ప్రధాన మంత్రి కార్యాలయం

అరుణాచల్ ప్రదేశ్‌ లో గ్రీన్‌ ఫీల్డ్ విమానాశ్రయం ‘డోనీ పోలో’, ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం - తెలుగు అనువాదం

Posted On: 19 NOV 2022 2:47PM by PIB Hyderabad

జై హింద్!

జై హింద్!!

భారత్ మాతా కీ జై!

భారత్ మాతా కీ జై!

అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ బిడి మిశ్రా గారు, యువ, ప్రజాదరణ పొందిన అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పెమా ఖండూ గారు, మా మంత్రివర్గ సహచరులు శ్రీ కిరణ్ రిజిజు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ చౌనా మే గారు, గౌరవనీయులైన పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, మేయర్, అన్ని ఇతర ప్రముఖులు, అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన నా ప్రియమైన సోదర, సోదరీమణులారా!

నేను అరుణాచల్ప్రదేశ్ ను చాలాసార్లు సందర్శించాను. నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా, నాకు ఒక కొత్త శక్తి , కొత్త ఉత్సాహం వస్తాయి. నేను అరుణాచల్ప్రదేశ్ ను ఎన్నిసార్లు సందర్శించానో లెక్కే లేదు. అయితే ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఇంత గొప్ప కార్యక్రమాన్ని చూడటం ఇదే తొలిసారి. అరుణాచల్ ప్రదేశ్ పర్వతాల నుండి ఇక్కడికి చేరుకున్న ప్రజలు మీ జీవితంలో అభివృద్ధి పనుల ప్రాముఖ్యతను చూపుతున్నారు. అందుకే మీరంతా మీ దీవెనల వర్షం నాపై కురిపించడానికి ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చారు.

సోదర, సోదరీమణులారా!

అరుణాచల్ ప్రదేశ్ ప్రజల ఆప్యాయత, అభిమానం గురించి, నేను తప్పనిసరిగా మీకు చెప్పాలి. అరుణాచల్ ప్రదేశ్ ప్రజల ముఖాల్లో ఎప్పుడూ చిరునవ్వు ఉంటుంది. వారు ఎప్పుడూ నిరాశావాదం లేదా నిరాశను ప్రదర్శించరు. వారు తమ క్రమశిక్షణకు ప్రసిద్ధి చెందారు. సరిహద్దుల్లో క్రమశిక్షణ అంటే ఏమిటో చెప్పడానికి వారు సరైన ఉదాహరణగా నిలిచారు. ఇది అరుణాచల్ప్రదేశ్ లోని ప్రతి ఇంట్లో, ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తి జీవితంలో మనకు కనిపిస్తుంది.

 డబుల్ ఇంజిన్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి పేమా ఖండూ గారి నాయకత్వంలో అభివృద్ధి కోసం చేసిన కృషి, నిబద్ధత నేడు అరుణాచల్ప్రదేశ్ రాష్ట్రాన్ని కొత్త ఎత్తుకు తీసుకెళుతోంది. నేను పెమా ఖండూ గారితో పాటు ఆయన మొత్తం బృందాన్ని అభినందిస్తున్నాను. మీరు గుర్తుంచుకోవచ్చు; విమానాశ్రయానికి శంకుస్థాపన 2019 ఫిబ్రవరిలో జరిగిందని, శంకుస్థాపన చేయడం నా అదృష్టం అని పెమా ఖండూ గారు కూడా పేర్కొన్నారు. అదేవిధంగా, మా పని సంస్కృతిలో భాగంగా, మేము పునాది రాయి వేసిన ప్రతి ప్రాజెక్టును మేమే ప్రారంభిస్తామన్న సంగతి మీకు తెలిసిందే. ప్రాజెక్టులను గుప్పెట్లో పెట్టుకునే కాలం పోయింది. అయితే, ఇక్కడ, ఇంకొక విషయం ప్రస్తావిస్తాను. నేను ఫిబ్రవరి 2019లో దాని శంకుస్థాపన చేశాను. 2019 మేలో ఎన్నికలు జరగాల్సి ఉంది. రాజకీయ వక్తలు, వ్యాఖ్యాతలందరూ, తమ పాత మనస్తత్వంతో ఇక్కడ విమానాశ్రయం ఎప్పటికీ రాదని అరవడం, రాయడం మొదలు పెట్టారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి అందుకే శంకుస్థాపన చేసేందుకు మోడీ వచ్చారు. అన్నింటికీ ఎన్నికలే కారణమని చూస్తున్నారు. ప్రతి మంచి పనికి ఎన్నికల రంగు పూయడం, ఒక ఫ్యాషన్గా మారింది.

