ప్రధాన మంత్రి కార్యాలయం

జనవరి21 వ, 22 వ తేదీ లలో డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్/ఇన్స్ పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ యొక్క అఖిల భారతీయ సమ్మేళనం లో పాలుపంచుకోనున్నప్రధాన మంత్రి

Posted On: 20 JAN 2023 6:31PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2023 జనవరి 21-22 తేదీల లో న్యూ ఢిల్లీ లో నేశనల్ ఎగ్రికల్చరల్ సైన్స్ కాంప్లెక్స్, పూసా లో ఏర్పాటైన డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్/ ఇన్స్ పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ యొక్క అఖిల భారతీయ సమ్మేళనం లో పాలుపంచుకోనున్నారు.

 

ఈ సమ్మేళనాన్ని 2023 జనవరి 20వ తేదీ మొదలుకొని 22వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. ఈ సమ్మేళనం యొక్క నిర్వహణ హైబ్రిడ్ నమూనా లో ఉంటుంది. రాష్ట్రాల/ కేంద్ర పాలిత ప్రాంతాల డిజిపి లు మరియు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, ఇంకా కేంద్రీయ పోలీస్ సంస్థల ధిపతులు సహా దాదాపు గా వంద మంది ఆహ్వానితులు ఈ సమ్మేళనాని కి హాజరు కానున్నారు. కాగా ఆహ్వానితుల లో మిగిలిన వ్యక్తులు ఈ సమ్మేళనంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వర్చువల్ విధానం లో పాల్గొంటారు.

 

ఈ సమ్మేళనం సాగే క్రమం లో సైబర్ లోకం సంబంధి అపరాధాలు, పోలీస్ వ్యవస్థ లో సాంకేతిక విజ్ఞ‌ానం, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం లో ఎదురయ్యే సవాళ్లు, వామపక్ష తీవ్రవాదం, సామర్థ్య నిర్మాణం, కారాగార సంబంధి సంస్కరణ లు సహా అనేక అంశాల పై చర్చ లు జరుగుతాయి. ఫలానా ఇతివృత్తాల పై జిల్లా, రాష్ట్రం మరియు జాతీయ స్థాయిల లో పోలీసు అధికారుల ను మరియు రహస్య సమాచార అధికారుల ను చేర్చుకొని సాగించబోయేటటువంటి విస్తృత చర్చోపచర్చల పరిసమాప్తి గా ఈ సమ్మేళనం రూపు ను తీసుకోబోతోంది. వీటిలో నుండి ప్రతి ఒక్క ఇతివృత్తం లో భాగం గా రాష్ట్రాల/ కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క సర్వోత్తమ పద్ధతుల ను ఈ సమ్మేళనం లో ఆవిష్కరించడం జరుగుతుంది. ఇలా చేయడం ద్వారా, రాష్ట్రాలు ఒక దాని నుండి మరొకటి నేర్చుకొనేందుకు వీలు చిక్కుతుంది.

 

ప్రధాన మంత్రి 2014 వ సంవత్సరం నుండి డిజిపి సమ్మేళనం లో గాఢమైన ఆసక్తి ని కనబరుస్తూ వస్తున్నారు. ఇదివరకు ఈ సమ్మేళనం లో ప్రధాన మంత్రులు కేవలం ప్రతీకాత్మకంగా నే పాల్గొనడం జరిగేది; దీనికి భిన్నం గా, ఇప్పుడు ఈ సమ్మేళనం యొక్క అన్ని ప్రముఖ సమావేశాలన్నింటి కి ప్రధాన మంత్రి హాజరు అవుతున్నారు. ప్రధాన మంత్రి అన్ని విషయాల ను మరియు సూచనల ను ధైర్యపూర్వకం గా ఆలకించడం ఒక్కటే కాకుండా, స్వతంత్రమైనటువంటి మరియు లాంఛనప్రాయం కానటువంటి చర్చల ను ప్రోత్సహిస్తున్నారు కూడాను. ఇలా చేయడం ద్వారా, కొత్త కొత్త ఆలోచన లు వెల్లడి అయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. దీనితో దేశం లోని ప్రముఖ పోలీసు అధికారుల కు యావత్తు దేశాన్ని ప్రభావితం చేసేటటువంటి పోలీసు వ్యవస్థ మరియు ఆంతరింగిక సురక్ష తో ముడి పడ్డ ముఖ్య అంశాల విషయం లో సమాచారాన్ని నేరు గా ప్రధాన మంత్రి దృష్టి కి తీసుకుపోయే మరియు ఆయన సమక్షం లో తమ అరమరికలు లేనటువంటి నిష్పక్షపాతమైన, ఇంకా స్పష్టమైన సిఫారసుల ను వ్యక్తం చేసేందుకు అత్యంత సు హృద్భావభరితమైన వాతావరణమంటూ ఒకటి ఏర్పడుతుంది.

 

దీనికి తోడు, ప్రధాన మంత్రి యొక్క దార్శనికత నుండి మార్గదర్శకత్వాన్ని అందుకొంటూ, ఈ సమ్మేళనం లో ఇక పోలీసు వ్యవస్థ మరియు సురక్ష తో ముడి పడ్డ భవిష్యవాది లేదా అత్యాధునిక ఇతివృత్తాల పైన చర్చ ను మొదలుపెట్టడం జరిగిపోయింది. తద్ద్వారా వర్తమాన కాలం లో సురక్ష కు పూచీపడడం ఒక్కటే కాకుండా, కొత్త గా ఉనికి లోకి వస్తున్నటువంటి అంశాల ను మరియు సవాళ్ల ను ఎదుర్కొనే దక్షత ను సైతం వృద్ధి చెందిపచేసుకోవచ్చును.

 

ప్రధాన మంత్రి 2014 వ సంవత్సరం నుండే పూర్తి దేశంలో వార్షిక డిజిపి సమ్మేళనాల ను నిర్వహిస్తూ ఉండడాన్ని ప్రోత్సహిస్తూ వచ్చారు. ఈ సమ్మేళనాన్ని 2014 వ సంవత్సరం లో గువాహాటీ లో, 2015 వ సంవత్సరం లో రణ్ ఆఫ్ కచ్ఛ్ యొక్క ధోర్ డో లో, 2016 వ సంవత్సరం లో హైదరాబాద్ లోని నేశనల్ పోలీస్ అకేడమి లో, 2017 వ సంవత్సరం లో టేకన్ పుర్ లోని బిఎస్ఎఫ్ అకేడమి లో, 2018 వ సంవత్సరం లో కేవడియాలో, 2019వ సంవత్సరం లో పుణె లోని ఐఐఎస్ఇఆర్ లో, 2021 వ సంవత్సరం లో లఖ్ నవూ లోని పోలీసు ప్రధాన కార్యాలయం లో నిర్వహించడం జరిగింది.

 

***



(Release ID: 1892795) Visitor Counter : 157