రాష్ట్రపతి సచివాలయం
నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన భారత రాష్ట్రపతి
Posted On:
31 DEC 2022 6:27PM by PIB Hyderabad
నూతన సంవత్సరం 2023 సందర్భంగా భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము తోటి పౌరులకు శుభాకాంక్షలు తెలిపారు.
నూతన సంవత్సరంలో అడుగిడుతున్న సందర్భంగా, తోటి పౌరులకు, విదేశాలలో ఉన్న భారతీయులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలను, అభినందనలను తెలుపుతున్నానని, తన సందేశంలో రాష్ట్రపతి పేర్కొన్నారు,
నూతన సంవత్సర ఉషస్సు తాజా శక్తితో నిండి, మన జీవితాలలో కొత్త సంతోషాలను, లక్ష్యాలను, స్ఫూర్తిని, గొప్ప విజయాలను తీసుకురావాలి. ఈ సందర్భంగా, దేశ ఐక్యతకు, సామరస్యానికి, సమ్మిళిత అభివృద్ధికి మనను మనం పునరంకితం చేసుకోవాలని సంకల్పించుకుందాం.
2023 సంవత్సరంలో మన గొప్ప దేశపు పురోగతి, శ్రేయస్సును నేను కోరుకుంటున్నాను అని ఆమె పేర్కొన్నారు.
రాష్ట్రపతి సందేశాన్ని చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
***
(Release ID: 1887823)
Visitor Counter : 135