ప్రధాన మంత్రి కార్యాలయం

జల సంరక్షణ అంశం పై రాష్ట్రాల మంత్రుల ఒకటో అఖిల భారతీయ వార్షికసమావేశాన్ని ఉద్దేశించి వీడియో సందేశంమాధ్యం ద్వారా ప్రసంగించిన ప్రధాన మంత్రి


‘‘ వాటర్ విజన్ @ 2047 అనేది ‘అమృత కాలం’ తాలూకు రాబోయే 25 సంవత్సరాల యాత్ర లో ఒక ముఖ్యమైనటువంటి పార్శ్వం గా ఉంది’’

‘‘ప్రజలు ఒక ప్రచార ఉద్యమం తో ముడిపడ్డారుఅంటే అప్పుడు వారికి ఆ కార్యం  తాలూకుగంభీరత్వం ఏమిటో తెలిసొస్తుంది’’

‘‘ప్రజలు స్వచ్ఛ్ భారత్ అభియాన్ లో పాలుపంచుకొన్నారు అంటే అప్పుడు అందరి లో ఒక చైతన్యం మేలుకొందన్న మాటే ’’

‘‘దేశం లోని ప్రతి జిల్లా లో 75 అమృత సరోవరాల ను నిర్మించుకోవడం జరుగుతున్నది; దీనిలో భాగం గా ఇప్పటి వరకు 25 వేల అమృత సరోవరాల  నిర్మాణం పూర్తి అయింది’’

‘‘ప్రతి ఒక్క కుటుంబాని కి నీటి ని అందించడం కోసం ‘జల్ జీవన్ మిశన్’ అనేది ఒక రాష్ట్రం యొక్క ప్రధాన ప్రగతి కొలబద్దగా ఉన్నది’’

‘‘ ‘ప్రతి ఒక్క చుక్క కు మరింత పంట’’ ప్రచార ఉద్యమం లో భాగం గా, దేశం లోఇంతవరకు 70 లక్షల కు పైగా హెక్టార్ ల భూమి ని సూక్ష్మ సేద్యం పరిధి లోకి తీసుకురావడమైంది’’

‘‘రాబోయే 5 సంవత్సరాల కు గాను ఒక కార్యాచరణ ప్రణాళిక ను గ్రామపంచాయతీ లు తయారు చేసుకోవాలి;  దీనిలో భాగం గా, నీటి సరఫరా మొదలుకొని స్వచ్ఛత, ఇంకా వ్యర్థాల నిర్వహణ వరకు మార్గసూచీ పైఆలోచనలు చేయాలి’’

‘‘మన నదులు, మన జలాశయాలు యావత్తు వాటర్ ఇకోసిస్టమ లో అత్యంతముఖ్యమైనటువంటి భాగంగా ఉన్నాయి’’

‘‘నమామి గంగే మిశన్ ను ఒక ప్రమాణం గాచేసుకొని ఇతర రాష్ట్రాలు కూడా నదుల సంరక్షణ కోసం ఇదే తరహాప్రచార ఉద్యమాల ను ఆరంభించుకోవచ్చును’’ 

Posted On: 05 JAN 2023 10:14AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో సందేశం మాధ్యం ద్వారా జల సంరక్షణ అంశం పై రాష్ట్రాల మంత్రుల ప్రథమ అఖిల భారతీయ వార్షిక సమ్మేళనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. వాటర్ విజన్ @ 2047అనేది ఈ సమావేశం యొక్క ఇతివృత్తం గా ఉంది. నిరంతర అభివృద్ధి మరియు మానవ వికాసం కోసం జల వనరుల ను వినియోగం లోకి తెచ్చుకొనేందుకు అనుసరించవలసిన మార్గాల ను గురించి ముఖ్య విధాన రూపకర్తల కు ఒక వేదిక ను అందించాలి అనేది ఈ సమావేశం యొక్క ఉద్దేశ్యం గా ఉంది.

