ప్రధాన మంత్రి కార్యాలయం

కొత్త గా చేర్చుకొన్న ఉద్యోగుల కు దాదాపు గా 71,000 నియామక పత్రాల ను రోజ్ గార్ మేళా లో భాగం గా నవంబర్ 22వ తేదీ నాడు పంపిణీ చేయనున్న ప్రధాన మంత్రి


కొత్త గా నియామకం అయిన వారికి మాడ్యూల్ - ఆన్ లైన్ ఓరియంటేశన్ కోర్సు కర్మయోగిప్రారంభ్ ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు

Posted On: 21 NOV 2022 1:14PM by PIB Hyderabad

రోజ్ గార్ మేళా లో భాగం గా, దాదాపు గా 71,000 నియామక పత్రాల ను కొత్త గా ఉద్యోగాల లోకి చేర్చుకొన్న వ్యక్తుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవంబర్ 22వ తేదీ న ఉదయం పూట పదిన్నర గంట ల వేళ కు వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా పంపిణీ చేయనున్నారు.

 

ఉపాధి కల్పన కు అత్యంత అధిక ప్రాధాన్యాన్ని కట్టబెట్టాలన్న ప్రధాన మంత్రి నిబద్ధత ను నెరవేర్చే దిశ లో రోజ్ గార్ మేళా ఒక ముందడుగు గా ఉన్నది. రోజ్ గార్ మేళా ఉపాధి కల్పన ను పెంపొందింపచేయడం లో ఒక ఉత్ప్రేరకం గా పని చేయగలదన్న, యువతీ యువకుల కు వారి సశక్తీకరణ తో పాటు దేశాభివృద్ధి లో వారు పాలుపంచుకోవడానికి కూడాను సార్థక అవకాశాల ను కల్పిస్తుందన్న ఆశాభావం వ్యక్తం అవుతున్నది. ఇంతకు మునుపు అక్టోబరు లో జరిగిన రోజ్ గార్ మేళా లో, కొత్త గా ఉద్యోగాల లోకి చేర్చుకొన్న 75,000 మంది కి నియామక లేఖల ను అందజేయడమైంది.

 

కొత్త గా భర్తీ అయిన వ్యక్తుల కు నియామక పత్రాల ను దేశవ్యాప్తం గా (గుజరాత్ మరియు హిమాచల్ ప్రదేశ్ మినహా) మొత్తం 45 స్థానాల లో ఇవ్వడం జరుగుతుంది. ఇంతకు పూర్వం భర్తీ చేసిన ఉద్యోగాల కేటగిరీల కు అదనం గా ఉపాధ్యాయులు, అధ్యాపకులు, నర్సులు, నర్సింగ్ ఆఫీసర్స్, వైద్యులు, ఫార్మసిస్టు లు, రేడియోగ్రాఫర్ లు, ఇంకా ఇతర సాంకేతిక మరియు పేరామెడికల్ పోస్టుల ను కూడా భర్తీ చేయడం జరుగుతున్నది. చెప్పుకోదగిన సంఖ్య లో ఉద్యోగాల ను హోం మంత్రిత్వ శాఖ ద్వారా కేంద్రీయ సాయుధ పోలీసు బలగాల (సిఎపిఎఫ్) కు చెందిన వేరు వేరు విభాగాల లో భర్తీ చేయడం జరుగుతోంది.

 

కర్మయోగి ప్రారంభ మాడ్యూల్ ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. ఈ మాడ్యూల్ ను వివిధ ప్రభుత్వ విభాగాల లో నూతనం గా నియామకం అయిన వారికి ఉద్దేశించినటువంటి ఒక ఆన్ లైల్ ఓరియంటేశన్ కోర్సు అని చెప్పవచ్చును. దీనిలో ప్రభుత్వ ఉద్యోగుల కు ప్రవర్తన సంహిత, పని ప్రదేశం లో పాటించవలసిన నైతిక ప్రమాణాలు, సజ్జనత్వం, మానవ వనరుల సంబంధి విధానాలు, ఇంకా ఇతర ప్రయోజనాలు, భత్యాల వంటివి ఉంటాయి. అవి కొత్త గా ఉద్యోగం లో చేరిన వారు పని ప్రదేశం లో అనుసరించవలసివున్న విధానాల కు అలవాటుపడే విధం గాను, కొత్త భూమికల లోకి సాఫీ గా మారిపోయే విధం గాను సాయపడుతాయి. వారికి వారి యొక్క జ్ఞానాన్ని, నైపుణ్యాల ను మరియు దక్షతల ను పెంపొందింప చేసుకోవడం కోసం igotkarmayogi.gov.in ప్లాట్ ఫార్మ్ లోని ఇతర కోర్సుల ను నేర్చుకొనే అవకాశాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది.

 

****



(Release ID: 1877700) Visitor Counter : 143