ప్రధాన మంత్రి కార్యాలయం

వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ తొలిపలుకులు

Posted On: 13 JAN 2023 8:00PM by PIB Hyderabad

ఎక్సలెన్సీస్,
నమస్కార్,
వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్కు నేను స్వాగతం పలుకుతున్నాను.
గత రెండు రోజులుగా ఈ శిఖరాగ్ర సమ్మేళనంలో 120 కి పైగా వర్ధమాన దేశాలు పాల్గొంటున్నాయి. ఇది మొట్టమొదటి గ్లోబల్ సౌత్
వర్చువల్ సమావేశం.
ఈ ముగింపు సమావేశంలో మీ మధ్య ఉండడం నాకు ఎంతో సంతోషంగా ఉంది.
ఎక్సలెన్సీస్,
గత మూడు సంవత్సరాలు ప్రత్యేకించి వర్ధమాన దేశాలకు క్లిష్ట కాలం.
కోవిడ్ మహమ్మారి విదిల్చిన సవాలు, పెరుగుతున్న ఇంధన ధరలు, ఎరువులు, ఆహారధాన్యాలు, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ
ఉద్రిక్తతలు, వర్ధమాన దేశాల అభివృద్ధి ప్రయత్నాలపై పై ఎంతో ప్రభావం చూపాయి.
అయినప్పటికీ, నూతన సంవత్సరం ప్రారంభం కొంగొత్త ఆశలకు తగిన సమయం.
అందువల్ల ముందుగా మీ అందరికీ 2023 సంవత్సరం ఆనందదాయకమైన, ఆరోగ్యవంతమైన, శాంతియుత, విజయవంతమైన,భద్రమైన సంవత్సరం కావాలని
నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.

ఎక్సలెన్సీస్,

మనమందరి గ్లోబలైజేషన్ సూత్రాన్ని అభినందిస్తాము,
భారతదేశపు తాత్వికత , వసుధైవ కుటుంబకం.
అయితే వర్ధమాన దేశాల ఆకాంక్ష ఏమంటే, ఇది పర్యావరణ సంక్షోభానికి , రుణ సంక్షోభానికి దారితీయరాదని.
గ్లోబలైజేషన్ వాక్సిన్ల అసమాన పంపిణీకి దారితీయరాదని, లేదా అంతర్జాతీయ సప్లయ్ చెయిన్లు మితిమీరి
 కేంద్రీకృతం కారాదని కోరుకుంటున్నాము.
గ్లోబలైజేషన్ మానవాళికి మొత్తంగా సుంసంపన్నత, వారి ఆనందానికి కారణం కావాలని మేం కోరుకుంటున్నాం. సంక్షిప్తంగా చెప్పాలంటే
మానవతా కేంద్రిత గ్లోబలైజేషన్ ను మేం కోరుకుంటున్నాం.
ఎక్సలెన్సీస్,

అంతర్జాతీయ దృశ్యం మరింతగా విచ్ఛిన్నం  అవుతుండడం పట్ల వర్ధమాన దేశాలుగా  ఆందోళన చెందుతున్నాము.
ఈ భౌతిక రాజకీయ ఉద్రిక్తతలు అభివృద్ధి ప్రాధాన్యతలపై మనల్ని దృష్టిపెట్టనివ్వకుండా చేస్తాయి. ఇవి అంతర్జాతీయంగా ఆహారం, ఇంధనం, ఎరువులు, ఇతర సరకుల ధరలు విపరీతంగా పెరగడానికి దోహదపడతాయి. ఈ అంతర్జాతీయ   సమస్యను ఎదుర్కొవడానికి, మనం అత్యవసరంగా ప్రధాన అంతర్జాతీయ సంస్థలలో  
అంటే, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, బ్రెట్టన్ ఉడ్స్ సంస్థలతో సహా వివిధ సంస్థలలో మౌలిక సంస్కరణలు తీసుకురావలసి ఉంది.
 ఈ సంస్కరణలు వర్ధమాన దేశాల అభిప్రాయాలపై దృష్టి సారించాలి, 21   వశతాబ్దపు వాస్తవ స్థితిగతులను  ప్రతిబింబించేవిగా ఉండాలి.