 

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, జల సురక్ష సంబంధి రంగాల లో భారతదేశం చేసినటువంటి కృషి అపూర్వమైంది అని చెప్పడం ద్వారా జల మంత్రుల ప్రథమ అఖిల భారతీయ సమ్మేళనాని కి గల ప్రాముఖ్యాన్ని స్పష్టం చేశారు. మన రాజ్యాంగ వ్యవస్థ లో నీటి కి సంబంధించిన అంశం రాష్ట్రాల నియంత్రణ లోకి వస్తోందని, మరి జల సంరక్షణ దిశ లో రాష్ట్రాలు చేపట్టే ప్రయాస లు దేశం యొక్క సామూహిక లక్ష్యాల ను సాధించుకోవడం లో ఎంతగానో సహాయకారి కాగలుగుతాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘అమృత కాలం తాలూకు రాబోయే 25 సంవత్సరాల యాత్ర లో వాటర్ విజన్ @ 2047 అనేది ఒక ముఖ్యమైనటువంటి పార్శ్వం గా ఉంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

 

ప్రధాన మంత్రి సమగ్ర ప్రభుత్వం’’ మరియు సంపూర్ణ దేశం ల తాలూకు తన దృష్టికోణాన్ని పునరుద్ఘాటిస్తూ, ప్రభుత్వాలు అన్నీ కూడాను ఒక వ్యవస్థ లాగా పని చేయాలి. దీని లో భాగం గా రాష్ట్ర ప్రభుత్వాల లోని విభిన్న మంత్రిత్వ శాఖ లు.. ఉదాహరణ కు తీసుకొంటే జల మంత్రిత్వ శాఖ, సేద్యపు నీటిపారుదల మంత్రిత్వ శాఖ, వ్యవసాయ మంత్రిత్వ శాఖ, గ్రామీణ మరియు పట్టణ అభివృద్ధి, విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ ల మధ్య నిరంతరం సంపర్కం మరియు చర్చ లు చోటు చేసుకొంటూ ఉండాలి అని నొక్కిచెప్పారు. ఈ విభాగాల దగ్గర ఒకదాని తో మరొకదానికి సంబంధించిన సమాచారం మరియు డాటా ఉందీ అంటే అప్పుడు ప్రణాళిక రచన లో తోడ్పాటు లభిస్తుంది అని కూడా ఆయన అన్నారు.

 

సాఫల్యం అనేది ఒక్క ప్రభుత్వ ప్రయాసల నుండే సిద్ధించదు అని ప్రధాన మంత్రి వివరిస్తూ, సార్వజనిక సంఘాల, సామాజిక సంఘాల, నాగరిక సమాజాల యొక్క పాత్ర కు కూడా ప్రాముఖ్యం ఉంటుంది అన్నారు. జల సంరక్షణ కు సంబంధించిన ప్రసార ఉద్యమాల లో ఇవి గరిష్ఠ స్థాయి లో పాలుపంచుకోవాలి అని ఆయన సూచించారు. ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం వల్ల ప్రభుత్వం యొక్క జవాబుదారుతనం తరిగిపోదు, అంతేకాకుండా, దీనికి అర్థం కర్తవ్యాన్ని అంతటి ని ప్రజల పైనే వేసేయాలి అని కూడా కాదు అని ప్రధాన మంత్రి వివరించారు. ప్రజల భాగస్వామ్యం పరం గా కలిగే అతి ప్రధానమైన ప్రయోజనం ఏమిటి అంటే అది చైతన్యం. ఈ యొక్క ప్రచార ఉద్యమం లో భాగం గా సాగుతున్న ప్రయాసల ను గురించి, మరి దీనికి వెచ్చిస్తున్న డబ్బును గురించి ప్రజల లో ఒక అవగాహన ను ఏర్పరచడమే ప్రజల భాగస్వామ్యం తాలూకు సిద్దించే అతి పెద్ద ప్రయోజనం అని కూడా ఆయన అన్నారు. ‘‘ఒక ప్రచార ఉద్యమం తో ప్రజలు ముడిపడతారో, వారికి జరుగుతున్న పని ఎంత గంభీరమైందో తెలిసి వస్తుంది. దీనితో ప్రజల లో ఏదైనా పథకం , లేదా ప్రచార ఉద్యమం పట్ల యాజమాన్య భావన కూడా ఏర్పడుతుంది’’ అని ఆయన అన్నారు

 

