ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ లాసిత్ బోర్ ఫుకన్ యొక్క 400వ జయంతిసందర్భం లో ఏడాది పొడవునా నిర్వహించిన ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఉద్దేశించి నవంబరు 25వ తేదీ నాడు ప్రసంగించనున్న ప్రధాన మంత్రి


అహోమ్ సామ్రాజ్యం యొక్క రాయల్ ఆర్మీ కి సేనానాయకుని గా శ్రీ లాసిత్ బోర్ ఫుకన్ వ్యవహరించారు; 1671 లోజరిగిన సరాయి ఘాట్ సమరం లో ముఘలుల ను ఈ రాయల్ ఆర్మీ ఘోర పరాజయం పాలు చేసింది

Posted On: 24 NOV 2022 11:46AM by PIB Hyderabad

శ్రీ లాసిత్ బోర్ ఫుకన్ 400వ జయంతి ని పురస్కరించుకొని సంవత్సరం పాటు నిర్వహించిన ఉత్సవాల ముగింపు సందర్భం లో 2022 నవంబర్ 25వ తేదీ న ఉదయం 11 గంటల కు న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.

 

మరుగున పడిపోయినటువంటి వీరుల ను సముచిత రీతి న గౌరవించుకోవాలనేదే ప్రధాన మంత్రి నిరంతర ప్రయాస గా ఉంటూ వస్తోంది. దీనికి అనుగుణం గానే, దేశం 2022వ సంవత్సరాన్ని శ్రీ లాసిత్ బోర్ ఫుకన్ 400వ జయంతి సంవత్సరం గా జరుపుకొంటోంది. ఈ ఉత్సవాల ను భారతదేశాని కి అప్పటి రాష్ట్రపతి అయిన శ్రీ రాం నాథ్ కోవింద్ ఈ ఏడాది ఫిబ్రవరి లో గువాహాటీ లో ప్రారంభించారు.

 

 

శ్రీ లాసిత్ బోర్ ఫుకన్ (జననం: 24వ తేదీ నవంబర్, 1622 మరణం: 25వ తేదీ ఏప్రిల్, 1672) అసమ్ కు చెందిన అహోమ్ సామ్రాజ్యం యొక్క రాయల్ ఆర్మీ కి సేనానాయకుని గా ప్రసిద్ధికెక్కారు. ముఘలుల ను రాయల్ ఆర్మీ ఓడించడం తో పాటు ఔరంగజేబ్ నాయకత్వం లో అంతకంతకూ విస్తరించాలన్న ముఘలు ల ఆకాంక్షల ను విజయవంతం గా అడ్డుకొంది కూడాను. 1671వ సంవత్సరం లో జరిగిన సరాయి ఘాట్ సంగ్రామం లో పాల్గొన్న అసమ్ సైనికుల లో శ్రీ లాసిత్ బోర్ ఫుకన్ స్ఫూర్తి ని నింపి, దరిమిలా ముఘలుల ను అణచివేసి వారికి అవమానకరమైనటువంటి అపజయాన్ని మిగిల్చారు. శ్రీ లాసిత్ బోర్ ఫుకన్ మరియు ఆయన ఆధ్వర్యం లోని సైన్యం సలిపిన వీరోచితమైనటువంటి పోరు మన దేశ చరిత్ర లో అత్యంత ప్రేరణాత్మకం అయిన సైనిక ప్రతిఘటనయుక్త సాహసకృత్యాల లో ఒకటి గా నిలచింది.

 

 

***

 

 



(Release ID: 1878541) Visitor Counter : 109