రోజు విమానాశ్రయం ప్రారంభోత్సవం ప్రజలందరికీ తగిన సమాధానం, వారి ముఖాలపై చెంపదెబ్బ. మరియు రాజకీయ వ్యాఖ్యాతలు తమ పాత ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను. దేశం కొత్త ఉత్సాహంతో, ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. కాబట్టి, రాజకీయాల కొలువులతో తూకం వేయడం మానేయండి. ఎన్నికల జిమ్మిక్కుగా చెప్పుకునే జనం మూడేళ్లలోనే మన ఎయిర్పోర్టు ఇంత గొప్పగా, అధునాతనంగా రూపుదిద్దుకోవడం చూస్తున్నారు. లక్షలాది మంది ప్రజల సమక్షంలో దీన్ని ప్రారంభించడం నా అదృష్టం. రోజు మొత్తం అరుణాచల్ ప్రదేశ్ మాతో ఆన్లైన్లో అనుసంధానమయ్యింది. ఇది కూడా చాలా గర్వించదగ్గ విషయం.

ఇప్పుడు, ఎటుచూసినా ఎన్నికలు లేవు. అయినా, దేశాభివృద్ధి, దేశ ప్రజల అభివృద్ధే ప్రభుత్వ ప్రాధాన్యత కాబట్టి ప్రారంభోత్సవం జరుగుతోంది. ఏడాదికి 365 రోజులు, 24 గంటలూ దేశాభివృద్ధి కోసమే పనిచేస్తున్నాం. మీరు చూడండి, ప్రస్తుతం నేను అరుణాచల్ప్రదేశ్ లో ఉన్నాను. ఇక్కడ సూర్యుడు మొదట ఉదయిస్తాడు, సాయంత్రం నేను సూర్యుడు అస్తమించే డామన్లో ఉంటాను. మధ్యలో కాశీని కూడా సందర్శిస్తాను. ఒకే ఒక కల తో మేము హృదయపూర్వకంగా పని చేస్తున్నాము - నా దేశం ముందుకు సాగాలి. మేం ఎప్పుడూ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పని చేయం. మా స్వప్నం మా భారతి, భారతదేశంతో పాటు, 130 కోట్ల మంది పౌరులు మాత్రమే.

రోజు, విమానాశ్రయంతో పాటు, 600 మెగావాట్ల కమెంగ్ హైడ్రో ప్రాజెక్ట్ను కూడా ప్రారంభించారు. ఇది కూడా స్వతహాగా గొప్ప విజయమే. అభివృద్ధి యొక్క 'విమానం' మరియు అభివృద్ధికి 'శక్తి' కలయిక అరుణాచల్ప్రదేశ్ ను కొత్త వేగంతో కొత్త ఎత్తులకు తీసుకెళుతుంది. విజయానికి, అరుణాచల్ ప్రదేశ్ తో పాటు, అన్ని ఈశాన్య రాష్ట్రాలలోని నా ప్రియమైన సోదర, సోదరీమణులకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

