ఆర్థిక మంత్రిత్వ శాఖ

నవంబర్ 2022 కి రూ. 1,45,867 కోట్ల స్థూల జీఎస్టీ రాబడి సేకరణ, సంవత్సరానికి 11% పెరుగుదల రికార్డులు


వరుసగా తొమ్మిది నెలల పాటు నెలవారీ జీఎస్టీ ఆదాయం రూ.1.4 లక్షల కోట్ల కంటే ఎక్కువ

వస్తువుల దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయాలు 20% ఎక్కువ, దేశీయ లావాదేవీల (సేవల దిగుమతితో సహా) ద్వారా
వచ్చే ఆదాయాలు గత సంవత్సరం ఇదే నెల కంటే 8% ఎక్కువ

Posted On: 01 DEC 2022 3:30PM by PIB Hyderabad
నవంబర్ 2022 నెలలో సేకరించిన స్థూల జీఎస్టీ ఆదాయం రూ.1,45,867 కోట్లు, ఇందులో సీజీఎస్టీ రూ.25,681 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.32,651 కోట్లు, ఐజీఎస్టీ రూ.77,103 కోట్లు (వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ.38,635 కోట్లతో కలిపి), సుంకం రూ.10,433 కోట్లు (వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ.817 కోట్లతో సహా)

జీఎస్టీ నుండి  సీజీఎస్టీకి రూ.33,997 కోట్లు,  ఎస్జీఎస్టీకి రూ.28,538 కోట్లు సాధారణ సెటిల్‌మెంట్‌గా ప్రభుత్వం సెటిల్ చేసింది. నవంబర్ 2022 నెలలో సాధారణ సెటిల్మెంట్ల తర్వాత కేంద్రం, రాష్ట్రాల మొత్తం ఆదాయం  సీజీఎస్టీకి రూ.59678 కోట్లు,   ఎస్జీఎస్టీకి రూ.61189 కోట్లు. అదనంగా, నవంబర్ 2022లో రాష్ట్రాలు/యూటీలకు జీఎస్టీ పరిహారంగా రూ.17,000 కోట్లను కేంద్రం విడుదల చేసింది.

నవంబర్ 2022 నెల ఆదాయాలు గత ఏడాది ఇదే నెలలో వచ్చిన  జీఎస్టీ ఆదాయాల కంటే 11% ఎక్కువ, ఇది రూ. 1.31,526 కోట్లు. నెలలో, వస్తువుల దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయాలు 20% ఎక్కువగా ఉన్నాయి.  దేశీయ లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయాలు (సేవల దిగుమతితో సహా) గత ఏడాది ఇదే నెలలో ఈ వనరుల నుండి వచ్చిన ఆదాయం కంటే 8% ఎక్కువ.

దిగువ చిత్రం ప్రస్తుత సంవత్సరంలో నెలవారీ స్థూల జీఎస్టీ ఆదాయాల ట్రెండ్‌లను చూపుతుంది. నవంబర్ 2021తో పోలిస్తే నవంబర్ 2022 నెలలో ప్రతి రాష్ట్రంలో సేకరించిన జీఎస్టీ రాష్ట్రాల వారీ గణాంకాలను పట్టిక చూపుతుంది.

 

 

 

నవంబర్ 2022లో రాష్ట్రాల వారీగా  జీఎస్టీ రాబడి వృద్ధి:

రాష్ట్రం 

నవంబర్-21

నవంబర్-22

వృద్ధి 

జమ్మూ కాశ్మీర్ 

383

430

12%

హిమాచల్ ప్రదేశ్ 

762

672

-12%

పంజాబ్ 

1,845

1,669

-10%

చండీగఢ్ 

180

175

-3%

ఉత్తరాఖండ్ 

1,263

1,280

1%

హర్యానా 

6,016

6,769

13%

ఢిల్లీ 

4,387

4,566

4%

రాజస్థాన్ 

3,698

3,618

-2%

ఉత్తరప్రదేశ్ 

6,636

7,254

9%

బీహార్ 

1,030

1,317

28%

సిక్కిం 

207

209

1%

అరుణాచల్ ప్రదేశ్ 

40

62

55%

నాగాలాండ్ 

30

34

11%

మణిపూర్ 

35

50

42%

మిజోరాం 

23

24

3%

త్రిపుర 

58

60

3%

మేఘాలయ  

152

162

6%

అస్సాం 

992

1,080

9%

పశ్చిమ బెంగాల్ 

4,083

4,371

7%

ఝార్ఖండ్ 

2,337

2,551

9%

ఒడిశా 

4,136

4,162

1%

ఛత్తీస్గఢ్ 

2,454

2,448

0%

మధ్యప్రదేశ్ 

2,808

2,890

3%

గుజరాత్ 

9,569

9,333

-2%

దామన్ దయ్యు 

0

0

67%

దాద్రా నగర్ హవేలీ 

270

304

13%

మహారాష్ట్ర 

18,656

21,611

16%

కర్ణాటక 

9,048

10,238

13%

గోవా 

518

447

-14%

లక్షద్వీప్ 

2

0

-79%

కేరళ 

2,129

2,094

-2%

తమిళనాడు 

7,795

8,551

10%

పుదుచ్చేరి 

172

209

22%

అండమాన్ నికోబర్ దీవులు 

24

23

-7%

తెలంగాణ 

3,931

4,228

8%

ఆంధ్రప్రదేశ్ 

2,750

3,134

14%

లడఖ్ 

13

50

273%

ఇతర ప్రాంతాలు 

95

184

93%

కేంద్ర ప్రభుత్వ పరిథి 

180

154

-14%

మొత్తం 

98,708

<

 
...


(Release ID: 1880445) Visitor Counter : 164