ప్రధాన మంత్రి స్వచ్ఛ్ భారత్ అభియాన్ ను ఒక ఉదాహరణ గా చెబుతూ, ‘‘ప్రజలు ఎప్పుడైతే స్వచ్ఛ్ భారత్ అభియాన్ లో చేతులు కలిపారో, మరి వారందరి లో ఒక చేతన మేలుకొంది’’ అని పేర్కొన్నారు. భారతదేశ ప్రజల ప్రయాసల కు ప్రధాన మంత్రి ఖ్యాతి ని కట్టబెడుతూ, చెత్త ను తొలగించడానికి తగ్గ వనరుల ను సమీకరించడం కావచ్చు, అనేకమైన జల శుద్ధి ప్లాంటుల ను నిర్మించడం కావచ్చు, లేదా టాయిలెట్ లను నిర్మించడం కావచ్చు.. ప్రభుత్వం అనేక కార్యక్రమాల ను చేపట్టింది; కానీ, మలిన పదార్థాలను పూర్తి గా తొలగించివేయాలి అని ప్రజలు నిర్ణయించుకొన్నప్పుడే ఈ ప్రచార ఉద్యమం యొక్క సాఫల్యం సునిశ్చితం అయింది అని ప్రధాన మంత్రి అన్నారు. జల సంరక్షణ దిశ లో ప్రజలు ముందుకు రావాలి అనేటటువంటి ఆలోచన ను రేకెత్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ఏదైనా ఒక విషయం లో జాగరూకత ఏర్పడింది అంటే దాని ప్రభావం ఎంత గానో ఉంటుందని ఆయన అన్నారు.

 

‘‘మనం ‘‘జల జాగరూకత ఉత్సవాల ను’’ నిర్వహించడం గాని, లేదా స్థానికం గా ఏర్పాటు అయ్యే సంతల లో జల జాగరూకత కు సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని తలపెట్టడం గాని చేయవచ్చు’’ అని ప్రధాన మంత్రి సూచించారు. పాఠశాలల్లో పాఠ్యాంశాల మొదలుకొని కార్యకలాపాల వరకు నవీన పద్ధతుల ద్వారా యువ తరాని కి ఈ అంశం పై అవగాహన ను అందించవలసిన అవసరం ఉంది అని ఆయన నొక్కి చెప్పారు. దేశం లో ప్రతి జిల్లా లో 75 అమృత సరోవరాల నిర్మాణం కొనసాగుతున్నది. దీనిలో భాగం గా, ఇప్పటి వరకు 25 వేల అమృత సరోవరాలు రూపుదాల్చాయి అని ప్రధాన మంత్రి వెల్లడించారు. సమస్యల ను గుర్తించడం మరియు పరిష్కారాల ను కనుగొనడం కోసం సాంకేతిక విజ్ఞానాన్ని, పరిశ్రమ ను మరియు స్టార్ట్-అప్స్ ను సంధానించవలసిన అవసరాన్ని గురించి ఆయన తెలియ జెప్పారు. ఈ పని లో జియో-సెన్సింగ్ మరియు జియో-మేపింగ్ ల వంటి సాంకేతికత లు ఎంతగానో సాయపడగలుగుతాయి అని ఆయన పేర్కొన్నారు. విధాన నిర్ణయాలు తీసుకొనే స్థాయిల లో నీటి కి సంబంధించిన సమస్యల ను పరిష్కరించడం కోసం ప్రభుత్వ విధానాలు మరియు అధికార యంత్రాంగం పరం గా చర్యలను తీసుకోవలసిన అవసరం గురించి అని కూడా ఆయన నొక్కిచెప్పారు.

 

ప్రతి కుటుంబాని కి నీటి ని సమకూర్చడం కోసం ఒక ప్రపముఖ అభివృద్ధి కొలమానం గా జల్ జీవన్ మిశన్సఫలం కావడాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, చాలా రాష్ట్రాలు మంచి పనిని చేశాయి. మరిన్ని రాష్ట్రాలు ఈ దిశ లో ముందుకు కదులుతున్నాయి అన్నారు. ఒకసారి ఈ వ్యవస్థ అమలైందీ అంటే గనక మనం భవిష్యత్తు లో ఇదే విధం గా దీని ని నిర్వహించుకొనేటట్లుగా జాగ్రత తీసుకోవాలి అని ఆయన సలహా ఇచ్చారు. గ్రామ పంచాయతీ లు జల్ జీవన్ మిశన్ కు నేతృత్వాన్ని వహించాలి అని ఆయన ప్రతిపాదించారు. పని ముగిసిన తరువాత తగినంత గా స్వచ్ఛమైన జలాన్ని అందుబాటు లోకి తీసుకు రావడమైంది అంటూ గ్రామ పంచాయతీ లు ధ్రువ పరచాలి అని కూడా ఆయన అన్నారు. ‘‘ఊరిలో నల్లా నీటి ని అందుకొంటున్న ఇళ్ళ సంఖ్య ను ఆన్ లైన్ మాధ్యం ద్వారా తెలియజేస్తూ, ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ నెలవారీ గా గాని లేదా మూడు నెలల కు ఒకసారి గాని నివేదిక ను కూడా సమర్పించవచ్చును’’ అని ఆయన అన్నారు. నీటి యొక్క నాణ్యత కు పూచీ పడడం కోసం ఎప్పటికప్పుడు జల పరీక్ష ను నిర్వహించే వ్యవస్థ ను కూడా అభివృద్ధి పరచాలి అని కూడా ఆయన అన్నారు.