స్వాతంత్య్రం తరువాత, ఈశాన్య భారతదేశం పూర్తిగా భిన్నమైన యుగాన్ని చూసింది. దశాబ్దాలుగా, ప్రాంతం నిర్లక్ష్యానికి, ఉదాసీనతకు గురయ్యింది. అప్పట్లో ఢిల్లీ లో విధానాలు రూపొందించిన వ్యక్తులు, ఇక్కడి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. పరిస్థితి కొన్ని దశాబ్దాలుగా కొనసాగిందని మీకు బాగా తెలుసు. అటల్ బిహారీ వాజపాయ్ గారి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారి గా పరిస్థితి ని మార్చే ప్రయత్నం చేశారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన తొలి ప్రభుత్వం ఇదే.

కానీ ఆయన తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఊపును ముందుకు తీసుకెళ్లలేదు. మీరు నాకు సేవ చేసే అవకాశం ఇచ్చిన 2014 తర్వాత మార్పు విషయంలో ఒక కొత్త దశ ప్రారంభమైంది. గత ప్రభుత్వాలు అరుణాచల్ప్రదేశ్ను మారుమూల ప్రాంతంగా మాత్రమే భావించేవి. సుదూర సరిహద్దు ప్రాంతాల్లోని స్థలాలను గతంలో చివరి గ్రామాలుగా పరిగణించేవారు. కానీ మన ప్రభుత్వం స్థలాలను దేశంలోని చివరి గ్రామాలుగా కాకుండా మొదటి గ్రామాలుగా గుర్తించింది. ఫలితంగా ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి దేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇప్పుడు అది సంస్కృతి లేదా వ్యవసాయం, వాణిజ్యం లేదా అనుసంధానం కావచ్చు - ఈశాన్యం ప్రధమ ప్రాధాన్యతను పొందుతుంది, చివరి ప్రాధాన్యత కాదు. అది వాణిజ్యం లేదా పర్యాటకం, టెలికాం లేదా వస్త్రాలు కావచ్చు - ఈశాన్య ప్రాంతాలకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. డ్రోన్ టెక్నాలజీ నుంచి కృషి ఉడాన్ వరకు, విమానాశ్రయాల నుంచి పోర్టుల అనుసంధానం వరకు - ఈశాన్య ప్రాంతం ఇప్పుడు దేశం యొక్క ప్రధమ ప్రాధాన్యత.

భారతదేశపు అతి పొడవైన వంతెన లేదా పొడవైన రైలు వంతెన అయినా, రైలు మార్గాన్ని వేయడం లేదా రికార్డు వేగంతో రహదారిని నిర్మించడం వంటివిదేశంలో ఈశాన్య ప్రాంతం మొదటి స్థానంలో ఉంటుంది. ఫలితంగా, నేడు ఈశాన్య ప్రాంతంలో కొత్త ఆశలు, అవకాశాల శకం ప్రారంభమైంది.

నవ భారత విధానానికి నేటి సంఘటన గొప్ప ఉదాహరణ. డోనీ-పోలో విమానాశ్రయం అరుణాచల్ ప్రదేశ్లో పనిచేసే నాల్గవ విమానాశ్రయం. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఏడు దశాబ్దాల కాలంలో మొత్తం ఈశాన్య ప్రాంతంలో కేవలం తొమ్మిది విమానాశ్రయాలు మాత్రమే ఉన్నాయి. కానీ మన ప్రభుత్వం కేవలం ఎనిమిదేళ్లలో ఏడు కొత్త విమానాశ్రయాలను నిర్మించింది. 75 సంవత్సరాల స్వాతంత్య్రం తర్వాత ఇప్పుడు విమాన మార్గం తో అనుసంధానించబడిన అటువంటి ప్రాంతాలు ఇక్కడ చాలా ఉన్నాయి. పర్యవసానంగా, ఇప్పుడు ఈశాన్య ప్రాంతాలకు వెళ్లే విమానాల సంఖ్య రెండింతలు పెరిగింది.

