ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు రూ.17,000 కోట్ల జీఎస్టీ పరిహారం విడుదల చేసిన కేంద్రం

Posted On: 25 NOV 2022 4:11PM by PIB Hyderabad

2022 ఏప్రిల్ నుండి జూన్ వరకు మిగిలిన జీఎస్టీటి పరిహారం కింద 24.11.2022న రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం రూ.17,000 కోట్లు ( దిగువ పట్టిక ప్రకారం రాష్ట్రాల వారీగా వివరాలు ) కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. పైన పేర్కొన్న మొత్తంతో సహా 2022-23 సంవత్సరంలో  ఇప్పటివరకు రాష్ట్రాలు/యూటీలకు కేంద్రం విడుదల చేసిన మొత్తం పరిహారం రూ.1,15,662 కోట్లు .

అక్టోబరు 2022 వరకు మొత్తం సెస్సు వసూళ్లు రూ.72,147 మాత్రమే అయినప్పటికీ ఈ మొత్తం విడుదల చేయబడింది. మిగిలిన రూ. 43,515 కోట్లను కేంద్రం తన సొంత వనరుల నుంచి విడుదల చేస్తోంది. ఈ విడుదలతో ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు రాష్ట్రాలకు నష్టపరిహారం చెల్లించేందుకు అందుబాటులో ఉన్న మొత్తం సెస్‌ను కేంద్రం ముందుగానే విడుదల చేసింది. రాష్ట్రాలు తమ వనరులను నిర్వహించడంలో సహాయపడటానికి మరియు ఆర్థిక సంవత్సరంలో వారి కార్యక్రమాలను ముఖ్యంగా మూలధనంపై ఖర్చులు విజయవంతంగా నిర్వహించేలా ఈ నిర్ణయం తీసుకోబడింది.

ఈ ఏడాది మేలో కూడా కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి-మే'2022 కాలానికి రాష్ట్రాలకు తాత్కాలిక జిఎస్‌టి పరిహారంగా రూ. 86,912 కోట్లు విడుదల చేసింది. జీఎస్టీ పరిహార నిధిలో రూ. 25,000 కోట్లు మాత్రమే ఉన్నప్పటికీ కేంద్రం సొంత వనరుల నుంచి రూ.62,000 కోట్లు రిలీజ్ చేసింది.

 

రాష్ట్రం/యూటీ పేరు

(రూ. కోట్లలో )

ఆంధ్రప్రదేశ్

682

అస్సాం

192

బీహార్

91

ఛత్తీస్‌గఢ్

500

ఢిల్లీ

1,200

గోవా

119

గుజరాత్

856

హర్యానా

622

హిమాచల్ ప్రదేశ్

226

జమ్మూ కాశ్మీర్

208

జార్ఖండ్

338

కర్ణాటక

1,915

కేరళ

773

మధ్యప్రదేశ్

722

మహారాష్ట్ర

2,081

ఒడిశా

524

పుదుచ్చేరి

73

పంజాబ్

984

రాజస్థాన్

806

తమిళనాడు

1,188

తెలంగాణ

542

ఉత్తర ప్రదేశ్

1,202

ఉత్తరాఖండ్

342

పశ్చిమ బెంగాల్

814

మొత్తం

17,000

 

 

****


(Release ID: 1878998) Visitor Counter : 210