బొగ్గు మంత్రిత్వ శాఖ
ఓవర్‌బర్డెన్ నుండి ఎం-శాండ్‌ను ఉత్పత్తి చేయనున్న నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్
సస్టైనబుల్ మైనింగ్ మరియు వెల్త్ ఫ్రమ్ వేస్ట్ సృష్టిపై దృష్టి
Posted On:
10 JAN 2023 1:04PM by PIB Hyderabad
మినీరత్న బొగ్గు ఉత్పత్తి సంస్థ అయిన నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎన్‌సిఎల్) తన అమ్లోహ్రీ ప్రాజెక్ట్‌లో సివిల్ వర్క్‌లలో నిర్మాణంలో ఉపయోగించే కోర్ మెటీరియల్ ఎం-శాండ్ ఉత్పత్తిని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. సహజ వనరుల వినియోగాన్ని పెంచడానికి మరియు మైనింగ్ యొక్క ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ మార్గదర్శకత్వంలో స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడంపై ఈ చొరవ ఆధారపడి ఉంటుంది. పర్యావరణ సమతుల్యతతో పాటు వ్యాపార వైవిధ్యంపై దృష్టి సారిస్తూ కంపెనీ తన ఓవర్ బర్డెన్ (ఓబి)ని ముడి పదార్థంగా ఉపయోగించి ఇసుక తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది.
సంస్థ తీసుకున్న ఈ పర్యావరణ అనుకూల నిర్ణయం నదీ గర్భ కోతను సంరక్షించడానికి మరియు జల పర్యావరణ వ్యవస్థలను సంరక్షించడానికి సహాయపడుతుంది. ఇటీవల ఎన్‌సీఎల్ ఆపరేట్ చేయడానికి (సిటిఓ) సమ్మతిని పొందింది. ఇది ఎం-శాండ్ వాణిజ్య ఉత్పత్తి మరియు వేలం దిశగా మార్గం సుగమం చేస్తుంది. వచ్చే నెలలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.
భూమిలో దిగువన ఉన్న బొగ్గును తీయడానికి 410 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ (ఒబి) తీసివేయాలి. బొగ్గు సీమ్ (పొర) పైన ఉన్న పదార్థాన్ని ఓవర్‌బర్డెన్ (ఒబి) అంటారు. ఈ భారీ పరిమాణం తీయాల్సిన బొగ్గుకు దాదాపు 4 రెట్లు ఎక్కువ. ఎన్‌సిఎల్ దాని 10 ఓపెన్-పిట్ గనుల నుండి ఏటా 122 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తుంది. దాంతో భారీ మొత్తంలో ఓవర్ బర్డెన్ (ఒబి) పేరుకుపోతోంది.
కంపెనీ తీసుకున్న ఈ సంచలనాత్మక చొరవ ప్రభుత్వంతో పాటు స్థానిక వాటాదారులకు ఉభయ ప్రయోజనకారి ఉంటుంది . ఎన్‌సిఎల్ సంవత్సరానికి సుమారు 3 లక్షల క్యూబిక్ మీటర్ల ఎం-శాండ్‌ను ఉత్పత్తి చేస్తుంది మరియు రోజుకు 1000 క్యూబిక్ మీటర్ల ఇసుకను తయారు చేయడానికి ప్రతిరోజూ 1429 క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్‌ని ఉపయోగిస్తుంది. ఉత్పత్తి చేయబడిన ఎం-శాండ్ ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న ఇసుకతో పోలిస్తే చాలా తక్కువ ధరకు నాణ్యమైన లేదా సమానమైన నాణ్యతతో ఇ-వేలం చేయబడుతుంది.
ఈ ప్లాంట్‌ని విజయవంతంగా ప్రారంభించిన తర్వాత, వివిధ ఉత్పత్తి ప్రాజెక్టులలో ఇలాంటి వినూత్నమైన ఓవర్ బర్డెన్ నుండి ఎం-శాండ్ మేకింగ్ యూనిట్లను స్థాపించాలని కంపెనీ ఆలోచిస్తోంది. ఎన్‌సిఎల్ యొక్క మట్టిలో సిలికా మంచి కూర్పు ఉన్న నేపథ్యంలో, సోలార్ ప్యానెల్స్, గ్లాస్, జీఆర్‌పి పైపులు మరియు ఇతర పదార్థాల తయారీకి అవకాశం కూడా అన్వేషించబడుతోంది.
కోల్ ఇండియా లిమిటెడ్ యొక్క ఫ్లాగ్‌షిప్ అనుబంధ సంస్థలలో ఎన్‌సిఎల్ ఒకటి. ఇది 10 అత్యంత యాంత్రిక గనులకు ప్రసిద్ధి చెందింది మరియు విద్యుత్ రంగాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. కంపెనీ ఎంపీ మరియు యూపీ రాష్ట్రాల్లోని సింగ్రౌలీ మరియు సోన్‌భద్ర జిల్లాల్లో ఉంది మరియు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23లో 122 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మరియు పంపిణీ లక్ష్యాలను పెట్టుకుంది.
****
(Release ID: 1890194)
Visitor Counter : 162