ప్రధాన మంత్రి కార్యాలయం
బ్రెజిల్ కు చెందిన ఫుట్ బాల్ యశస్వి శ్రీ పెలే కన్నుమూత పట్ల సంతాపాన్నివ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
Posted On:
30 DEC 2022 4:53PM by PIB Hyderabad
ఫుట్ బాల్ క్రీడ లో విశిష్టమైనటువంటి కీర్తి ని ఆర్జించిన వ్యక్తి, బ్రెజిల్ కు చెందిన శ్రీ పెలే కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. శ్రీ పెలే ఈ లోకాన్ని వీడిపోవడం క్రీడల జగతి లో భర్తీ చేయలేనంతటి శూన్యాన్ని మిగిల్చింది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘శ్రీ పెలే కన్నుమూత క్రీడాప్రపంచం లో భర్తీ చేయలేనంతటి శూన్యాన్ని మిగిల్చింది. ప్రపంచ ఫుట్ బాల్ రంగం లో సూపర్ స్టార్ గా నిలచి శ్రీ పెలే సంపాదించుకొన్న ప్రజాదరణ ఎల్లలు ఎరుగనటువంటిది. ఆయన తన గొప్ప ఆట తీరు తోను, సాఫల్యాల తోను భావి తరాల వారి కి సైతం స్ఫూర్తి ని ప్రసాదిస్తూనే ఉంటారు. శ్రీ పెలే కుటుంబాని కి మరియు శ్రీ పెలే ను అభిమానించే వారి కి ఇదే నా సంతాపం. శ్రీ పెలే ఆత్మ కు ఆ ఈశ్వరుడు శాంతి ని ప్రసాదించు గాక.’’ అని పేర్కొన్నారు.
*******
DS/ST
(Release ID: 1887579)
Visitor Counter : 171
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam