న్యాయమూర్తి యొక్క ఆలోచన ను స్వాగతించిన ప్రధాన మంత్రి

Posted On: 22 JAN 2023 5:05PM by PIB Hyderabad

సుప్రీం కోర్టు తీర్పుల ను ప్రాంతీయ భాషల లో అందుబాటులోకి తీసుకు రావాలి అనేటటువంటి ఆలోచన ను భారతదేశం ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) జస్టిస్ శ్రీ డి.వై. చంద్రచూడ్ వ్యక్తం చేసినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

గౌరవనీయులైన సిజెఐ జస్టిస్ శ్రీ డి.వై. చంద్రచూడ్ ఇటీవల ఒక కార్యక్రమం లో మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పుల ను ప్రాంతీయ భాషల లో లభ్యం అయ్యేటట్లుగా చేసే దిశ లో కృషి చేయవలసిన అవసరం ఉంది అని పేర్కొన్నారు. దీనికోసం సాంకేతిక విజ్ఞ‌ానాన్ని ఉపయోగించుకోవాలి అని కూడా ఆయన సూచన చేశారు. ఇది ఒక మెచ్చదగినటువంటి ఆలోచన. ఇది ఆచరణ లోకి వస్తే చాలా మంది ప్రజల కు మరీ ముఖ్యం గా యువజనుల కు సహాయకారి గా ఉంటుంది.’’ అని పేర్కొన్నారు.

ప్రధాన మంత్రి ఇంకా ఇలా అన్నారు..

‘‘భారతదేశం లో అనేక భాష లు ఉన్నాయి. ఆ భాష లు మన సాం స్కృతిక చైతన్యాన్ని బలోపేతం చేస్తున్నాయి. భారతీయ భాషల ను ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో ప్రయాసల ను చేపడుతోంది. ఆ ప్రయాసల లో ఇంజినీయరింగ్ మరియు వైద్యం వంటి సబ్జెక్టుల ను ఎవరైనా వారి యొక్క మా తృ భాష లో చదువుకొనే ఐచ్ఛికాన్ని ఇవ్వడం కూడా ఒకటి గా ఉంది.’’

******

DS/ST



(Release ID: 1892897) Visitor Counter : 163