సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
జయదీప్ ముఖర్జీ డాక్యుమెంటరీ “అదర్ రే: ది ఆర్ట్ ఆఫ్ సత్యజిత్ రే” ఇఫ్ఫి 53లో ప్రదర్శన
“రే పోస్టర్ మేకింగ్” పోటీకి సంబంధించిన ఎంట్రీలు ఇఫ్ఫి 53లో ప్రదర్శన
'సత్యజిత్ రే' మీద ఇఫ్ఫి 53లో ప్రత్యేక విభాగం
సత్యజిత్ రే సృజనాత్మకతపై నా దృక్పథాన్ని చూపించడానికి ప్రయత్నించాను: జయదీప్ ముఖర్జీ
సృజనాత్మక మేధావి అయిన రే మూలాలను "అదర్ రే: ది ఆర్ట్ ఆఫ్ సత్యజిత్ రే" వివరించింది: జయదీప్ ముఖర్జీ
ఇఫ్ఫి 53లో 'సత్యజిత్ రే' మీద ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. జయదీప్ ముఖర్జీ తీసిన 34 నిమిషాల నాన్-ఫీచర్ ఫిల్మ్ “అదర్ రే: ది ఆర్ట్ ఆఫ్ సత్యజిత్ రే”ను ఇండియన్ పనోరమా విభాగంలో 24 నవంబర్ 2022న ప్రదర్శించారు. మీడియా సహా ఇతర ప్రతినిధులతో సంభాషించడం కోసం పీఐబీ నిర్వహించిన ఇఫ్ఫి “టేబుల్ టాక్స్”లో దర్శకుడు జయదీప్ ముఖర్జీ పాల్గొన్నారు. 'రే'లోని మేధావి గురించి తన దృక్పథాన్ని వివరించే జీవిత చరిత్ర డాక్యుమెంటరీగా “అదర్ రే: ది ఆర్ట్ ఆఫ్ సత్యజిత్ రే” నిర్మించినట్లు వెల్లడించారు.
'రే'లోని సృజనాత్మక కోణాలైన బొమ్మలు గీయడం, అందంగా రాయడం, సంగీతాన్ని స్వరపరచడం, దర్శకత్వం గురించి ఈ చిత్రంలో సంపూర్ణంగా వివరించినట్లు ముఖర్జీ చెప్పారు. తాత ఉపేంద్ర కిషోర్ రే చౌధురి, తండ్రి సుకుమార్ సేన్ నుంచి 'రే'కు సృజనాత్మకత వారసత్వంగా అందిందని, శాంతినికేతన్‌లో నందలాల్ బోస్, ఇతర దిగ్గజాల వద్ద తీసుకున్న శిక్షణ రే రచనలలో స్పష్టంగా ప్రతిబింబిస్తుందని వెల్లడించారు.
![](https://ci3.googleusercontent.com/proxy/jQ_eOmQ1YOXauejGZkmeGZONZNtciKVXd_DCkhkobhi3lTjxwZZSxrA8hE2g4F1wlLrRgjv5tS2CM_Wnf6tFgeUgqLMCEu24OSEDKAPV5636tHpG4ougd1CNCNE3=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/otherRay-1QXCM.jpg)
ప్రకటనల సంస్థ డీజే కేమార్‌లో సంవత్సరాల పాటు జూనియర్ విజువలైజర్‌గా గడపడం, ప్రొఫెసర్ అలెక్స్ అరోన్సన్ నుంచి పాశ్చాత్య సంగీతాన్ని నేర్చుకోవడం వంటివి రే వ్యక్తిత్వాన్ని మలిచిన తీరును కూడా ఈ చిత్రం వెల్లడించిందని శ్రీ ముఖర్జీ తెలిపారు. ఆయన సినిమాల్లోని నేపథ్య సంగీతంలో అవి ప్రతిబింబిస్తాయని చెప్పారు.
