సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
గోవా వేదికగా జరిగిన 53వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవ ముగింపు వేడుకలో ఆయన ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి
గోవాలో 53 వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ ) ముగింపు వేడుకలో నేడు ప్రముఖ తెలుగు నటుడు,, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, మెగాస్టార్ గా ప్రసిద్ధి చెందిన శ్రీ కొణిదెల శివశంకర వర ప్రసాద్ 2022 సంవత్సరానికి గాను ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందజేశారు.
ఈ గౌరవ పురస్కారానికి తనని ఎంపిక చేసిన ఐఎఫ్ఎఫ్ఐ, కేంద్ర ప్రభుత్వం మరియు ప్రధానమంత్రితో పాటు చిరంజీవి తన తల్లిదండ్రులకు మరియు తెలుగు చిత్ర పరిశ్రమకు కృతజ్ఞతలు తెలిపారు. 'కొణిదెల శివశంకర వర ప్రసాద్‌గా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, చిరంజీవిగా నాకు పునర్జన్మ ఇచ్చిన తెలుగు చిత్ర పరిశ్రమకు నేను ఎప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను. ఈ పరిశ్రమకు జీవితాంతం రుణపడి ఉంటాను' అని చిరంజీవి అన్నారు.
ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న చిరంజీవి రాజకీయాల నుంచి తిరిగి సినీ రంగానికి వచ్చిన తనను అభిమానించిన అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. 'నాపై చూపిన ప్రేమ, ఆప్యాయత చాలా గొప్పది. నేను 45 ఏళ్లకు పైగా పరిశ్రమలో ఉన్నాను, రాజకీయ రంగంలో ప్రవేశించి సినీ రంగానికి ఒక దశాబ్దం పాటు దూరంగా ఉన్నాను. సినిమా పరిశ్రమకు తిరిగి వస్తే ప్రజలు నన్ను ఏ మేరకు ఆదరిస్తారు అనే సందేహం కలిగింది. కానీ నా అభిమానుల ప్రేమ, ఆప్యాయత చెక్కు చెదరలేదు. వారి హృదయాల్లో నా స్థానం చెక్కుచెదరలేదు, జీవితాంతం చిత్ర పరిశ్రమలో ఉంటా. ఎప్పటికీ నేను మీతో ఉంటాను' అని చిరంజీవి అన్నారు. తనను గుర్తించి గౌరవించి జీవితాంతం గుర్తుండిపోయే పురస్కారాన్ని అందించిన ప్రభుత్వానికి, చలన చిత్ర రంగానికి చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. 'ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సినీ రంగానికి తిరిగి రావాలి అనుకుంటున్న వారు తిరిగి రండి. ఇది అవినీతికి తావు లేని రంగం. మీలో ప్రతిభ ఉంటే, మీరు దాన్ని ప్రదర్శించవచ్చు. మీరు ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతారు' అని చిరంజీవి పేర్కొన్నారు.
నాలుగు దశాబ్దాలకు పైగా చలనచిత్ర రంగంలో ఉన్న చిరంజీవి తెలుగులో 150కి పైగా చలన చిత్రాలలో హిందీ, తమిళం మరియు కన్నడ భాషలలో కొన్ని చిత్రాలలో నటించారు.
***
(Release ID: 1879687)
Visitor Counter : 172