 

పరిశ్రమ రంగం లో, వ్యవసాయ రంగం లో.. ఈ రెండు రంగాల లో నీటి అవసరాల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, మనం ఈ రెండు రంగాల తో అనుబంధం ఉన్న వారి లో ఒక ప్రత్యేక ఉద్యమాన్ని నడిపి వారిని జల భద్రత విషయం లో చైతన్యవంతులను చేయాలని సిఫారసు చేశారు. పంట ల మార్పిడి మరియు ప్రాకృతిక వ్యవసాయం వంటి సాంకేతిక పరిజ్ఞానం సంబంధి ఉదాహరణల ను గురించి ఆయన ప్రస్తావించారు. ఇవి జల సంరక్షణ అంశం లో సకారాత్మకమై0నటువంటి ప్రభావాన్ని ఏర్పరుస్తాయని ఆయన అన్నారు. ప్రైమ్ మినిస్టర్ ఎగ్రీకల్చరల్ ఇరిగేశన్ స్కీమ్ లో భాగం గా ఆరంభం అయిన ఒక్కో నీటి చుక్క కు మరింత పంటప్రచార ఉద్యమాన్ని గురించి కూడా ఆయన ప్రముఖం గా ప్రస్తావించారు. దేశం లో ఇంతవరకు 70 లక్షల కు పైగా హెక్టార్ ల భూమి లో సూక్ష్మ సేద్యాన్ని ఆచరణ లోకి తీసుకు రావడం జరిగింది అని ఆయన తెలియ జేశారు. ‘‘అన్ని రాష్ట్రాలు సూక్ష్మ సేద్యాన్ని అదే పని గా ప్రోత్సహిస్తుండాలి’’ అని ఆయన అన్నారు. అటల్ భూజల్ సంరక్షణ్ యోజన ను గురించి కూడా ఆయన ఉదాహరణ ను ఇస్తూ, భూగర్భ జలం మట్టాల ను పెంపు చేయడం కోసం అన్ని జిల్లాల లో పెద్ద ఎత్తున వాటర్ శెడ్ పనులు జరగడం అవసరం, మరి పర్వత ప్రాంతాల లో స్పింగ్ శెడ్ ను పునరుద్ధరించడం కోసం అభివృద్ధి పనుల ను పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ఉద్ఘాటించారు.

 

జల సంరక్షణ కోసం రాష్ట్రం లో అటవీ ప్రాంత పరిధి ని పెంచడం పై దృష్టి పెట్టాలి అని ప్రధాన మంత్రి చెప్తూ, జల మంత్రిత్వ శాఖ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ లు సమన్వయం తో కూడిన ప్రయాసల కు పూనుకోవాలి అన్నారు. జలం సంబంధి స్థానికం గా అందుబాటు లో ఉన్న అన్ని వనరుల ను కాపాడుకొంటూ ఉండడం పైన శ్రద్ధ వహించాలని కూడా ఆయన సూచించారు. గ్రామ పంచాయతీ లు రాబోయే 5 సంవత్సరాల కు గాను ఒక కార్యాచరణ ప్రణాళిక ను సిద్ధం చేసుకోవాలి అని ఆయన స్పష్టం చేశారు. దీని లో భాగం గా నీటి సరఫరా మొదలుకొని స్వచ్ఛత మరియు వ్యర్థాల నిర్వహణ వరకు ఒక మార్గ సూచి ని రూపొందించుకొనే ఆలోచన చేయాలి అని ఆయన అన్నారు. పంచాయతీ స్థాయి లో వాటర్ బడ్జెటు ను రూపొందించుకొనేందుకు మార్గాల ను అనుసరించాలి అని రాష్ట్రాల కు ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. ప్రతి ఊరికి ఎంత నీరు అవసరపడుతుంది. మరి ఆ నీటి ని సమకూర్చుకోవడం కోసం ఏయే పనుల ను చేపట్టవలసివుంటుంది అనే అంశాల ను దీనికై పరిగణన లోకి తీసుకోవాలి అని ఆయన చెప్పారు. కేచ్ ద రెయిన్(వాననీటి ని ఒడిసి పట్టుకోండి) ప్రచార ఉద్యమం యొక్క సాఫల్యాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రస్తావించి, ఆ తరహా ప్రచార ఉద్యమాలు రాష్ట్ర ప్రభుత్వం స్థాయి లో చేపట్టే అతి ముఖ్యమైన ప్రచార ఉద్యమాల లో చోటు ను సంపాదించుకోవాలి. వాటి వార్షిక మూల్యాంకనం కూడా జరగాలి అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ‘‘వర్షాల కోసం వేచి ఉండే బదులు, వాన కాలం రావడాని కంటే ముందుగానే అన్ని ప్రణాళికల ను రూపొందించుకోవలసిన ఆవశ్యకత ఉంది’’ అని ఆయన అన్నారు.

