ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

డిసెంబర్ 18న మేఘాలయ , త్రిపురలో ప్రధాన మంత్రి పర్యటన రూ.6,800 కోట్ల విలువైన పథకాలను ప్రారంభించనున్న, శంకుస్థాపన చేయనున్న ప్రధాన మంత్రి


గృహనిర్మాణం, రోడ్డు, వ్యవసాయం, టెలికాం, ఐటి, పర్యాటకం , ఆతిథ్యం వంటి అనేక రంగాల అభివృద్ధికి ఉద్దేశించిన ప్రాజెక్టులు

షిల్లాంగ్ లో ఈశాన్య రాష్ట్రాల కౌన్సిల్ స్వర్ణోత్సవాల్లోనూ, కౌన్సిల్
సమావేశంలోనూ పాల్గొననున్న ప్రధాన మంత్రి

అగర్తలాలో పిఎమ్ఎవై - పట్టణ , గ్రామీణ - పథకాల కింద నిర్మించిన ఇళ్లలో రెండు లక్షల మందికి పైగా లబ్ధిదారుల గృహ ప్రవేశ్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

Posted On: 17 DEC 2022 12:11PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ డిసెంబర్ 18వ తేదీన మేఘాలయ, త్రిపుర లను సంద ర్శించ నున్నారు. షిల్లాంగ్ లో జరిగే నార్త్ ఈస్ట్రన్ కౌన్సిల్ స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రధాన మంత్రి పాల్గొంటారు. ఉదయం 10.30 గంటలకు షిల్లాంగ్ లోని స్టేట్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగే ఈశాన్య మండలి సమావేశంలో ప్రధాన మంత్రి పాల్గొంటారు. ఆ తర్వాత ఉదయం 11.30 గంటలకు షిల్లాంగ్ లో జరిగే బహిరంగ కార్యక్రమంలో పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడంతో పాటు, కొన్నింటికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం అగర్తలాకు వెళ్లి మధ్యాహ్నం 2:45 గంటలకు జరిగే బహిరంగ కార్యక్రమంలో వివిధ కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.

మేఘాలయలో ప్రధాని

ఈశాన్య రాష్ట్రాల కౌన్సిల్ (ఎన్ఇసి ) స మావేశానికి ప్రధాన మంత్రి

హాజరవుతారు. కౌన్సిల్ 1972 నవంబరు 7 న అధికారికంగా ప్రారంభించబడింది. ఈశాన్య ప్రాంత సామాజిక-ఆర్థిక అభివృద్ధిలో ఎన్ఇసి కీలక పాత్ర పోషిస్తోంది. ఇంకా ఈ ప్రాంతంలోని అన్ని రాష్ట్రాల్లో వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ,ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు ఇచ్చింది. ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, క్రీడలు, జల వనరులు, వ్యవసాయం, పర్యాటకం, పరిశ్రమ వంటి రంగాలలో కీలకమైన లోటు ప్రాంతాలలో విలువైన మూలధనం, సామాజిక మౌలిక సదుపాయాలను సృష్టించడానికి ఇది సహాయపడింది.

ప్రజలు పాల్గొనే కార్యక్రమంలో ప్రధాన మంత్రి 2450 కోట్ల రూపాయల విలువ చేసే పలు పథకాలకు ప్రారంభోత్సవం, అంకితం, శంకుస్థాపన చేస్తారు.

ఈ ప్రాంతంలో టెలికాం అనుసంధానాన్ని మరింత పెంచే చర్యలో భాగంగా

ప్రధాన మంత్రి 4 జి మొబైల్ టవర్ లను జాతికి అంకితం చేయనున్నారు, వీటిలో 320 కి పైగా పూర్త య్యాయి, ఇంకా 890 నిర్మాణాలు కొన సాగుతున్నాయి. ఉమ్సావ్లీలో ఐఐఎం షిల్లాంగ్ నూతన క్యాంపస్ ను ఆయన ప్రారంభిస్తారు. కొత్త షిల్లాంగ్ శాటిలైట్ టౌన్ షిప్ కు మెరుగైన కనెక్టివిటీని అందించే షిల్లాంగ్ - డైంగ్ పసోహ్ రహదారిని ఆయన ప్రారంభిస్తారు. మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ లలో మరో నాలుగు రోడ్ల ప్రాజెక్టులను కూడా ఆయన ప్రారంభిస్తారు.