స్నేహితులారా!

ఇటానగర్‌ లోని డోనీ-పోలో విమానాశ్రయం అరుణాచల్ ప్రదేశ్ చరిత్ర, సంస్కృతికి చిహ్నం. దోని అంటే సూర్యుడు, పోలో అంటే చంద్రుడు అని పెమా ఖండూ గారు నాకు చెప్పారు. అరుణాచల్ప్రదేశ్ లోని 'డోనీ-పోలో సంస్కృతిమన అభివృద్ధి ప్రయాణానికి పాఠంగా కూడా నేను భావిస్తున్నాను. కాంతి ఒకటే అయినా, సూర్యుని కిరణాలు, చంద్రుని చల్లదనం రెండూ వాటి స్వంత ప్రాముఖ్యత, శక్తిని కలిగి ఉంటాయి. అదేవిధంగా, మనం అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు, అది పెద్ద అభివృద్ధి ప్రాజెక్టు అయినా లేదా పేదల కోసం ప్రజా సంక్షేమ పథకమైనా, రెండూ అభివృద్ధిలో ముఖ్యమైన అంశాలు.

రోజు, విమానాశ్రయం వంటి ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో పాటు పేదల సౌకర్యాలకు సమాన ప్రాముఖ్యత ఇవ్వబడింది. రోజు, విమానాశ్రయం నిర్మిస్తే, సామాన్యులకు ప్రయోజనం చేకూరేలా 'ఉడాన్' పథకం పై కూడా కృషి చేస్తున్నాము. విమాన సేవలు ప్రారంభమైన తర్వాత, పర్యాటకుల సంఖ్యను ఎలా పెంచవచ్చు లేదా చిన్న వ్యాపారులు, దుకాణదారులు, టాక్సీ డ్రైవర్లు దాని నుంచి ఎలా ప్రయోజనాలను పొందగలరు వంటి విషయాలపై కూడా పని చేస్తాము:

స్నేహితులారా!

రోజు, అరుణాచల్ ప్రదేశ్రాష్ట్రంలోని సరిహద్దు ప్రాంతాల్లోనే కాకుండా అత్యంత క్లిష్ట ప్రాంతాల్లో కూడా రహదారులు, హైవేలు నిర్మిస్తున్నాము. రోడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం దాదాపు 50 వేల కోట్ల రూపాయలు వెచ్చించనుంది. అటువంటి బాగా అభివృద్ధి చెందిన మౌలిక సదుపాయాలతో, పెద్ద సంఖ్యలో పర్యాటకులు కూడా ఇక్కడికి వస్తారు. ప్రకృతి అరుణాచల్ప్రదేశ్ లోని ప్రతి మారుమూల ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దింది. ప్రతి గ్రామంలో పర్యాటక విస్తరణకు అపారమైన అవకాశాలు ఉన్నాయి. హోమ్స్టేలు, స్థానిక ఉత్పత్తుల ద్వారా ప్రతి కుటుంబం ఆదాయం పెరుగుతుంది. అందుకు ప్రతి గ్రామానికి చేరుకునేలా ఏర్పాట్లు చేయాలి. అందుకే, ఈరోజు ప్రధానమంత్రి గ్రామ్ సడక్ పథకం కింద అరుణాచల్ ప్రదేశ్లోని 85 శాతానికి పైగా గ్రామాల్లో రోడ్లు నిర్మించడం జరిగింది.

స్నేహితులారా!

విమానాశ్రయం నిర్మాణం, మెరుగైన మౌలిక సదుపాయాల అనంతరం, అరుణాచల్ప్రదేశ్ లో కార్గో సౌకర్యాల కోసం అవకాశాలు భారీగా అభివృద్ధి చెందుతాయి. దీంతో ఇక్కడి రైతులు తమ ఉత్పత్తులను అరుణాచల్ ప్రదేశ్ వెలుపల ఉన్న పెద్ద మార్కెట్లలో సులభంగా విక్రయించుకోగలుగుతారు. అప్పుడు, వారు, ప్రస్తుతం ఉన్న దానికంటే చాలా రెట్లు ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అరుణాచల్ ప్రదేశ్ రైతులు కూడా చాలా ప్రయోజనాలను పొందుతున్నారు.