జి 20 కి అధ్యక్షత వహిస్తున్న భారతదేశం ఈ కీలక అంశాలపై గ్లోబల్ సౌత్ వాణిని వినిపించేందుకు ప్రయత్నిస్తుంది.
ఎక్సలెన్సీస్,
అభివృద్ధి భాగస్వామ్యంలో ఇండియా వైఖరి, వివిధ పక్షాలను సంప్రదించేదిగా, ఫలితాలు సాధించేదిగా, డిమాండ్ ఆధారితమైనదిగా, ప్రజాకేంద్రితంగా, భాగస్వామ్యదేశాల సార్వభౌమత్వాన్ని పరిరక్షించేదిగా , గౌరవప్రదమైనదిగా ఉంటుంది.
గ్లోబల్ సౌత్ దేశాలు ఒక దాని అభివృద్ధి అనుభవాల నుంచి మరొకటి నేర్చుకోవలసినది ఎంతో  ఉందని నేను గట్టిగా నమ్ముతున్నాను.
గ్లోబల్ సౌత్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఇండియా ఏర్పాటు చేస్తుందని నేను సంతోషంగా ప్రకటిస్తున్నాను.
ఈ సంస్థ అభివృద్ధి పరిష్కారాలపై పరిశోధనను చేపడుతుంది లేదా మన ఏవైనా దేశాల అత్యుత్తమ విధానాలపై  పరిశోధన చేపడుతుంది.
వీటిని  గ్లోబల్ సౌత్ లోని ఇతర సభ్యదేశాలలో అమలు చేసేలా , వాటిని మరింత ముందుకు తీసుకుపోయేలా చూడవచ్చు. ఇండియా  ఎలక్ట్రానిక్ పేమెంట్స్, ఆరోగ్యం, విద్య, ఈ గవర్నెన్స్,లకు సంబంధించి అభివృద్ధి చేసిన ప్రజోపయోగాలను ఎన్నో వర్ధమాన దేశాలు ఉపయోగించుకుంటుండడం  ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

అంతరిక్ష విజ్ఞానం, అణు ఇంధనం వంటి రంగాలలో ఇండియా గొప్ప విజయాలు సాధించింది. ఇతర వర్ధమాన దేశాలతో మన అనుభవాలను
పంచుకునేందుకు మనం గ్లోబల్ సౌత్ సైన్స్ టెక్నాలజీ ఇనిషియేటివ్ ను ప్రారంభిద్దాం.
కోవిడ్ మహమ్మారి సమయంలో ఇండియ వాక్సిన్ మైత్రి చొరవను ప్రారంభించింది. ఇండియాలో తయారైన వాక్సిన్లను
 వందకు పైగా దేశాలకు సరఫరా చేసింది. నేను ఇప్పుడు కొత్త ఆరోగ్య మైత్రి ప్రాజెక్టును ప్రకటించాలనుకుంటున్నాను. ఈ ప్రాజెక్టు కింద ఏ వర్ధమాన దేశమైనా, ప్రకృతి విపత్తులు, మానవతా పరమైన సంక్షోబంలో చిక్కుకున్నప్పుడు వాటికి  ఇండియా అత్యవసర వైద్య సరఫరాలను అందిస్తుంది.


ఎక్సలెన్సీస్,

మన దౌత్యపరమైన గొంతుకను ఏకరీతిలో ఉండేలా చేసేందుకు, నేను గ్లోబల్ సౌత్ యంగ్ డిప్లమాట్స్ ఫోరం ను ప్రతిపాదిస్తున్నాను.
ఇది మన విదేశాంగ మంత్రిత్వశాఖలలని యువ అధికారులను అనుసంధానం చేస్తుంది.
ఇండియా గ్లోబల్ సౌత్ స్కాలర్షిప్లను కూడా ఏర్పాటు చేస్తుంది. వర్ధమాన దేశాలలోని విద్యార్థులు ఇండియాలో  ఉన్నత చదువులు చదవడానికి
వీటిని ఏర్పాటు చేస్తుంది.
ఎక్సలెన్సీస్,
ఈ రోజు సెషన్ థీమ్ భారతదేశపు ప్రాచీన విజ్ఞానం నుంచి ప్రేరణ పొందినది.
మానవాళికి తెలిసిన అత్యంత ప్రాచీన మైన రుగ్వేదంలో ఒక ప్రార్థన ఉంది. అది,
संगच्छध्वं संवदध्वं सं वो मनांसि जानताम्
దీని అర్థం, అందరం కలసికట్టుగా ఉందాం, కలసికట్టుగా మాట్లాడుదాం, ఒకరినొకరు అర్థం చేసుకుందాం అని. మరో మాటలో చెప్పాలంటే,  ఉమ్మడి ప్రయోజనాలకు ఉమ్మడి గొంతుక.
ఈ స్ఫూర్తితో , నేను మీ అభిప్రాయాలను , సూచనలను వినాలనుకుంటున్నాను.
ధన్యవాదాలు.

***



(Release ID: 1891337) Visitor Counter : 166