ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పార్లమెంట్ శీతకాల సమావేశాలు ఆరంభంకావడాని కంటే ముందు ప్రధాన మంత్రి ప్రసంగం

Posted On: 07 DEC 2022 11:30AM by PIB Hyderabad

మిత్రులారా నమస్కారం.

ఈ రోజు న (పార్లమెంట్) శీతకాల సమావేశాల లో ఒకటో రోజు. ఈ సమావేశాలు ముఖ్యమైనవి; దీనికి కారణం మనం ఇంతకు పూర్వం ఆగస్టు 15వ తేదీ నాడు కలుసుకొన్నాం. ఆగస్టు 15వ తేదీ నాడు స్వాతంత్య్రం తాలూకు 75 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. మరి ఇప్పుడు మనం అమృత కాలంతాలూకు ప్రయాణాన్ని మొదలుపెట్టి ముందుకు సాగిపోతున్నాం. జి20 కి అధ్యక్షత వహించే అవకాశం భారతదేశాని కి లభించినటువంటి కాలం లో, ఈ రోజు న మనం భేటీ అయ్యాం. ప్రపంచ సముదాయం లో భారతదేశం తనకంటూ ఒక జాగా ను సంపాదించుకొన్న తీరు, భారతదేశం పట్ల ఆశ లు ఏ విధం గా అయితే పెరిగిపోయాయో మరి అలాగే ప్రపంచ వేదికల లో భారతదేశం తన భాగస్వామ్యాన్ని ఏ విధం గా పెంపు చేసుకొంటోందో.. అటువంటి కాలం లో జి20 అధ్యక్షత ను స్వీకరించే అవకాశం దక్కడం అనేది ఒక భారీ అవకాశం అని చెప్పాలి.

జి20 శిఖర సమ్మేళనం అనేది దౌత్యపరమైనటువంటి కార్యక్రమం ఒక్కటే కాదు గాని అది భారతదేశం యొక్క దక్షత ను సంపూర్ణం గా ఆవిష్కరించడానికి చిక్కిన ఒక అవకాశం. ఇంత పెద్ద దేశం, ప్రజాస్వామ్యాని కి తల్లి వంటి దేశం, ఇన్ని వైవిధ్యాలు, అపారమైన అవకాశాలు ఉన్నాయి కాబట్టే భారతదేశాన్ని గురించి తెలుసుకోవడానికి ప్రపంచాని కి ఇది ఒక పెద్ద అవకాశం గా ఉండడం తో పాటుగా మరి భారతదేశాని కి సైతం తన సమర్థత ను యావత్తు ప్రపంచాని కి చాటుకోవడానికి ఇది ఒక పెద్ద అవకాశం అని చెప్పాలి.

 

ఇటీవల, అన్ని పార్టీల నాయకుల తో చాలా సుహృద్భావ వాతావరణం లో నేను చర్చించాను. దీని పరిణామం సభ లో సైతం తప్పక కనిపిస్తుంది. అదే స్ఫూర్తి ని సభ లో చూడవచ్చును. మరి ఆ స్ఫూర్తి ప్రపంచ దేశాల కు భారతదేశం యొక్క దక్షత ను చాటి చెప్పడం లో సైతం ఉపయోగపడనుంది. ఈ సమావేశాల లో ఇప్పుడున్న ప్రపంచ స్థితిగతుల మధ్య దేశాన్ని ముందుకు తీసుకు పోవడం కోసం కొత్త అవకాశాల ను, అలాగే దేశాన్ని అభివృద్ధి తాలూకు కొత్త శిఖరాల కు చేర్చాలనే విషయాలు లెక్క లోకి తీసుకొంటూ, ముఖ్యమైన నిర్ణయాల ను చేయడానికి కృషి జరుగుతుంది. అన్ని రాజకీయ పక్షాలు చర్చ కు అదనపు విలువ ను జోడిస్తాయని, వాటి వాటి అభిప్రాయాలు, వాటి వాటి ఆలోచనల తో చర్చల కు సరికొత్త శక్తి ని ఇస్తాయని, ప్రయాణించవలసిన బాట ను మరింత స్పష్టం గా ఎంచుకోవడం లో తప్పక సాయపడతాయని నాకు తోస్తున్నది. పార్లమెంట్ తాలూకు పదవీకాలం లోని శేష భాగం లో మొట్టమొదటిసారి గా సభ కు వచ్చిన వ్యక్తుల కు, కొత్త ఎంపీల కు, యువ ఎంపీల కు మరిన్ని అవకాశాల ను ఇవ్వవలసింది గాను అన్ని పార్టీల నాయకుల కు, సభాపక్ష నేతల కు నేను విజ్ఞ‌ప్తి చేయదలుస్తున్నాను. చర్చల లో వారు విరివి గా పాలుపంచుకొని, వారి యొక్క ఉజ్వల భవిత తో పాటు ప్రజాస్వామ్యం తాలూకు భావి తరాన్ని సన్నద్ధం చేయడం కోసం కూడాను పాటుపడతారు అని నేను అనుకొంటున్నాను.