![](https://ci5.googleusercontent.com/proxy/JDv1VR1xWmK18uyJbj1Id-jHL4W15GmIgf7IjEsOXPffHvlW24MCiwIsyEHauehk9jkUgtzTddA6ZcP84oDmCehOutFBgW_SZZDNoXhMA1Mb4_AX_koPLg59VTtw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/otherRay-27EC5.jpg)
అదర్ రే ఆలోచన గురించి తాను స్వయంగా సత్యజిత్ రేతో ఎలా చర్చించాడో ముఖర్జీ గుర్తుచేసుకున్నారు. అయితే దానికి రూపాన్ని ఇవ్వడానికి అనేక దశాబ్దాలు కష్టపడాల్సి వచ్చిందని చెప్పారు. 2007లో కోల్‌కతాలో జరిగిన ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించిన రే పెయింటింగ్‌లు, ఇతర సృజనాత్మకతల ఛాయాచిత్రాలను తీయడం, లండన్‌లో ఉన్న సర్ రిచర్డ్ అటెన్‌బరో సహా రే ఇతర స్నేహితుల నుంచి వివరాలు తెలుసుకోవడం గురించి శ్రీ ముఖర్జీ వెల్లడించారు.
![](https://ci3.googleusercontent.com/proxy/NcFdl6ZSMV88uaSrFq7kCjyypPprBIFn7FDkf4zK9LnLInkoVCW0JUnETRPkhltOsAW5mVEWrlUy_XEXuxqcu9rs9LaEI4t00Kq0SdMI2cBv9PpmuyMZzOYZtN1s=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/otherRay-3V39U.jpg)
మరో 2-3 సంవత్సరాల్లో రాబోతున్న రిత్విక్ ఘటక్, మృణాల్ సేన్ శత జయంతి ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని వారి గురించి కూడా డాక్యుమెంటరీలు తీయాలని భావిస్తున్నట్లు దర్శకుడు చెప్పాడు.
"ది వన్ అండ్ ఓన్లీ రే" అనే విభాగాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న చలనచిత్ర ఔత్సాహికులు సరికొత్తగా మార్చిన రే చలనచిత్రాల పోస్టర్ల పోటీ ఇది. సత్యజిత్ రే నిర్మించిన రెండు అత్యుత్తమ చిత్రాలను కూడా ఇఫ్ఫి 2022లో ప్రదర్శిస్తున్నారు. అవి, 1977లో తీసిన శత్రంజ్ కే ఖిలాడి, 1989లో తీసిన గణశత్రు.
![](https://ci6.googleusercontent.com/proxy/IeH6WMctzocsaVYuJBIEFpsEzNqzB5eCZcHRAKtjdufSvJwtgfpSYkGvCmfLzroV5WhgPGJbHTbLmOQHQC9-Sro6r-ddgJz-CLRU897OVFCEN-Pmz7g6qDSaU1Hg=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/otherRay-4TR4X.jpg)
![](https://ci4.googleusercontent.com/proxy/EqLt01xWTdXRAh9IMerTC_AJ4thwCZjwD5f007xOknECPrVeHI4osH55fm7QFy2OLILvGd-ABiJ-UK1xr5b5nyPpCKo4_3PwfmjYEqUHcSWMPJKEPyOvCusRKUpS=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/otherRay-5XQ9Q.jpg)
![](https://ci5.googleusercontent.com/proxy/AWvajkC5ebj1qkqdoZSdpAjCGimWSPTmrP3i6VkZXmsv-ENG9-ied12jT4nuQJNZh77VI4w9YSvttgy0MBvnh9NWeeT3Y6Jqu_HC9eP6op_bbZ7TT7wANWfJ97Xu=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/otherRay-6RODR.jpg)
దర్శకుడు జయదీప్ ముఖర్జీతో పూర్తి టేబుల్ టాక్‌ని ఇక్కడ చూడండి:
* * *
(Release ID: 1878995)
Visitor Counter : 142