స్నేహితులారా!

ఈశాన్య రాష్ట్రాల కోసం మన ప్రభుత్వం ఎలా పనిచేస్తోందో చెప్పడానికి వెదురు పెంపకం కూడా ఒక ఉదాహరణ. ఇక్కడి జీవనశైలిలో వెదురు ఒక ముఖ్యమైన భాగం. నేడు వెదురు ఉత్పత్తులు దేశ, విదేశాల్లో ప్రజాదరణ పొందుతున్నాయి. కానీ బ్రిటిష్ పాలన కాలం నుంచి, వెదురును నరకడం పై చట్టపరమైన పరిమితులు ఉన్నాయి. అవి మన గిరిజన సోదర, సోదరీమణులతో పాటు, మన ఈశాన్య ప్రాంత ప్రజల జీవితాల్లో ప్రతిబంధకంగా మారాయి. అందువల్ల, మేము చట్టాన్ని మార్చాము. ఇప్పుడు మీరు వెదురును పెంచవచ్చు, వెదురును కత్తిరించవచ్చు, వెదురును అమ్మవచ్చు, వెదురుకు విలువను జోడించవచ్చు, బహిరంగ మార్కెట్లో వ్యాపారం చేయవచ్చు. మనం ఇతర పంటలు పండించినట్లే వెదురును కూడా పండించవచ్చు.

సోదర, సోదరీమణులారా!

జీవితానికి సంబంధించిన ప్రాథమిక ఆందోళనల నుండి విముక్తి పొందిన వెంటనే, పేద ప్రజలు తమ అభివృద్ధికి, దేశాభివృద్ధికి, కొత్త మార్గాలను సృష్టించడం ప్రారంభిస్తారు. రోజు దేశ ప్రాధాన్యత ఏమిటంటే, నిరుపేద ప్రజలు నిర్లక్ష్యం, కష్టాల నుంచి బయటపడి గౌరవ ప్రదమైన జీవితాన్ని పొందగలగడం. గతంలో, పర్వత ప్రాంతాల్లో విద్య, వైద్యం ఎల్లప్పుడూ ఒక ప్రధాన సమస్యగా చెప్పబడేది. కానీ ఇప్పుడు, మంచి ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలతో పాటు, ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్సకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ప్రతి పేదవారికి పక్కా ఇళ్లు సమకూరుతున్నాయి. గిరిజన ప్రాంతాల్లో ఒక్క గిరిజన బిడ్డ చదువులో వెనుక పడకుండా కేంద్ర ప్రభుత్వం 500 కోట్ల రూపాయలు వెచ్చించి ఏకలవ్య మోడల్ పాఠశాలలను ప్రారంభిస్తోంది.

కొన్ని కారణాల వల్ల హింసా మార్గానికి ఆకర్షితులైన యువకులను ప్రత్యేక విధానం ద్వారా మళ్లీ జనజీవన స్రవంతి లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారి కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. "స్టార్టప్ ఇండియా" శక్తి తో అనుసంధానం కావడానికి, అరుణాచల్ ప్రదేశ్ కూడా "అరుణాచల్ ప్రదేశ్ స్టార్టప్ విధానం" ద్వారా కృషి చేస్తోంది. అంటే మన నిత్య అభివృద్ధి పథకాలు గ్రామాలు, పేదలు, యువతతో పాటు మహిళలకు కూడా చేరి, రోజు అది వారి శక్తిగా మారుతోంది.

స్నేహితులారా!