 

గతంలో, దాదాపు గా అన్ని రాజకీయ పక్షాల కు చెందిన ఎంపీలు అందరి తోను నేను లాంఛనప్రాయం గా భేటీ అయినపుడల్లా ఎంపీ లంతా ఒకటే మాట ను చెప్పారు, అది.. సభ లో అలజడి కారణం గా, సభ తరచు గా వాయిదాల కు లోనైనందువల్ల వారు ఎంతో ఇబ్బంది పడవలసి వచ్చింది అనేదే. ప్రజాస్వామ్యం తాలూకు ఒక పెద్ద విశ్వవిద్యాలయం పార్లమెంట్ అని, మరి సమావేశాలు సజావు గా సాగలేకపోతున్నందువల్ల వారికి అర్థం చేసుకోవడాని కి, నేర్చుకోవడాని కి వీలు చిక్కడం లేదని యువ ఎంపీలు అంటున్నారు. వారు వారి కి అవకాశాలు రాకపోతుండడం వల్ల సభ సాగవలసిన తీరు అనేది చాలా ముఖ్యమైంది అని వారు అంటున్నారు. విశేకించి అన్ని పార్టీల యువ పార్లమెంటు సభ్యులు చెప్పినటువంటి మాట లు ఇవి.

 

వాదోపవాదాల లో భాగం పంచుకొనే అవకాశం వారికి అందడం లేదని ప్రతిపక్షాల కు చెందిన పార్లమెంట్ సభ్యులు కూడా అంటున్నారు. సభ లో అనేక సార్లు అంతరాయాలు ఏర్పడడం, తరచు గా వాయిదాలు పడిన కారణం గా వారు నష్టపోతున్నట్లు చెబుతున్నారు. ఈ ఎంపీల వేదన ను అర్థం చేసుకోవలసిందంటూ సభాపక్షాల నాయకుల ను మరియు పార్టీ నేతల ను నేను కోరుతున్నాను. పార్లమెంట్ సభ్యుల లో కనిపించే ఉత్సాహం తాలూకు లాభం దేశాని కి అందాలి. వారి శక్తియుక్తులు దేశం అభివృద్ధి కి మరియు నిర్ణయాల ఖరారు ప్రక్రియల కు తోడ్పడడం అనేది చాలా ముఖ్యం. ఈ సమావేశాల ను మరింత ఫలప్రదం గా రూపొందించడం లో ఉమ్మడి ప్రయాస కు పూనుకోవలసిందంటూ అన్ని పార్టీల కు, పార్లమెంట్ సభ్యుల కు నేను మనవి చేస్తున్నాను.

 

మరొక సౌభాగ్యం అది ఏమిటి అంటే మన ఉప రాష్ట్రపతి గారు రాజ్య సభ చైర్ మన్ గా తన పదవీ కాలాన్ని ఈ రోజు నుండి మొదలుపెడుతున్నారు అనేదే; ఇది ఆయన కృషి లో తొలి రోజే కాకుండా ఆయన ఆధ్వర్యం లో జరగనున్న ఒకటో సమావేశాలు కూడాను. మన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్మూ గారు ఏ విధం గా అయితే భారతదేశం యొక్క గొప్ప వారసత్వం తోను, మన ఆదివాసీ సంప్రదాయాల తోను భారతదేశం గర్వపడేటట్లు చేయడం లో ఒక ముఖ్యమైన భూమిక ను నిర్వహించారో, అదే విధం గా, ఒక రైతు బిడ్డ ఉప రాష్ట్రపతి గా మరియు రాజ్య సభ చైర్ మన్ గా భారతదేశం గర్వపడేటట్లు చేస్తారు. ఎంపీల కు ఆయన ప్రేరణ ను ఇచ్చి, వారి ని ప్రోత్సహించనున్నారు. నా వంతు గా, నేను కూడా ఆయన కు అనేకంగా శుభాకాంక్షల ను వ్యక్తం చేస్తున్నాను.

మిత్రులారా, చాలా చాలా ధన్యవాదాలు,

 

నమస్కారం.

 

 

****

 


(Release ID: 1881481) Visitor Counter : 185