నౌకారవాణా మంత్రిత్వ శాఖ
గోవాలో స్వాహిద్ దివస్‌ను పాటించిన శ్రీ సర్బానంద సోనోవాల్ ; చారిత్రాత్మక అస్సాం ఉద్యమంలో అమరవీరులకు ఆయన నివాళులు అర్పించారు
అస్సామీ సమాజాన్ని సజీవంగా ఉంచడంతో పాటు భారతదేశ ఐక్యత & సమగ్రతను కాపాడటంలో అస్సాం ఉద్యమ ప్రభావం చాలా విస్తృతమైనది: శ్రీ సోనోవాల్
ప్రపంచ విద్యార్థి ఉద్యమాల చరిత్రను విశ్లేషిస్తే అస్సాం ఉద్యమం అత్యున్నతమైనది: శ్రీ సోనోవాల్
Posted On:
10 DEC 2022 4:57PM by PIB Hyderabad
అస్సాం తొలి అమరవీరుడు ఖర్గేశ్వర్ తాలూక్దార్ 1979లో బలిదానం చేసుకున్న స్వాహిద్ దివస్‌ను పురస్కరించుకుని ఈ రోజు గోవాలో జరిగిన ఉద్వేగభరితమైన కార్యక్రమంలో కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ & జలమార్గాలు మరియు ఆయుష్ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ చారిత్రాత్మక అస్సాం ఉద్యమంలో అమరవీరులకు నివాళులర్పించారు. కేంద్ర మంత్రి మూడు రోజుల పాటు గోవాలో పర్యటించనున్నారు. పంజిమ్‌లోని ఫ్రాన్సిస్కో లూయిస్ గోమ్స్ గార్డెన్‌లో జరిగిన ఈ కార్యక్రమాన్ని అస్సాం సొసైటీ ఆఫ్ గోవా నిర్వహించింది. కార్యక్రమంలో అస్సామీ కమ్యూనిటీ సభ్యులు మరియు పలువురు ప్రముఖులు, స్థానికులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 1979-1985 వరకు ఆరేళ్లపాటు జరిగిన అసోం ఉద్యమంలో అమరులైన వారి పరాక్రమాన్ని స్మరించుకున్నారు. “ఈ రోజు స్వాహిద్ దివస్ సందర్భంగా అస్సాంను రక్షించడానికి అంతిమ త్యాగం చేసిన వారందరికీ నేను నమస్కరిస్తున్నాను. అక్రమ వలసదారుల నుండి రాష్ట్రాన్ని రక్షించడానికి అస్సాం ప్రజలు ఆరు సంవత్సరాల పాటు సాగిన ఉద్యమంలో పాల్గొన్నారు. భారతదేశ ఐక్యత మరియు సమగ్రతను కాపాడటానికి 860 మంది అమరవీరులు ప్రాణ త్యాగం చేశారు. ఈ గొప్ప అమరవీరులు తమ అసమానమైన దేశభక్తి మరియు ధైర్యంతో మరపురాని చరిత్రను వ్రాసారు. అస్సాం ఉద్యమం దేశాన్ని రక్షించడానికి అస్సాంలోని స్థానిక ప్రజల ఐక్య ప్రయత్నాలకు ఒక ప్రకాశవంతమైన ఉదాహరణ మరియు దాని ప్రభావం చాలా వరకు ఉంది. అమరవీరుల త్యాగం గొప్ప అస్సామీ సమాజానికి మరియు దేశానికి ఎప్పటికీ స్ఫూర్తినిస్తుంది ” అని మంత్రి పేర్కొన్నారు.
"అమరవీరుల గొప్ప ఆశయాలను సజీవంగా ఉంచడానికి మనం నిజాయితీ, అంకితభావం మరియు సంకల్పంతో పని చేస్తూనే ఉండాలి. మన భాష, సంస్కృతి, వారసత్వం మరియు సంప్రదాయాలను సజీవంగా ఉంచడానికి మన జాతీయ బాధ్యతను నిర్వర్తించాలి. ప్రపంచంలోని విద్యార్థి ఉద్యమాలను విశ్లేషిస్తే అస్సాం ఉద్యమం ఓ మహోన్నత ఘట్టం.అసోం ప్రజలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు కూడా దీని జాతీయవాద స్ఫూర్తితో స్ఫూర్తి పొంది బలమైన భారతదేశాన్ని నిర్మించడంలో ముందుండాలని నేను కోరుతున్నాను " అని శ్రీ సోనోవాల్ తెలిపారు
*****
(Release ID: 1882624)
Visitor Counter : 130