ఆర్థిక మంత్రిత్వ శాఖ

జూలై-సెప్టెంబర్ 2022 సంబంధించి పబ్లిక్ డెట్ మేనేజ్‌మెంట్‌ త్రైమాసిక నివేదిక విడుదల

Posted On: 27 DEC 2022 12:09PM by PIB Hyderabad

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని.. ఆర్థిక వ్యవహారాల శాఖ బడ్జెట్ విభాగం జూలై-సెప్టెంబర్ 2022 మధ్య కాలానికి సంబంధించిన పబ్లిక్ డెట్ మేనేజ్మెంట్పై త్రైమాసిక నివేదికను విడుదల చేసింది. ఏప్రిల్-జూన్ (క్యూ1) 2010-11 నుండి బడ్జెట్ విభాగం పబ్లిక్ డెట్ మేనేజ్‌మెంట్ సెల్ (పీడీఎంసీ) క్రమం తప్పకుండా ఉండే  ప్రాతిపదికన రుణ నిర్వహణపై త్రైమాసిక నివేదికను విడుదల చేస్తోంది. ప్రస్తుతం జూలై-సెప్టెంబర్ (క్యూ2 FY23) త్రైమాసికానికి సంబంధించిన నివేదికను వెలువరించింది. 2023 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కేంద్ర ప్రభుత్వం డేటెడ్ సెక్యూరిటీల ద్వారా రూ.4,06,000 కోట్ల విలువైన మొత్తాన్ని సేకరించిందిరుణం క్యాలెండర్లో నోటిఫైడ్ మొత్తం రూ.4,22,000 కోట్లురుణ తిరిగి చెల్లింపులు రూ.92,371.15 కోట్లుగా ఉన్నాయిప్రాథమిక జారీల సగటు దిగుబడి 2023 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 7.23 శాతం నుండి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 7.33 శాతానికి చేరింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంను (క్యూ2) డేటెడ్ సెక్యూరిటీల జారీ వెయిటెడ్ యావరేజ్ మెచ్యూరిటీ 15.62 సంవత్సరాల దిగువకు చేరింది. అంతకు ముందు తైమాసికంలో  డేటెడ్ సెక్యూరిటీల జారీ వెయిటెడ్ యావరేజ్ మెచ్యూరిటీ 15.69గా నిలిచింది. జూలై-సెప్టెంబర్ 2022లో కేంద్ర ప్రభుత్వం నగదు నిర్వహణ బిల్లుల ద్వారా ఎలాంటి మొత్తాన్ని సేకరించలేదుత్రైమాసికంలో ప్రభుత్వ సెక్యూరిటీల కోసం రిజర్వ్ బ్యాంక్ ఓపెన్ మార్కెట్ కార్యకలాపాలను నిర్వహించలేదు త్రైమాసికంలో మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ మరియు స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీతో సహా లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ (ఎల్ఏఎఫ్కింద భారతీ రిజర్వు బ్యాంక్ నికర రోజువారీ సగటు లిక్విడిటీ శోషణ రూ.1,28,323.37 కోట్లుగా నిలిచింది. అందుబాటులో ఉన్న

తాత్కాలిక డేటా ప్రకారం ప్రభుత్వం యొక్క మొత్తం స్థూల బాధ్యతలు (‘పబ్లిక్ ఖాతా’ కింద బాధ్యతలతో సహా) జూన్ 2022 చివరి నాటికి రూ.1,45,72,956 కోట్ల నుండి 2022 సెప్టెంబర్ చివరి నాటికి రూ.1,47,19,572.2 కోట్లకు పెరిగాయి. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికంలో 1.0 శాతం పెరుగుదలను సూచిస్తుందిజూన్ 2022 చివరి నాటికి 88.3 శాతంగా ఉన్న స్థూల బాధ్యతలలో పబ్లిక్ రుణం సెప్టెంబర్ 2022 చివరి నాటికి 89.1 శాతానికి చేరింది.

ఇందులో దాదాపు 29.6 శాతం గడువు తేదీ ఉన్న సెక్యూరిటీలు 5 సంవత్సరాల కంటే తక్కువ కాల వ్యవధిని కలిగి ఉన్నాయిప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో ఎక్కువ కాల వ్యవధి సెక్యూరిటీల కోసం మెరుగ్గా ఉండి సరళంగా ఉన్నప్పటికీసమీప-కాల ద్రవ్యోల్బణం మరియు లిక్విడిటీ ఆందోళనల కారణంగా సెకండరీ మార్కెట్లో ప్రభుత్వ సెక్యూరిటీలపై స్వల్పకాలిక వక్రతను తీసుకున్నాయి.  ఎంపీసీ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలనే ఉద్దేశ్యంతో 2023 ఆర్థిక సంవత్సరం క్యూ2లో పాలసీ రెపో రేటును 100 బీపీఎస్అంటే 4.90% నుండి 5.90% వరకు పెంచాలని నిర్ణయించిందిసెకండరీ మార్కెట్‌ త్రైమాసిక ట్రేడింగ్ కార్యకలాపాలు 7-10 సంవత్సరాల మెచ్యూరిటీ బకెట్లో కేంద్రీకృతమై ఉన్నాయిప్రధానంగా 10 సంవత్సరాల బెంచ్మార్క్ సెక్యూరిటీలో ఎక్కువ ట్రేడింగ్ గమనించబడింది త్రైమాసికంలో సెకండరీ మార్కెట్లో ప్రైవేట్ రంగ బ్యాంకులే ఆధిపత్య ట్రేడింగ్ సెగ్మెంట్గా అవతరించాయినికర ప్రాతిపదికనవిదేశీ బ్యాంకులు మరియు ప్రైమరీ డీలర్లు నికర అమ్మకందారులుగా నిలిచారుప్రభుత్వ రంగ బ్యాంకులుసహకార బ్యాంకులుఎఫ్ఐలుబీమా కంపెనీలుమ్యూచువల్ ఫండ్లుప్రైవేట్ రంగ బ్యాంకులు మరియు ‘ఇతరులు’ సెకండరీ మార్కెట్లో నికర కొనుగోలుదారులుగా ఉన్నారుజూన్ 2022 వాణిజ్య బ్యాంకుల వాటా 38.04 శాతం నుండి 2022 సెప్టెంబర్ చివరి నాటికి 38.3 శాతంగా నిలిచిందని కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీల యాజమాన్య విధానం సూచిస్తుంది.

పూర్తి నివేదికను చూసేందుకు గాను ఇక్కడ క్లిక్ చేయండిజూలై-సెప్టెంబర్ 2022 మధ్య కాలానికి సంబంధించిన పబ్లిక్ రుణ మేనేజ్మెంట్‌ త్రైమాసిక నివేదిక

 

***



(Release ID: 1886849) Visitor Counter : 150