2014 తర్వాత, దేశంలో ప్రతి గ్రామానికి విద్యుత్ అందించడానికి ప్రచారం ప్రారంభించబడింది. ప్రచారం వల్ల అరుణాచల్ ప్రదేశ్లోని గ్రామాలు కూడా చాలా లాభపడ్డాయి. స్వాతంత్య్రానంతరం మొదటిసారిగా విద్యుత్తు చేరిన గ్రామాలు ఇక్కడ చాలా ఉన్నాయి. తర్వాత కేంద్ర ప్రభుత్వం సౌభాగ్య పథకం కింద ప్రతి ఇంటికి విద్యుత్ను అనుసంధానం చేసేందుకు ప్రచారాన్ని ప్రారంభించింది. ఇక్కడ అరుణాచల్ప్రదేశ్ లో కూడా వేలాది ఇళ్లకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. ఇక ఇక్కడి ఇళ్ళకు విద్యుత్ రావడంతో ఇళ్ళ తో పాటు, ఇక్కడి ప్రజల జీవితాల్లోనూ వెలుగులు నింపినట్లు అయ్యింది.

సోదర, సోదరీమణులారా!

అరుణాచల్ ప్రదేశ్లోని ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి అభివృద్ధి ఫలాలను అందించాలనే లక్ష్యంతో మేము పని చేస్తున్నాము. సరిహద్దు గ్రామాలకువైబ్రెంట్ బోర్డర్ విలేజ్హోదా కల్పించడం ద్వారా సాధికారత కల్పించాలన్నదే మా ప్రయత్నం. సరిహద్దుకు ఆనుకుని ఉన్న ప్రతి గ్రామానికీ కొత్త అవకాశాలు అందుబాటులో ఉంటే, శ్రేయస్సు దానంతట అదే ప్రారంభమవుతుంది.

"వైబ్రంట్ బోర్డర్ విలేజ్ ప్రోగ్రామ్" కింద సరిహద్దు గ్రామాల నుంచి వలసలను అరికట్టేందుకు, అక్కడ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. సరిహద్దు ప్రాంతాల యువతను ఎన్‌.సీ.సీ. తో అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది. సరిహద్దు వెంబడి ఉన్న గ్రామాలలోని యువకులు ఎక్కువ సంఖ్యలో ఎన్‌.సి.సి. లో పాల్గొనేలా మేము ప్రయత్నిస్తున్నాము. ఎన్‌.సీ.సీ. లో చేరే గ్రామాల పిల్లలకు సైనికాధికారులు శిక్షణ ఇస్తారు. ఇది యువతకు ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడంతో పాటు, దేశం పట్ల సేవా భావాన్ని పెంపొందిస్తుంది.

స్నేహితులారా!

సబ్కా సాథ్, సబ్కా వికాస్మంత్రాన్ని అనుసరిస్తూ, డబుల్ ఇంజన్ ప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కీ, రాష్ట్ర ప్రజల జీవన సౌలభ్యానికీ కట్టుబడి ఉంది. 'అరుణ్' లేదా అభివృద్ధి 'సూర్యుడు' ఇక్కడ ఇలాగే తన వెలుగును పంచుతూ ఉండాలని ఆశిస్తున్నాను.

కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ ముందుకు తీసుకెళ్లడంలో చురుకైన సహకారం అందించినందుకు పెమా ఖండూ గారితో పాటు, ఆయన మొత్తం ప్రభుత్వాన్ని నేను మరోసారి అభినందిస్తున్నాను. నేను మా స్నేహితులతో పాటు, మొత్తం ఈశాన్య ప్రాంతాలకు చెందిన మా మాతృమూర్తులను, సోదరీమణులను అభినందిస్తున్నాను.

నేను మీకు అనేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీకు చాలా కృతజ్ఞతలు!

గమనిక :

ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి ఇది స్వేచ్చానువాదం.

 

 

*****

 



(Release ID: 1879726) Visitor Counter : 99