ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పదిహేడో ప్రవాసీ భారతీయ దివస్ సందర్భం లో గుయాన అధ్యక్షుని తో సమావేశమైనప్రధాన మంత్రి

Posted On: 09 JAN 2023 4:55PM by PIB Hyderabad

ఇందౌర్ లో పదిహేడో ప్రవాసీ భారతీయ దివస్ (పిబిడి) సందర్భం లో కోఆపరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ గుయాన అధ్యక్షుడు డాక్టర్ శ్రీ మొహమద్ ఇర్ఫాన్ అలీ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సమావేశమయ్యారు. అధ్యక్షుడు శ్రీ ఇర్ఫాన్ అలీ 2023 జనవరి 8వ తేదీ మొదలుకొని 14వ తేదీ వరకు భారతదేశం లో ఆధికారికంగా పర్యటించడానికి విచ్చేశారు. పదిహేడో ప్రవాసి భారతీయ దివస్ కు ఆయన ముఖ్య అతిథి గా కూడా ఉన్నారు.

 

నేత లు ఇరువురు శక్తి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఔషధ నిర్మాణం, ఆరోగ్య సంరక్షణ, సాంకేతిక విజ్ఞానం, ఇంకా నూతన ఆవిష్కరణ లు మరియు రక్షణ సంబంధి సహకారం లలో సమన్వయం సహా అనేక అంశాల పై సమగ్రం గా చర్చించారు. భారతదేశ ప్రజల కు మరియు గుయాన ప్రజల కు మధ్య 180 సంవత్సరాలు గా ఉన్న బంధాన్ని వారు గుర్తు కు తెచ్చుకొని ఈ సంబంధాల ను గాఢతరం చేసుకోవడానికి సమ్మతి ని వ్యక్తం చేశారు.

 

రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము తో అధ్యక్షుడు శ్రీ ఇర్ఫాన్ అలీ ద్వైపాక్షిక చర్చల ను జరఃపనున్నారు. అంతేకాకుండా 2023 జనవరి 10 వ తేదీ న పిబిడి సమాపక సమావేశాని కి మరియు ప్రవాసి భారతీయ సమ్మాన్ పురస్కార ప్రదాన కార్యక్రమాని కి ఆయన హాజరు కానున్నారు. ఇందౌర్ లో జనవరి 11వ తేదీ న నిర్వహించే గ్లోబల్ ఇన్ వెస్టర్స్ సమిట్ 2023 లో కూడా ఆయన పాలుపంచుకోనున్నారు.

 

అధ్యక్షుడు శ్రీ అలీ ఇందౌర్ ఒక్కటే కాకుండా దిల్లీ ని, కాన్ పుర్ ను, బెంగళూర్ ను మరియు ముంబయి ని కూడా సందర్శించనున్నారు.

 

***


(Release ID: 1889833) Visitor Counter : 196