వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

1 జనవరి 2023 నుండి ప్రారంభించబడిన కొత్త సమగ్ర ఆహార భద్రతా పథకానికి కేంద్ర ప్రభుత్వం "ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పిఎంజికెఎవై)" అని పేరు పెట్టింది.

Posted On: 11 JAN 2023 2:24PM by PIB Hyderabad


గౌరవనీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన క్యాబినెట్  భేటీలో అంత్యోదయ అన్న యోజన (ఏఏవై) మరియు ప్రాథమిక గృహ (పిహెచ్‌హెచ్‌) లబ్ధిదారులకు ఉచిత ఆహార ధాన్యాలను అందించడానికి కొత్త సమగ్ర ఆహార భద్రతా పథకానికి ఆమోదం తెలిపింది. ఇది జనవరి 1, 2023 నుండి ప్రారంభించబడింది. కొత్త పథకం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పిఎంజికెఎవై)గా పేరు పెట్టారు. కొత్త పథకం అమలు 1 జనవరి 2023 నుండి ప్రారంభమైంది. దీని ద్వారా 80 కోట్ల కంటే ఎక్కువ మంది పేదలు మరియు నిరుపేదలు లబ్ధి పొందుతున్నారు.

లబ్ధిదారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మరియు అన్ని రాష్ట్రాల్లో ఏకరూపతను కొనసాగించడానికి ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కింద అర్హత ప్రకారం పిహెచ్‌హెచ్‌ మరియు ఏఏవై  లబ్ధిదారులందరికీ 2023 సంవత్సరానికి పిఎంజికెఎవై కింద ఉచిత ఆహారధాన్యాలు అందించబడతాయి. ఈ సమీకృత పథకం పేదలకు అందుబాటులో స్థోమత మరియు ఆహారధాన్యాల లభ్యత పరంగా బలోపేతం చేస్తుంది.

ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ 2013 యొక్క ప్రభావవంతమైన మరియు ఏకరీతి అమలు కోసం  పిఎంజికెఎవై ఆహారం & ప్రజాపంపిణీ శాఖకు చెందిన రెండు రాయితీ పథకాలను ఉపసంహరించుకుంటుంది (ఏ) ఎఫ్‌సీఐకి ఆహార సబ్సిడీ (బి) వికేంద్రీకృత సేకరణ రాష్ట్రాలకు ఆహార రాయితీ, ఉచిత ఆహార ధాన్యాల సేకరణ, కేటాయింపు మరియు పంపిణీకి సంబంధించినది.

క్షేత్రస్థాయిలో పిఎంజికెఎవై సజావుగా అమలు చేయడానికి అవసరమైన చర్యలు ఇప్పటికే తీసుకోబడ్డాయి అనగా ఏఏవై మరియు పిహెచ్‌హెచ్‌ లబ్ధిదారులకు ఆహార ధాన్యాల ధరను సున్నా చేయడానికి అవసరమైన నోటిఫికేషన్ జారీ చేయబడింది. అలాగే చౌక ధరల దుఖానాల్లో (ఎఫ్‌పిఎస్) సాంకేతిక సమస్యల పరిష్కారం, రేషన్‌ డీలర్లక మార్జిన్‌కు సంబంధించిన సూచన, లబ్ధిదారులకు ఇచ్చిన ప్రింట్ రసీదులలో సున్నా ధరలు వంటివి ఈ చర్యల్లో ఉన్నాయి.

ఫుడ్ & పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ శాఖ మరియు ఎఫ్‌సిఐ అధికారులు ఈ  కొత్త పథకాన్ని సజావుగా అమలు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో క్రమం తప్పకుండా సంభాషిస్తున్నారు.

పేదల ఆర్థిక భారాన్ని తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం 2023లో ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ మరియు ఇతర సంక్షేమ పథకాల కింద ఆహార సబ్సిడీగా రూ. 2 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేయనుంది.


 

*****



(Release ID: 1890545) Visitor Counter : 1012