ప్రధాన మంత్రి కార్యాలయం
రాజ్‌కోట్‌లోని శ్రీ స్వామినారాయణ గురుకులంలో డిసెంబరు 24న 75వ అమృత మహోత్సవాల సందర్భంగా ప్రసంగించనున్న ప్రధానమంత్రి
Posted On:
23 DEC 2022 1:36PM by PIB Hyderabad
రాజ్‌కోట్‌లోని శ్రీ స్వామి నారాయణ్ గురుకులంలో 75వ అమృత మహోత్సవాల సందర్భంగా 2022 డిసెంబరు 24న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ఈ మేరకు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా పాల్గొంటారు.
రాజ్‌కోట్ సంస్థానంలో గురుదేవులు శాస్త్రీ మహారాజ్ శ్రీ ధర్మాజీవన్ దాస్‌జీ స్వామి శ్రీ స్వామినారాయణ్ గురుకులాన్ని 1948లో ఏర్పాటు చేశారు. అటుపైన శాఖోపశాఖలుగా విస్తరించిన ఈ గురుకులం నేడు ప్రపంచవ్యాప్తంగా 40కిపైగా శాఖలు కలిగి ఉంది. వీటిలో 25,000 మందికిపైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ విద్యా సంస్థల్లో పాఠశాల నుంచి అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకూ విద్యనందిస్తారు.
******
(Release ID: 1886043)
Read this release in:
Malayalam
,
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada