ప్రధాన మంత్రి కార్యాలయం

2022 నవంబర్ 27వ తేదీ న జరిగిన ‘ మన్ కీ బాత్ ’ (‘ మనసు లో మాట ’) కార్యక్రమం  95వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

Posted On: 27 NOV 2022 11:44AM by PIB Hyderabad

ప్రియమైన నా దేశవాసులారా, నమస్కారం.  ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమాని కి మరో సారి  మీ అందరి కి ఇదే స్వాగతం.  ఇది 95వ ఎపిసోడ్.  ‘మన్  బాత్’ వందో సంచిక వైపు మనం దూసుకుపోతున్నాం.  దేశం లోని 130 కోట్ల మంది ప్రజల తో మమేకం అయ్యేందుకు ఈ కార్యక్రమం నాకు మరో మాధ్యం.  ప్రతి ఎపిసోడ్ కు ముందు గ్రామాల నుండి, నగరాల నుండి  వచ్చే చాలా ఉత్తరాల ను చదవడం, పిల్లల నుండి పెద్దల వరకు మీరు పంపిన ఆడియో సందేశాల ను వినడం నాకు ఆధ్యాత్మిక అనుభవం లాంటిది.

మిత్రులారా, ఒక ప్రత్యేకమైన బహుమతి ని గురించిన చర్చ తో నేటి కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను.  తెలంగాణ లోని రాజన్న సిరిసిల్ల జిల్లా లో ఒక నేత సోదరుడు ఉన్నారు.  ఆయన పేరు యెల్ది హరిప్రసాద్ గారు.  ఆయన తన స్వహస్తాల తో నేసిన ఈ జి-20 లోగో ను నాకు పంపారు.  ఈ అద్భుతమైన బహుమతి ని చూసి నేను ఆశ్చర్యపోయాను.  హరిప్రసాద్ గారు తన కళ లో ఎంతటి నిపుణులు అంటే ఆ నైపుణ్యం తో అందరి దృష్టి ని ఆయన ఆకట్టుకొంటుంటారు.  చేతి తో నేసిన జి-20 లోగో తో పాటు గా హరిప్రసాద్ గారు నాకు ఒక లేఖ ను కూడా పంపారు.  రాబోయే సంవత్సరం లో జి-20 శిఖర సమ్మేళనాని కి భారతదేశం ఆతిథేయి గా ఉండడం గర్వించదగ్గ విషయమని ఆ ఉత్తరంలో ఆయన వ్రాశారు.  దేశం  ఈ కార్యసిద్ధి ని పొందిన ఆనందం మధ్య ఆయన తన స్వహస్తాల తో  జి-20  లోగో ను సిద్ధం చేశారు.  ఈ అద్భుతమైన నేత ప్రతిభ ను ఆయన తన తండ్రి వద్ద నుండి వారసత్వం గా దక్కించుకొన్నారు; మరి ప్రస్తుతం ఆయన తన సంపూర్ణమైనటువంటి మక్కువ తో ఈ కళ లో తలమునకలు గా ఉన్నారు.

మిత్రులారా, జి-20 లోగో ను, ప్రెసిడెన్సీ ఆఫ్ ఇండియా వెబ్ సైట్ ను ఆవిష్కరించే భాగ్యం కొన్ని రోజుల క్రితం నాకు దక్కింది.  ఒక సార్వజనిక స్పర్ధ ద్వారా ఈ లోగో ను ఎంపిక చేయడమైంది.  హరిప్రసాద్ గారు పంపిన ఈ బహుమతి ని అందుకోగానే నా మనసు లో మరో ఆలోచన వచ్చింది.  తెలంగాణ లోని ఒక జిల్లా కు చెందిన వ్యక్తి కూడా జి-20 వంటి శిఖర సమ్మేళనం తో ఎంతగా సంధానం అయిందీ తెలుసుకొని నేను చాలా సంతోషించాను.  ఇంత పెద్ద శిఖర సమ్మేళనాని కి దేశం ఆతిథేయి గా ఉండనుంది అనే కబురు  మనసుల ను పొంగిపోయేది గా ఉందంటూ హరిప్రసాద్ గారు  వంటి అనేక మంది ప్రస్తుతం నాకు ఉత్తరాల ను పంపారు.  పుణే నుండి సుబ్బారావు చిల్లర గారు, కోల్ కాతా నుండి తుషార్ జగ్ మోహన్ గారు లు పంపిన  సందేశాల ను కూడా నేను మీతో ప్రస్తావిస్తున్నాను.  జి-20 కి సంబంధించినంత వరకు  భారతదేశం చేపట్టిన అనేక క్రియాశీల ప్రయత్నాలను వారు ఎంతగానో ప్రశంసించారు.

మిత్రులారా, జి-20 దేశాల కు ప్రపంచ జనాభా లో మూడింట రెండు వంతులు, ప్రపంచ వాణిజ్యం లో నాలుగింట మూడు వంతులు, ప్రపంచ జిడిపి లో 85 శాతం భాగస్వామ్యం ఉంది. మీరు ఇది ఊహించవచ్చు.. 3 రోజుల తరువాత అంటే డిసెంబర్ 1వ తేదీ నుండి భారతదేశం ఇంత పెద్ద సమూహానికి, ఇంత శక్తిమంత మైన సమూహానికి అధ్యక్షత వహించబోతున్నది. భారతదేశానికి, భారతదేశం లో ప్రతి ఒక్క వ్యక్తి కి ఎంత గొప్ప అవకాశం ఇది.  ‘ఆజాదీ కా అమృత్ కాల్’ సందర్భం లో భారతదేశాని కి ఈ బాధ్యత ను అప్పగించినందువల్ల ఇది మరింత ప్రత్యేకమైనటువంటిది గా ఉంది.

మిత్రులారా, జి-20 అధ్యక్ష స్థానం మనకు గొప్ప అవకాశం గా అందివచ్చింది.  ఈ అవకాశాన్ని మనం పూర్తి గా ఉపయోగించుకోవాలి.  మరి ప్రపంచ హితం పై, ప్రపంచ సంక్షేమం పై శ్రద్ధ తీసుకోవాలి.  శాంతి కావచ్చు, ఐక్యత కావచ్చు, పర్యావరణం నుండి మొదలుకొని సున్నితమైన విషయాలు కావచ్చు, సుస్థిర అభివృద్ధి కావచ్చు.. ఏ విషయం అయినా సరే.. వీటి కి సంబంధించిన సవాళ్ల కు భారతదేశం దగ్గర పరిష్కారాలు ఉన్నాయి.  మనం ఇచ్చిన ‘‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’’ అనే ఇతివృత్తం వసుధైక కుటుంబకమ్ భావన పట్ల మన నిబద్ధత ను సూచిస్తున్నది.

ఓం సర్వేషాం స్వస్తిర్ భవతు

సర్వేషాం శాంతిర్ భవతు

సర్వేషాం పూర్ణం భవతు

సర్వేషాం మంగళం భవతు.

ఓం శాంతిః శాంతిః శాంతిః .

అని మనం ఎప్పుడూ చెప్తాం.

ఈ మాటల కు ..

“అందరూ క్షేమంగా ఉండాలి;

అందరికీ శాంతి లభించాలి.

అందరికీ పూర్ణత్వం సిద్ధించాలి.

అందరికీ శుభం కలగాలి..” అని అర్థం.

రాబోయే రోజుల లో జి-20 కి సంబంధించిన అనేక కార్యక్రమాలు దేశం లోని వివిధ ప్రాంతాల లో జరుగుతాయి.  ఆ కాలం లో మీ రాష్ట్రాల ను సందర్శించే అవకాశం ప్రపంచం లోని వివిధ ప్రాంతాల ప్రజల కు లభిస్తుంది.  మీరు ఇక్కడి సంస్కృతి లోని విభిన్నమైన, విలక్షణమైన రంగుల ను ప్రపంచాని కి అందిస్తారన్న నమ్మకం నాకుంది.  జి-20 సమావేశాల కు  వచ్చే వారు ఇప్పుడు ప్రతినిధులు గా వచ్చినప్పటికీ వారు భవిష్యత్తు లో పర్యటకులు గా రావచ్చన్న విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి.  హరిప్రసాద్ గారి లాగా అందరూ ఏదో ఒక రకం గా జి-20 తో సంధానం కావాలి అంటూ మీ అందరి ని, ముఖ్యం గా నా యువ మిత్రుల ను నేను కోరుతున్నాను.  జి-20  భారతీయ లోగో ను చాలా ఆకర్షణీయం గాను, కొత్త సొగసు తోను తయారు చేసి దుస్తుల మీద ముద్రింపచేయవచ్చును.  పాఠశాల లు, కళాశాల లు, విశ్వవిద్యాలయాలు జి-20 కి సంబంధించిన చర్చల కు, పోటీల కు అవకాశాల ను కల్పించాలి అని నేను కోరుతున్నాను.  మీరు జి20 డాట్ ఇన్ వెబ్ సైట్ ను చూస్తే, మీ ఆసక్తి కి అనుగుణం గా చాలా విషయాల ను అందులో మీరు చూడవచ్చును.

ప్రియమైన నా దేశ ప్రజలారా, నవంబర్ 18వ తేదీ న అంతరిక్ష రంగం లో కొత్త చరిత్ర నమోదు కావడాన్ని యావత్తు దేశం గమనించింది.  ఆ రోజు న భారతదేశం లో ప్రైవేట్ రంగం రూపకల్పన చేసిన మరియు సిద్ధం చేసిన తొలి రాకెట్ ను భారతదేశం అంతరిక్షం లోకి పంపించింది.  ఆ రాకెట్ పేరు ‘విక్రమ్-ఎస్’. స్వదేశీ స్పేస్ స్టార్ట్-అప్ తో రూపొందించిన ఈ మొదటి రాకెట్ శ్రీహరికోట నుండి నింగి కి ఎగయడం తో భారతదేశం లో ప్రతి ఒక్కరి హృద‌యం  గర్వం తో ఉప్పొంగిపోయింది.

మిత్రులారా, ‘విక్రమ్-ఎస్’ రాకెట్ లో అనేక ఫీచర్ లను జతపరచడమైంది.  ఇది ఇతర రాకెట్ ల కంటే తేలిక అయిందే కాక చవక అయింది కూడాను.  అంతరిక్ష యాత్రల లో ప్రమేయం ఉన్న ఇతర దేశాలు పెట్టిన వ్యయం కంటే ఈ రాకెట్ అభివృద్ధి కి అయిన ఖర్చు చాలా తక్కువ.   తక్కువ ఖర్చు తో ప్రపంచ స్థాయి నాణ్యత అనేది ప్రస్తుతం అంతరిక్ష సాంకేతిక విజ్ఞానం లో భారతదేశాని కి గుర్తింపు గా మారింది.  ఈ రాకెట్ తయారీ లో మరో ఆధునిక సాంకేతికత ను ఉపయోగించడం జరిగింది.  ఈ రాకెట్ లోని కొన్ని ముఖ్యమైన భాగాల ను 3డి ప్రింటింగ్ ద్వారా తయారు చేశారు అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.  నిజాని కి ‘విక్రమ్-ఎస్’ లాంచ్ మిశన్ కు పెట్టిన పేరు ‘ప్రారంభ్’ అనేది సరిగ్గా సరిపోతుంది.  ఇది భారతదేశం ప్రైవేట్ అంతరిక్ష రంగం లో కొత్త శకాని కి నాంది గా ఉంది.  దేశం లో విశ్వాసం తో నిండిన కొత్త శకాని కి ఇది ఆది.  చేతి తో కాగితపు విమానాల ను నడిపే పిల్లలు ఇప్పుడు భారతదేశం లోనే విమానాల ను తయారు చేసి, ఎగురవేయగలరు అని మీరు ఊహించవచ్చును.  ఒకప్పుడు చంద్రుడి ని, నక్షత్రాల ను చూస్తూ ఆకాశం లో ఆకారాలు గీసిన పిల్లలు ఇప్పుడు భారతదేశం లోనే రాకెట్ లను తయారు చేసే అవకాశాన్ని పొందుతున్నారు అని మీరు ఊహించవచ్చును.  అంతరిక్ష రంగం లో ప్రైవేటు సంస్థల కు అవకాశాల ను కల్పించిన తరువాత యువత కల లు కూడా సాకారం అవుతున్నాయి.  రాకెట్ లను తయారు చేస్తున్న ఈ యువతీయువకులు ‘మాకు ఆకాశం కూడా హద్దు కాదు’ అని చెబుతున్నారా ఏమిటి అని అనిపిస్తున్నది.

మిత్రులారా, అంతరిక్ష రంగం లో తన విజయాన్ని భారతదేశం  పొరుగు దేశాల తోనూ పంచుకొంటున్నది.  భారతదేశం, భూటాన్ లు సంయుక్తం గా అభివృద్ధిపరచినటువంటి మానవ నిర్మిత ఉపగ్రహాన్ని భారతదేశం నిన్నటి రోజు న ప్రయోగించింది.  ఈ మానవ నిర్మిత ఉపగ్రహం చాలా చక్కటి స్పష్టత ఉన్న చిత్రాలను పంపుతుంది; ఆ చిత్రాలు భూటాన్ సహజ వనరుల నిర్వహణ లో సాయపడనున్నాయి.  ఈ మానవ నిర్మిత ఉపగ్రహాన్ని ప్రయోగించడం భారతదేశం-భూటాన్ దృఢ సంబంధాలకు అద్దం పడుతున్నది.

మిత్రులారా, గత కొన్ని ‘మన్ కీ బాత్’ ఎపిసోడ్ లలో మనం అంతరిక్షం, సాంకేతిక విజ్ఞా నం, నూతన ఆవిష్కరణ ల గురించి ఎక్కువగా మాట్లాడుకోవడాన్ని మీరు గమనించే ఉంటారు.  దీనికి రెండు ప్రత్యేక కారణాలు ఉన్నాయి.  ఒకటో కారణం మన యువత ఈ రంగం లో అద్భుతం గా పనిచేస్తోంది.  వారు భారీ స్థాయి లో ఆలోచిస్తున్నారు.  భారీ స్థాయి లో కార్యాల ను సాధిస్తున్నారు.  వారు ఇప్పుడు చిన్న చిన్న కార్యసిద్ధుల తో సంతృప్తి చెందడం లేదు.  రెండో కారణం- నూతన ఆవిష్కరణ ల మరియు వేల్యూ క్రియేశన్ తో కూడినటువంటి ఈ ఉత్తేజకరమైన ప్రయాణం లో వారు ఇతర యువ సహచరుల ను, స్టార్ట్-అప్ స్ ను కూడా ప్రోత్సహిస్తున్నారు.

మిత్రులారా, సాంకేతిక విజ్ఞానాని కి సంబంధించిన ఆవిష్కరణల ను గురించి మాట్లాడుతున్నప్పుడు డ్రోన్స్ ను మనం ఎలా మరచిపోగలం?  డ్రోన్స్ రంగం లో భారతదేశం కూడా వేగం గా దూసుకుపోతోంది.  కొన్ని రోజుల క్రితం హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ లో డ్రోన్స్ ద్వారా ఆపిల్ పండ్ల ను ఎలా రవాణా చేశారో చూశాం. కిన్నౌర్ హిమాచల్ ప్రదేశ్ లోని ఓ మారుమూల జిల్లా.  ఈ సీజన్ లో అక్కడ విపరీతమైన మంచు కురుస్తుంది.  ఇంత ఎక్కువ హిమపాతం తో కిన్నౌర్ కు రాష్ట్రం లోని  ఇతర ప్రాంతాల తో వారాల తరబడి సంధానం చాలా కష్టమవుతుంది.  అటువంటి పరిస్థితి లో అక్కడి నుండి ఆపిల్ పండ్ల రవాణా కూడా అంతే కష్టం.  ఇప్పుడు హిమాచల్ లోని రుచికరమైన కిన్నౌరి ఆపిల్స్ డ్రోన్ టెక్నాలజీ సహాయం తో ప్రజల కు మరింత త్వరగా చేరువ కానున్నాయి.  ఇది మన రైతు సోదరుల కు, రైతు సోదరీమణుల కు ఖర్చు ను తగ్గించి వేస్తుంది. ఆపిల్స్ సమయాని కి బజారు కు చేరుతాయి.  ఆపిల్స్ వృథా పోవడమూ తగ్గుతుంది.

మిత్రులారా, గతం లో ఊహ కు కూడా అందని విషయాల ను ప్రస్తుతం మన దేశ వాసులు వారి ఆవిష్కరణల తో సాధ్యం చేస్తున్నారు.  ఇది చూస్తే ఎవరు మాత్రం సంతోషించకుండా ఉంటారు?  ఇటీవలి సంవత్సరాల లో మన దేశం చాలా విజయాలు సాధించింది.  భారతీయులు- ముఖ్యంగా మన యువతరం- ఇంతటితో ఆగబోదన్న నమ్మకం నాలో ఉంది.

ప్రియమైన దేశ ప్రజలారా, నేను మీ కోసం ఒక చిన్న క్లిప్ ను వినిపించబోతున్నాను.

##(పాట)##

ఈ పాట ను మీరంతా ఎప్పుడో ఒకసారి వినే ఉంటారు.  ఇది బాపు గారికి ఇష్టమైన పాట.  ఈ పాట ను పాడిన గాయకులు గ్రీస్ దేశీయులు అని నేను చెబితే, మీరు తప్పక ఆశ్చర్యపోతారు!  ఈ విషయం కూడా మీరు గర్వించేలా చేస్తుంది.  ఈ పాట ను గ్రీస్ గాయకుడు కాన్ స్టాంటినోస్ కలైట్జిస్ పాడారు.  గాంధీ జీ 150వ జయంతి వేడుకల సందర్భం లో ఆయన ఈ గీతాన్ని ఆలాపించారు.  కానీ ఈ రోజు నేను వేరే కారణాల వల్ల ఈ విషయాన్ని చర్చిస్తున్నాను.  ఆయన కు భారతదేశం అన్నా, భారతీయ సంగీతం అన్నా గొప్ప ఉద్వేగం ఉంది.  ఆయన కు భారతదేశం పై ఎంతటి ఆప్యాయత ఉంది అంటే, గడచిన 42 సంవత్సరాల లో దాదాపు ప్రతి ఏటా భారతదేశాని కి ఆయన వచ్చారు.  భారతీయ సంగీతం యొక్క మూలాలు, విభిన్న భారతీయ సంగీత వ్యవస్థ లు, వివిధ రాగాలు, తాళాలు మరియు రసాల తో పాటు వివిధ ఘరానాల ను గురించి కూడా ఆయన అధ్యయనం చేశారు.  భారతీయ సంగీతాని కి చెందిన అనేక మంది గొప్ప వ్యక్తుల సేవల ను ఆయన అధ్యయనం చేశారు.  భారతదేశం లోని శాస్త్రీయ నృత్యాల కు సంబంధించిన విభిన్న అంశాల ను కూడా నిశితం గా అర్థం చేసుకున్నారు.  ఇప్పుడు భారతదేశాని కి సంబంధించిన ఈ అనుభవాలన్నిటి ని చాలా సుందరమైన రీతి లో ఒక పుస్తకం లో పొందుపరిచారు.  ఇండియన్ మ్యూజిక్ పేరు తో ఆయన రాసిన పుస్తకం లో దాదాపు 760 ఛాయాచిత్రాలు ఉన్నాయి.  ఈ ఛాయాచిత్రాల లో చాలా వరకు ఛాయాచిత్రాలు ఆయన తీసినవే.  ఇతర దేశాల లో భారతీయ సంస్కృతి పై ఇటువంటి ఉత్సాహం, ఆకర్షణ నిజం గా సంతోషాన్నిస్తుంది.

మిత్రులారా, కొన్ని వారాల క్రితం మనం గర్వించదగ్గ మరో వార్త కూడా వచ్చింది.  గత 8 సంవత్సరాల లో భారతదేశం నుండి సంగీత వాయిద్యాల ఎగుమతి మూడున్నర రెట్లు పెరిగింది అని తెలుసుకుంటే మీరు సంతోషిస్తారు.  ఎలక్ట్రికల్ మ్యూజికల్ ఇన్ స్ట్రు మెంట్స్ ఎగుమతి 60 రెట్లు అధికం అయింది.  భారతీయ సంస్కృతి కి, సంగీతాని కి ప్రపంచ వ్యాప్తంగా ఆకర్షణ పెరుగుతోంది అని దీనిని బట్టి తెలుస్తున్నది.  యుఎస్ఎ, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, యునైటెడ్ కింగ్ డమ్ మొదలైన అభివృద్ధి చెందిన దేశాలు భారతీయ సంగీత వాయిద్యాల ను ఎక్కువ గా కొనుగోలు చేస్తున్నాయి.  సంగీతం, నృత్యం, కళ ల విషయం లో గొప్ప వారసత్వ సంపద ను మన దేశం కలిగి ఉండటం మనందరి అదృష్టం.

మిత్రులారా, 'నీతి శతకం' కారణం గా ఆ శతక కర్త, గొప్ప కవి భర్తృహరి గారి ని గురించి మనకు అందరికి తెలుసును.  కళ, సంగీతం, సాహిత్యం పట్ల మనకు ఉన్నటువిం అనుబంధమే మానవత్వాని కి నిజమైన గుర్తింపు అని ఒక శ్లోకం లో ఆయన చెప్పారు.  నిజాని కి మన సంస్కృతి దానిని మానవత్వాని కి మించి, దైవత్వాని కి తీసుకుపోతుంది.  వేదాల లో సామవేదాన్ని మన విభిన్న సంగీతాల కు మూలం గా పేర్కొంటారు.  సరస్వతి మాత వీణ అయినా, భగవాన్ శ్రీకృష్ణుని వేణువు అయినా, భోలేనాథుని ఢమరుకం అయినా.. మన దేవత లు కూడా సంగీతం తో ముడిపడి ఉన్నారు.  భారతీయులం అయిన మనం ప్రతి దాని లో సంగీతాన్ని కనుగొంటాం.  నది గలగలలు అయినా, వాన చినుకుల టపటప చప్పుడు అయినా, పక్షుల కిలకిల లు అయినా, గాలి ప్రతిధ్వనులు అయినా.. మన నాగరకత లో ప్రతి చోటు లో సంగీతం ఉంటుంది.  ఈ సంగీతం శరీరాన్ని సేద తీర్చడమే కాకుండా మనసు ను కూడా ఆహ్లాదపరుస్తుంది.  సంగీతం మన సమాజాన్ని కూడా కలుపుతుంది.  భాంగ్రా, లావణి లలో ఉత్సాహం, ఆనందం ఉంటే, రవీంద్ర సంగీతం మన ఆత్మ ను ఉల్లాసపరుస్తుంది.  దేశవ్యాప్తం గా ఉన్న ఆదివాసి వ్యక్తుల కు విభిన్న సంగీత సంప్రదాయాలంటూ ఉన్నాయి.  ఒకరి తో కలసి ఉండేందుకు, ప్రకృతి తో సామరస్యం గా జీవించడానికి ఇవి మనలకు స్ఫూర్తి ని ఇస్తాయి.

మిత్రులారా, మన సంగీత రూపాలు మన సంస్కృతి ని సుసంపన్నం చేయడమే కాకుండా ప్రపంచ సంగీతం పైన చెరగని ముద్ర ను వేశాయి.  భారతీయ సంగీతం యొక్క ఖ్యాతి ప్రపంచం లోని నలుమూలలకు వ్యాపించింది.  మరో ఆడియో క్లిప్ ను మీకు వినిపించనివ్వండి..

##(పాట)##

ఇంటి కి సమీపం లోని ఏదో ఆలయం లో భజన కీర్తనలు జరుగుతున్నాయని మీరు అనుకుంటూ ఉంటారు.  అయితే ఈ స్వరం భారతదేశాని కి వేల మైళ్ల దూరం లో ఉన్న దక్షిణ అమెరికా దేశం గయాన నుండి మీకు చేరింది.  19వ శతాబ్దం లో మరి 20వ శతాబ్దం లో ఇక్కడి నుండి పెద్ద సంఖ్య లో ప్రజలు గుయాన కు వెళ్ళారు.  ఇక్కడి నుండి భారతదేశం లోని అనేక సంప్రదాయాల ను కూడా తీసుకుపోయారు.  ఉదాహరణ కు తీసుకొంటే మనం భారతదేశం లో హోలీ ని జరుపుకుంటున్నప్పుడు గయాన లో కూడా హోలీ రంగు లు పలకరిస్తాయి.  హోలీ రంగు లు ఉన్న చోట ఫగ్వా సంగీతం కూడా ఉంటుంది.  గయాన లోని ఫగ్వా లో రాముని తో, శ్రీకృష్ణుని తో సంబంధం ఉన్న పెళ్ళి పాట లు పాడే ప్రత్యేక సంప్రదాయం ఉంది.  ఈ పాటలను చౌతాల్ అని అంటారు.  ఇక్కడ ప్రాచుర్యం లో ఉన్న అదే రకమైన రాగం లోనే తార స్థాయి లో వాటి ని పాడతారు.  ఇది మాత్రమే కాదు- గయాన లో చౌతాల్ పోటీ కూడా జరుగుతుంది.  అదే విధం గా చాలా మంది భారతీయులు- ముఖ్యం గా తూర్పు ఉత్తర్ ప్రదేశ్, బిహార్ ప్రాంతాల నుండి ప్రజలు- ఫిజీ కి కూడా వెళ్లారు.  వారు సంప్రదాయ భజనల ను, కీర్తనల ను పాడే వారు.  వాటి లో ప్రధానంగా రామ్ చరిత్ మానస్ పద్య పాదాలు ఉండేవి.  వారు ఫిజీ లో భజనల కు, కీర్తనల కు సంబంధించిన అనేక సమ్మేళనాల ను కూడా ఏర్పాటు చేశారు.  నేటికీ రామాయణ మండలి పేరుతో ఫిజీ లో రెండు వేల కు పైగా భజన-కీర్తన మండలులు ఉన్నాయి.   వాటి ని ప్రస్తుతం ప్రతి గ్రామం లో, ప్రతి ప్రాంతం లో చూడవచ్చును.  నేను ఇక్కడ కొన్ని ఉదాహరణల ను మాత్రమే ఇచ్చాను.  మీరు ప్రపంచం మొత్తం మీద చూశారంటే భారతీయ సంగీత ప్రియుల జాబితా చాలా పెద్దది.

ప్రియమైన నా  దేశప్రజలారా, ప్రపంచం లోని పురాతన సంప్రదాయాల లో మన దేశం ఒకటైనందుకు మనమందరం ఎప్పుడూ గర్విస్తాం.  అందువల్ల, మన సంప్రదాయాల ను, సంప్రదాయ విజ్ఞానాన్ని కాపాడుకోవడం, వాటిని  ప్రోత్సహించడం, సాధ్యమైనంత వరకు ముందుకు తీసుకు పోవడం కూడా మన బాధ్యత.  మన ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ కు చెందిన కొందరు మిత్రులు అలాంటి ప్రశంసనీయమైన ప్రయత్నాన్నే చేస్తున్నారు.  ఈ ప్రయత్నం నాకు బాగా నచ్చింది.  అందుకే దాని ని గురించి ‘మన్ కీ బాత్’ శ్రోతల కు వెల్లడించాలి అని అనుకున్నాను.

మిత్రులారా, నాగాలాండ్ లోని నాగ సమాజ  జీవన శైలి, వారి కళ, సంస్కృతి, సంగీతం అందరి ని ఆకట్టుకొంటాయి.  ఇవి మన దేశ  అద్భుతమైన వారసత్వం లో ఒక ముఖ్యమైన భాగం.  నాగాలాండ్ ప్రజల జీవితం, వారి నైపుణ్యాలు కూడా సుస్థిర జీవన శైలి కి చాలా ముఖ్యమైనవి.  ఈ సంప్రదాయాల ను, నైపుణ్యాల ను కాపాడడం తో పాటు గా వాటిని తరువాతి తరాని కి అందించేందుకు అక్కడి ప్రజలు 'లిడి-క్రో-యు' పేరు తో ఓ సంస్థ ను ఏర్పాటు చేసుకున్నారు.  క్రమ క్రమం గా అదృశ్యమవుతున్న నాగ సంస్కృతి లోని విశేషాల ను పునరుద్ధరించేందుకు 'లిడి-క్రో-యు' సంస్థ కృషి చేస్తోంది.  ఉదాహరణ కు నాగ  జానపద సంగీతం సుసంపన్నమైంది.  ఈ సంస్థ నాగ మ్యూజిక్ ఆల్బమ్స్ ను ఆవిష్కరించే పని ని మొదలుపెట్టింది.  ఇప్పటి వరకు అలాంటి మూడు ఆల్బమ్ లు విడుదల అయ్యాయి.  వారు జానపద సంగీతాని కి మరియు జానపద నృత్యాని కి సంబంధించిన కార్యశాలల ను కూడా నిర్వహిస్తారు.  వీటి కి సంబంధించి యువత కు శిక్షణ ను కూడా ఇస్తున్నారు.  అంతేకాదు సాంప్రదాయిక నాగాలాండ్ శైలి లో దుస్తుల తయారీ లో, కుట్టుపని లో, నేయడం లో కూడా యువత శిక్షణ పొందుతున్నది.  ఈశాన్య రాష్ట్రాల లో  వెదురు తో అనేక రకాల ఉత్పత్తుల ను తయారు చేస్తారు.  కొత్త తరాని కి చెందిన యువత కు  కూడా వెదురు ఉత్పత్తుల ను ఎలా తయారు చేయవచ్చో నేర్పుతున్నారు.  దీంతో ఈ యువత వారి సంస్కృతి తో ముడిపడి ఉండడమే కాకుండా వారికి కొత్త ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి.  నాగ జానపద సంస్కృతి  ని గురించి మరింత ఎక్కువ మంది కి తెలియజేసేందుకు లిడి-క్రో-యుసంస్థ కృషి చేస్తోంది.

మిత్రులారా, అలాంటి సాంస్కృతిక శైలులు, సంప్రదాయాలు మీ ప్రాంతం లో కూడా ఉండనే ఉంటాయి.  మీరు కూడా మీ మీ ప్రాంతాల లో అలాంటి కృషి ని చేయవచ్చును.  ఎక్కడైనా ఇలాంటి అద్వితీయ ప్రయత్నాల ను గురించి మీకు తెలిస్తే ఆ సమాచారాన్నేదో నాతో కూడాను తప్పక పంచుకోగలరు.

ప్రియమైన నా దేశప్రజలారా,

‘విద్యాధనం సర్వధనం ప్రధానమ్’ అని లోకోక్తి.

అంటే ఎవరైనా విద్య ను దానం చేస్తుంటే అతను సమాజ హితం కోసం అతి పెద్ద పని ని చేస్తున్నట్టు.

విద్య రంగం లో వెలిగించే చిన్న దీపం అయినా సరే యావత్తు సమాజాని కి వెలుగుల ను ఇస్తుంది.  దేశ వ్యాప్తం గా ఇలాంటి అనేక ప్రయత్నాలు ప్రస్తుతం జరగడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది.  ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లఖ్ నవూ కు 70-80 కిలోమీటర్ల దూరంలోని హర్దోయి ప్రాంతం లో బాంసా అని ఒక గ్రామం ఉంది.  విద్య లో వెలుగుల ను నింపే పని లో నిమగ్నం అయినటువంటి ఈ గ్రామాని కి చెందిన శ్రీ జతిన్ లలిత్ సింహ్ ను గురించి నాకు సమాచారం వచ్చింది.  జతిన్ గారు రెండు సంవత్సారల కిందట ఇక్కడ సామాజిక గ్రంథాలయాన్ని, వనరుల కేంద్రాన్ని ప్రారంభించారు.  ఆ కేంద్రం లో హిందీ, ఆంగ్ల సాహిత్యం, కంప్యూటర్, న్యాయశాస్త్రం అంశాల తో పాటు ప్రభుత్వ పోటీ పరిక్ష ల సన్నద్ధత కు సంబంధించిన 3000 కంటే ఎక్కువ పుస్తకాలు ఉన్నాయి.  పిల్లల ఇష్టాయిష్టాల కు కూడా ఈ లైబ్రరీ లో పూర్తి ప్రాధాన్యాన్ని ఇవ్వడమైంది.   ఇక్కడ ఉన్న కామిక్స్ పుస్తకాల ను, విద్య సంబంధి బొమ్మల ను పిల్లలు చాలా ఇష్టపడతారు.  చిన్న పిల్లలు ఆటల తో కొత్త విషయాల ను నేర్చుకొనేందుకు ఇక్కడి కి వస్తుంటారు.  విద్యార్జన తాలూకు అభ్యాసం.. అది ఆఫ్ లైన్ అయినా గాని, లేదా ఆన్ లైన్ అయినా గాని.. దాదాపు 40 మంది వాలంటీర్లు ఈ కేంద్రం లో విద్యార్థులకు మార్గనిర్దేశం చేయడం లో తీరిక లేకుండా ఉన్నారు.  నిత్యం దాదాపు గా 80 మంది విద్యార్థులు చదువుకోవడం కోసం ఈ గ్రంథాలయాని కి వస్తుంటారు.

మిత్రులారా, ఝార్ ఖండ్ కు చెందిన సంజయ్ కశ్యప్ గారు కూడా పేద పిల్లల కలల కు కొత్త రెక్కలను తొడుగుతున్నారు.  తన విద్యార్థి జీవనం లో సంజయ్ గారి కి మంచి పుస్తకాల కు లోటు గా ఉండింది.  ఇలాంటి పరిస్థితుల లో పుస్తకాలు లేకపోవడం కారణం గా తమ ప్రాంతం బాలల భవిష్యత్తు అంధకారం కాకూడదు అని ఆయన నిర్ణయించుకున్నారు.  ఈ మిశన్ కారణం గా ఈ రోజు ఆయన ఝార్ ఖండ్ లో అనేక జిల్లాల లో పిల్లల కు 'లైబ్రరీ మ్యాన్' అయ్యారు.  సంజయ్ గారు తన ఉద్యోగ ప్రారంభం లో తన స్వస్థలం లో మొదటి లైబ్రరీ ని ఏర్పాటు చేశారు.   ఉద్యోగం చేస్తున్న సమయంలో ఎక్కడికి బదిలీ అయినా పేదలు, ఆదివాసీ పిల్లల చదువుల కోసం లైబ్రరీ ని ప్రారంభించే లక్ష్యం తో పని చేశారు.  ఇలా చేస్తూనే ఝార్ ఖండ్ లోని అనేక జిల్లాల లో పిల్లల కోసం లైబ్రరీల ను ప్రారంభించారు.  గ్రంథాలయాన్ని ప్రారంభించాలన్న ఆయన లక్ష్యం నేడు సామాజిక ఉద్యమం గా రూపుదిద్దుకుంటోంది.  సంజయ్ గారు అయినా, జతిన్ గారు అయినా.. వారి ఇలాంటి అనేక ప్రయత్నాల కు నేను వారిని ప్రత్యేకం గా అభినందిస్తున్నాను.

ప్రియమైన నా దేశవాసులారా, పరిశోధన, నూతన ఆవిష్కరణల తో పాటు అత్యాధునిక సాంకేతికత, పరికరాల సహాయం తో వైద్య విజ్ఞాన ప్రపంచం చాలా పురోగతి ని సాధించింది.  అయితే కొన్ని వ్యాధులు నేటికీ మనకు పెద్ద సవాలు గా ఉన్నాయి.  అటువంటి వ్యాధుల లోకండరాల క్షీణత ఒకటి.  ఇది ఏ వయస్సులో అయినా సంభవించే జన్యుపరమైన వ్యాధి.  ఇందులో కండరాలు బలహీనపడటం మొదలవుతుంది.  రోగి తన దైనందిన జీవనం లో చిన్న చిన్న పనులు కూడా చేయడం కష్టం గా మారుతుంది.  అటువంటి రోగుల చికిత్స కు, సంరక్షణ కు గొప్ప సేవ భావం అవసరం.  హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ లో మనకు అలాంటి కేంద్రం ఉంది.  ఇది కండరాల బలహీనత రోగుల కు కొత్త ఆశాకిరణంగా మారింది.  ఈ కేంద్రం పేరు మానవ్ మందిర్.  దీనిని ఇండియన్ అసోసియేశన్ ఆఫ్ మస్కులర్ డిస్ట్రోఫీ నిర్వహిస్తోంది.  మానవ్ మందిర్ దాని పేరుకు తగ్గట్టుగానే మానవ సేవ కు అద్భుతమైన ఉదాహరణగా ఉంది.  మూడు-నాలుగు సంవత్సరాల కిందటే ఇక్కడ రోగుల కు ఒపి డి, అడ్మిశషన్ సేవ లు ప్రారంభమయ్యాయి.  మానవ్ మందిర్ లో దాదాపు గా 50 మంది రోగుల కు పడకల సౌకర్యం కూడా ఉంది.  ఫిజియోథెరపీ, ఎలక్ట్రోథెరపీ, హైడ్రోథెరపీ లతో పాటు గా యోగ - ప్రాణాయామం సహాయంతో కూడా వ్యాధుల కు  చికిత్స చేస్తారు.

మిత్రులారా, అన్ని రకాల అత్యాధునిక సౌకర్యాల ద్వారా ఈ కేంద్రం రోగుల జీవనం లో సానుకూల మార్పు తీసుకురావడానికి కూడా ప్రయత్నిస్తోంది.  మస్కులర్ డిస్ట్రోఫీ కి సంబంధించిన సవాళ్ల లో ఒకటి దాని గురించి అవగాహన లేకపోవడం.  అందుకే ఈ కేంద్రం హిమాచల్ ప్రదేశ్ లోనే కాకుండా దేశవ్యాప్తం గా రోగుల కు అవగాహన శిబిరాల ను నిర్వహిస్తోంది.  అత్యంత స్ఫూర్తి ని ఇచ్చేటటువంటి విషయం ఏమిటి అంటే ఈ వ్యాధి తో బాధపడే వారే ఈ సంస్థ నిర్వహణ లో ప్రధానం గా భాగస్వాములు కావడం.  సామాజిక కార్యకర్త ఊర్మిళ బల్దీ గారు, ఇండియన్ అసోసియెశన్ ఆఫ్ మస్క్యులర్ డిస్ట్రోఫీ అధ్యక్షురాలు సోదరి సంజన గోయల్ గారు, ఈ సంస్థ నిర్మాణం లో ముఖ్యపాత్ర పోషించిన విపుల్ గోయల్ గారు ఈ సంస్థ నిర్వహణ లో చాలా ప్రధానమైనటువంటి భూమిక ను నిర్వహిస్తున్నారు.  మానవ్ మందిర్ ను ఆసుపత్రి గా, పరిశోధన కేంద్రం గా అభివృద్ధి చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.  దీంతో రోగుల కు ఇక్కడ మెరుగైన వైద్యం అందుతుంది.  ఈ దిశ లో ప్రయత్నిస్తున్న అందరి ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.  కండరాల క్షీణత తో బాధపడుతున్న వారందరికీ మంచి జరగాలి అని కోరుకొంటున్నాను.

ప్రియమైన నా దేశప్రజలారా, నేటి ‘మన్ కీ బాత్’లో మనం చర్చించుకున్న దేశవాసుల సృజనాత్మక, సామాజిక కార్యక్రమాలు దేశ  సమర్థత కు, ఉత్సాహాని కి ఉదాహరణలు గా ఉన్నాయి.  ఈ రోజు న దేశం కోసం ఏదో ఒక రంగం లో ప్రతి స్థాయి లో విభిన్నం గా చేయాలని దేశం లోని ప్రతి ఒక్కరు  ప్రయత్నిస్తున్నారు.  జి-20 లాంటి అంతర్జాతీయ అంశం లో మన నేత సహచరుడు ఒకరు తన బాధ్యత ను అర్థం చేసుకుని దానిని నెరవేర్చేందుకు ముందుకు రావడాన్ని ఈ రోజు న జరిగిన చర్చ లోనే చూశాం.  అదే విధం గా కొందరు పర్యావరణం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.  కొందరు నీటి కోసం పనిచేస్తున్నారు.  చాలా మంది విద్య, వైద్యం, సైన్స్ టెక్నాలజీ నుండి సంస్కృతి-సంప్రదాయాల వరకు అసాధారణమైన కృషి ని చేస్తున్నారు.  ఎందుకంటే ఈ రోజు మన లోని ప్రతి పౌరుడు/ ప్రతి పౌరురాలు వారి కర్తవ్యాన్ని అర్థం చేసుకొంటున్నారు.  దేశ పౌరుల లో అటువంటి కర్తవ్య భావన వచ్చినప్పుడు దేశం బంగారు భవిష్యత్తు దానంతట అదే నిర్ణయం అవుతుంది.  దేశం యొక్క  బంగారు భవిష్యత్తు లో మనకు కూడా బంగారు భవిష్యత్తు ఉంటుంది.

దేశ ప్రజల కృషి కి నేను మరోసారి నమస్కరిస్తున్నాను.  మనం వచ్చే నెల లో మళ్ళీ కలుద్దాం.  ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల ను గురించి తప్పక మాట్లాడుకుందాం.  మీరు మీ సూచనల ను, ఆలోచనల ను తప్పక పంపుతూ ఉండండి.  మీ అందరికీ చాలా ధన్యవాదాలు.

 

***



(Release ID: 1879354) Visitor Counter : 234