రైల్వే మంత్రిత్వ శాఖ

భారతదేశంలోని సిమెన్స్‌కు 9000 హెచ్‌పీ ఎలక్ట్రిక్ ఫ్రైట్ లోకోమోటివ్‌ల తయారీ మరియు నిర్వహణకు రైల్వే లెటర్ ఆఫ్ అవార్డును జారీ చేసిన భారతీయ రైల్వే


గౌరవనీయ భారత ప్రధానమంత్రి 2022 ఏప్రిల్ 20న దాహోద్‌లో రైల్వే ఫ్యాక్టరీకు శంకుస్థాపన చేశారు

ఈ చర్య 'మేక్ ఇన్ ఇండియా' డ్రైవ్ మరియు 'మేక్ ఫర్ ది వరల్డ్' లో ఒక పెద్ద ముందడుగును సూచిస్తుంది

భారతీయ రైల్వేలతో పాటు ఎగుమతి మార్కెట్ కోసం హై హార్స్ పవర్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌లను తయారు చేయనున్న దాహోద్ ఫ్యాక్టరీ

రైల్వే ప్రొడక్షన్ యూనిట్ మరియు మెయింటెనెన్స్ డిపోలలో పని చేస్తున్న రైల్వేకి చెందిన మానవ వనరులను పెంచడంలో సహాయం చేస్తుంది

11 సంవత్సరాల వ్యవధిలో 1200 ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌లు తయారు చేయబడతాయి

మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనుబంధ తయారీ యూనిట్ల ఏర్పాటు, ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధి కల్పన మరియు ప్రాంతంలో అభివృద్ధిని ఇది ప్రేరేపిస్తుంది

ఈ ప్రాజెక్ట్ హైపేస్ ఇండిజనైజేషన్ ద్వారా భారతదేశంలో కొత్త టెక్నాలజీల అభివృద్ధికి నాంది పలుకుతుంది

సాంకేతిక భాగస్వామిని ఎంపిక చేయడంలో న్యాయమైన, పారదర్శకమైన మరియు పోటీ బిడ్డింగ్ ప్రక్రియ స్వీకరించబడింది

Posted On: 24 DEC 2022 11:12AM by PIB Hyderabad

సీమెన్స్‌ ఇండియాకు  9000 హెచ్‌పీ ఎలక్ట్రిక్ ఫ్రైట్ లోకోమోటివ్‌ల తయారీ మరియు నిర్వహణకు భారతీయ రైల్వే లెటర్ ఆఫ్ అవార్డ్ (ఎల్‌ఒఏ)ని జారీ చేసింది. దాహోద్‌లోని రైల్వే ఫ్యాక్టరీ 11 సంవత్సరాల వ్యవధిలో 1200 హై హార్స్ పవర్ (9000 హెచ్‌పి) ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌లను తయారు చేస్తుంది. ఇది 1200 లోకోమోటివ్‌ల తయారీ మరియు 35 సంవత్సరాల పాటు ఈ లోకోమోటివ్‌ల నిర్వహణను కలిగి ఉంటుంది. పన్నులు మరియు ధర వైవిధ్యం మినహా ఒప్పందం యొక్క అంచనా విలువ సుమారు రూ.26000 కోట్లు (సుమారు 3.2 బిలియన్ల అమెరికన్‌ డాలర్లు).

సీమెన్స్ ఇండియాతో ఒప్పందం ఎల్‌ఒఏ జారీ చేసిన 30 రోజులలోపు సంతకం చేయబడుతుంది. రాబోయే రెండేళ్లలో ప్రోటో టైప్ లోకోమోటివ్‌లను డెలివరీ చేయనున్నారు. రెండు సంవత్సరాల వ్యవధిలో ఈ లోకోమోటివ్‌ల తయారీ కోసం దాహోద్ యూనిట్ పూర్తిగా నిర్మించబడుతుంది. సాంకేతిక భాగస్వామిగా ఎంపికైన సిమెన్స్, దహోద్‌లో ఈ లోకోమోటివ్‌లను తయారు చేస్తుంది. రైల్వే సిబ్బందిని ఉపయోగించి విశాఖపట్నం, రాయ్‌పూర్, ఖరగ్‌పూర్, పూణేల్లోని  నాలుగు మెయింటెనెన్స్ డిపోలలో ఈ లోకోమోటివ్‌లను 35 సంవత్సరాల పాటు నిర్వహిస్తుంది.

ఈ తయారీలో పూర్తి స్వదేశీకరణను నిర్ధారిస్తారు. ఇది అనుబంధ తయారీ యూనిట్ల అభివృద్ధికి దారి తీస్తుంది. ఇది నిజమైన ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవ. ఈ ప్రాజెక్ట్ దాహోద్ ప్రాంతం అభివృద్ధికి దారి తీస్తుంది. అలాగే మరింత ఉపాధిని సృష్టిస్తుంది.

ఈ హై హార్స్ పవర్ (9000 హెచ్‌పి) లోకోమోటివ్‌లు భవిష్యత్తులో భారతీయ రైల్వేలో సరుకు రవాణా కార్యకలాపాలకు  ఉపయోగపడతాయి. ఈ లోకోమోటివ్‌లు ప్రధానంగా వెస్ట్రన్ డిఎఫ్‌సిలో మరియు రైల్వేలోని గ్రేడెడ్ సెక్షన్‌లలో 200 గ్రేడియంట్‌లో 75 కిమీ వేగంతో 4500 టన్నుల డబుల్ స్టాక్ కాన్ఫిగరేషన్‌లో కంటైనర్ ఫ్రైట్ రైళ్లను లాగడానికి ప్లాన్ చేయబడ్డాయి. అలాంటి రైళ్లు ప్రస్తుతం ఉన్న 20-25 కి.మీ సగటు వేగాన్ని గంటకు 50-60 కిమీకి పెంచుతాయి. తద్వారా ఇది లైన్ సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. అత్యాధునిక ఐజీబీటీ ఆధారిత ప్రొపల్షన్ టెక్నాలజీతో కూడిన ఈ లోకోమోటివ్‌లు..రీజెనరేటివ్ బ్రేకింగ్ టెక్నాలజీ కారణంగా ఇంధన వినియోగంలో పొదుపును అందిస్తాయి.

ఎగుమతి మార్కెట్ కోసం స్టాండర్డ్ గేజ్ లోకోమోటివ్‌లను తయారు చేసి సరఫరా చేసే నిబంధన ఉంది.

సాంకేతిక భాగస్వామి పర్యవేక్షణలో రైల్వే సిబ్బందిని ఉపయోగించుకుని ఈ లోకోమోటివ్‌లను తయారు చేయడానికి మరియు నిర్వహించడానికి భారతీయ రైల్వే సాంకేతిక భాగస్వామిగా సిమెన్స్ ఇండియాను న్యాయమైన, పారదర్శక మరియు పోటీ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఎంపిక చేసింది.

నేపథ్యం:

సాంకేతిక భాగస్వామి న్యాయమైన, పారదర్శకమైన మరియు పోటీ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఎంపిక చేయబడింది. సాంకేతిక భాగస్వామి దహోద్‌లోని రైల్వే సిబ్బందికి 9000 హెచ్‌పి లోకోమోటివ్‌ల తయారీకి మరియు విశాఖపట్నం, రాయ్‌పూర్, ఖరగ్‌పూర్ మరియు పూణేలోని నాలుగు డిపోలలో 35 సంవత్సరాల డిజైన్ జీవితంలో లోకోమోటివ్‌ల నిర్వహణ కోసం శిక్షణను అందిస్తుంది. ఈ 1200 లోకోమోటివ్‌లు 11 సంవత్సరాలలో తయారు చేయబడతాయి. సాంకేతిక భాగస్వామి 95% లభ్యతను మరియు లోకోమోటివ్‌ల 1,50,000 కిమీల ఇబ్బంది లేని ఆపరేషన్‌ను హామీ ఇవ్వబడిన కీ పనితీరు సూచికలుగా (కెపిఐలు) ఏదైనా తప్పు జరగడానికి ముందు నిర్ధారిస్తారు.

మొత్తం వేలం ప్రక్రియ న్యాయమైన, పారదర్శకంగా మరియు పోటీ పద్ధతిలో నిర్వహించబడింది మరియు ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ ద్వారా రికార్డు సమయంలో చేపట్టబడింది. తగిన సాంకేతిక భాగస్వామి ఎంపిక కోసం సాంకేతిక మరియు ఆర్థిక బిడ్‌లను పొందేందుకు ఒకే దశ రెండు ప్యాకెట్ బిడ్డింగ్ ప్రక్రియను నిర్వహించాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. సాంకేతిక భాగస్వామి ఎంపిక కోసం బిడ్‌ను ఆహ్వానిస్తూ 20 ఏప్రిల్ 2022న నోటీసు జారీ చేయబడింది. 6 డిసెంబర్ 2022న ఫైనాన్షియల్ బిడ్‌లు తెరవబడ్డాయి. బిడ్‌ల  వివరణాత్మక మూల్యాంకనం తర్వాత రైల్వే మంత్రిత్వ శాఖ భారతదేశంలోని సీమెన్స్ లిమిటెడ్‌ని ఎంపిక చేసిన సాంకేతిక భాగస్వామిగా ప్రకటించింది.


 

*****



(Release ID: 1886432) Visitor Counter : 166