పుట్టగొడుగుల ఉత్పత్తిని పెంచడానికి, రైతులు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు నైపుణ్య శిక్షణను అందించడానికి మేఘాలయలోని పుట్టగొడుగుల అభివృద్ధి కేంద్రంలో స్పాన్ ప్రయోగశాలను ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. అలాగే, మేఘాలయలో తేనెటీగల పెంపకందారుల జీవనోపాధిని పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ తేనెటీగల పెంపకం అభివృద్ధి కేంద్రాన్ని కూడా ఆయన ప్రారంభిస్తారు. మిజోరం, మణిపూర్, త్రిపుర, అస్సాం రాష్ట్రాల  21 హిందీ లైబ్రరీలను ప్రధాని ప్రారంభిస్తారు.

అస్సాం, మేఘాలయ, మణిపూర్, మిజోరాం, త్రిపుర రాష్ట్రాల్లో ఆరు రోడ్డు ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. తురాలో ఇంటిగ్రేటెడ్ హాస్పిటాలిటీ అండ్ కన్వెన్షన్ సెంటర్, షిల్లాంగ్ టెక్నాలజీ పార్క్ ఫేజ్-2కు కూడా ఆయన శంకుస్థాపన చేస్తారు. టెక్నాలజీ పార్క్ ఫేజ్-2లో 1.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటుంది. ఇది నిపుణులకు కొత్త అవకాశాలను అందిస్తుంది.  3000 మందికి పైగా ఉద్యోగాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ హాస్పిటాలిటీ అండ్ కన్వెన్షన్ సెంటర్ లో కన్వెన్షన్ హబ్, గెస్ట్ రూమ్ లు, ఫుడ్ కోర్ట్ మొదలైనవి ఉంటాయి. ఈ ప్రాంతంలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ,సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఇది అందిస్తుంది.

త్రిపురలో ప్రధాని

4,350 కోట్ల విలువైన వివిధ కీలక

ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి ప్రారంభోత్సవం, అంకితం, శంకుస్థాపన చేస్తారు.

ప్ర తి ఒక్కరికీ సొంత ఇల్లు ఉండేలా చూడడం పై ప్రధాన మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. ఈ దిశగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన - పట్టణ , ప్రధాన మంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ లబ్ధిదారుల గృహ ప్రవేశ కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. 3400 కోట్ల రూపాయల వ్యయంతో రెండు లక్షల మందికి పైగా లబ్ధిదారుల కోసం ఈ గృహాలను నిర్మించారు.

రహదారి అనుసంధానాన్ని మెరుగు

పరచడంపై దృష్టి సారించి, అగర్తలా

నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఉద్దేశించిన అగర్తలా బైపాస్ (ఖైర్ పూర్ - అమ్ తాలి) ఎన్ హెచ్-08 ను వెడల్పు చేసే ప్రాజెక్టును ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన (పిఎమ్ జిఎస్ వై 3) కింద 230 కిలోమీటర్లకు పైగా పొడవున 32 రహదారులకు, 540 కిలోమీటర్లకు పైగా ఉన్న 112 రోడ్ల అభివృద్ధికి ఆయన శంకుస్థాపన చేస్తారు.

ఆనంద్ నగర్ లో స్టేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ ను, అగర్తల

ప్రభుత్వ దంత వైద్య కళాశాలను కూడా

ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు.

 

***


(Release ID: 1884648) Visitor Counter : 167