ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఔషధ తయారీ యూనిట్లపై ఉమ్మడి తనిఖీలను ప్రారంభించిన సిడిఎస్‌సిఒ, రాష్ట్ర ఔషధ నియంత్రణ పాలనా యంత్రాంగం
దేశవ్యాప్తంగా ప్రామాణిక కార్యనిర్వహణా పద్ధతులకు అనుగుణంగా ఉమ్మడి తనిఖీల నిర్వహణ
తనిఖీ, నివేదన & తదుపరి చర్యల ప్రక్రియను పర్యవేక్షించేందుకు సిడిఎస్‌సిఒ (కేంద్ర కార్యాలయం)లో ఇద్దరు జాయింట్ డ్రగ్ కంట్రోలర్లతో కమిటీ ఏర్పాటు
Posted On:
27 DEC 2022 2:06PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమం, రసాయనాలు, ఎరువుల శాఖా మంత్రి డాక్టర్ మనసుఖ్ మాండవీయ ఆదేశాల ప్రకారం సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్‌సిఒ -కేంద్ర ఔషధ ప్రామాణిక నియంత్రణ సంస్థ) స్టేట్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (రాష్ట్ర ఔషధ నియంత్రణ నిర్వహణ కింద గుర్తించిన ఉత్పత్తి యూనిట్లపై రిస్క్ ఆధారిత విధానంతో ఉమ్మడి తనిఖీలను నిర్వహించడం ప్రారంభించింది.
ఈ ఉమ్మడి తనిఖీలను దేశవ్యాప్తంగా ప్రామాణిక కార్యాచరణ విధానాలకు అనుగుణంగా నిర్వహిస్తున్నారు. తనిఖీలు, నివేదన & తదనంతర చర్యలు డ్రగ్స్ & కాస్మెటిక్స్ చట్టం, 1940, దానిలోని నిబంధనలకు అనుగుణంగా ఉండేలా నిర్ధారించే ప్రక్రియ కోసం ఇద్దరు జాయింట్ డ్రగ్ కంట్రోలర్లతో కూడిన కమిటీని సిడిఎస్‌సిఒ (కేంద్ర కార్యాలయం)లో ఏర్పాటు చేశారు. ఇది దేశంలో ఉత్పత్తి చేసిన ఔషధాలకు సంబంధించి అధిక నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా కట్టుబడి ఉండేలా నిర్ధారిస్తుంది.
ప్రామాణిక నాణ్యత లేని (ఎన్ఎస్‌క్యూ)/ కల్తీ / నకిలీ ఔషధాల తయారీ ప్రమాదంలో ఉన్నట్టు గుర్తించిన ఉత్పత్తి యూనిట్ల దేశవ్యాప్త తనిఖీ కోసం ఒక కార్యాచరణ ప్రణాళికను తనిఖీల ముందు రూపొందించారు.
దేశంలో అందుబాటులో ఉన్న ఔషధ భద్రత, సమర్ధత, నాణ్యతను నిర్ధారించడం ఔషధ నియంత్రణ లక్ష్యం.
తయారీ యూనిట్లు డ్రగ్స్ & కాస్మెటిక్స్ యాక్ట్, 1940, దానిలోని నియమాలను ముఖ్యంగా మంచి ఉత్పత్తి లేదా తయారీ పద్ధతులు (జిఎంపి) అవసరాలకు అనుగుణంగా ఉండేలా నిర్ధారించేందుకు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అవసరం.
***
(Release ID: 1886940)
Visitor Counter : 202