 

జల సంరక్షణ రంగం లో సర్కులర్ ఇకానమి యొక్క ప్రాముఖ్యాన్ని ప్రధాన మంత్రి వివరిస్తూ, ప్రభుత్వం ఈ బడ్జెటు లో సర్కులర్ ఇకానమి పై చాలా శ్రద్ధ ను తీసుకొన్నది అని పేర్కొన్నారు. ‘‘ట్రీటెడ్ వాటర్ ను తిరిగి ఉపయోగిస్తున్నప్పుడు, తాజా జలాన్ని పొదుపు గా వాడుకొంటున్నప్పుడు, దాని వల్ల పూర్తి ఇకోసిస్టమ్ కు చాలా లాభం కలుగుతుంది. ఈ కారణం గా వాటర్ ట్రీట్ మెంట్, వాటర్ రీసైక్ లింగ్ లు అత్యంత ముఖ్యమైన విషయాలు’’ అని ఆయన అన్నారు. రాష్ట్రాలు విభిన్న ఉద్ద్యేశ్యాల కోసం ట్రీటెడ్ వాటర్’ ను ఉపయోగించేందుకు రక రకాల పద్ధతుల ను అన్వేషించాలి అని ఆయన నొక్కిచెప్పారు. ‘‘జలానికి సంబంధించిన యావత్తు ఇకోసిస్టమ్ లో మన నదుల కు, మన జలాశయాల కు అత్యంత ముఖ్యమైన పాత్ర ఉంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఏ నది లేదా జలాశయం వెలుపలి కారకాల వల్ల కలుషితం అయిపోకుండా ఉండటానికి గాను మనం ప్రతి రాష్ట్రం లో వాటర్ మేనిజ్ మెంట్ కు మరియు సీవేజ్ ట్రీట్ మెంట్ కు సంబంధించిన ఒక నెట్ వర్క్ ను నిర్మించాలి అని ఆయన అన్నారు. ‘‘మన నదులు, మన జలాశయాలు యావత్తు వాటర్ ఇకోసిస్టమ్ లోని అత్యంత ప్రధానమైనటువంటి భాగం గా ఉన్నాయి’’ అని ఆయన చెప్తూ, ప్రతి రాష్ట్రం లోను వ్యర్థాల నిర్వహణ మరియు సీవేజ్ ట్రీట్ మెంట్ తాలూకు నెట్ వర్క్ నిర్మాణం కావాలి అన్నారు. ‘‘నమామి గంగే మిశన్ ను ఒక మూస గా తీసుకొని ఇతర రాష్ట్రాలు కూడా నదుల సంరక్షణ కోసం ఇదే తరహా ప్రచార ఉద్యమాల ను మొదలు పెట్టవచ్చును. జలాన్ని సహకారం మరియు సమన్వయం అవసరపడే అంశం గా మార్చడం ప్రతి ఒక్క రాష్ట్రం యొక్క బాధ్యత’’ అని చెప్తూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

 

జల సంరక్షణ అంశం పై రాష్ట్రాల మంత్రుల ఒకటో అఖిల భారత వార్షిక సమావేశం లో అన్ని రాష్ట్రాల జల వనరుల మంత్రులు పాల్గొన్నారు.

 

 

*****

DS/TS



(Release ID: 1888869) Visitor Counter : 204