రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

100% విద్యుదీకరణ దిశగా సాగుతున్న భారతీయ రైల్వేలు


● మొత్తం బీజీ నెట్‌వర్క్‌లో 82% విద్యుద్దీకరణ పూర్తి చేసిన భారతీయ రైల్వేలు

● 2022 ఏప్రిల్-అక్టోబర్‌లో 1223 రూట్ కిలోమీటర్ల (ఆర్‌కేఎంలు) విద్యుదీకరణ

● ఇంధన వినియోగంలో మెరుగుదల కోసం విద్యుదీకరణ

Posted On: 10 NOV 2022 12:53PM by PIB Hyderabad

బ్రాడ్ గేజ్ నెట్‌వర్క్‌ను పూర్తిగా విద్యుదీకరించే ప్రతిష్టాత్మక ప్రణాళికను భారతీయ రైల్వే ప్రారంభించింది. దీనివల్ల ఇంధన వినియోగంలో మెరుగుదలతో పాటు, ఇంధన వ్యయం తగ్గుతుంది, విలువైన విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది.

ఎఫ్‌వై 2022-23 ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ నెల వరకు, భారతీయ రైల్వే 1223 రూట్ కిలోమీటర్ల (ఆర్‌కేఎంలు) విద్యుదీకరణ సాధించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో ఇది 895 ఆర్‌కేఎంలుగా ఉంది. గత సంవత్సరం గణాంకాలతో పోల్చితే ప్రస్తుత సంవత్సరంలో 36.64% వృద్ధి ఉంది.

2021-22లో భారతీయ రైల్వే చరిత్రలో 6,366 ఆర్‌కేఎంల రికార్డు స్థాయి విద్యుదీకరణ సాధ్యమైంది. అంతకుముందు అత్యధిక విద్యుదీకరణ 6,015 ఆర్‌కేఎంలు. 2020-21లో ఇది సాధించారు.

భారతీయ రైల్వేకు చెందిన మొత్తం బీజీ నెట్‌వర్క్‌ 65,141 ఆర్‌కేఎంలో (కేఆర్‌సీఎల్‌ సహా), 31.10.2022 నాటికి 53,470 బీజీ ఆర్‌కేఎం విద్యుదీకరించారు. ఇది మొత్తం బీజీ నెట్‌వర్క్‌లో 82.08%.

 

***



(Release ID: 1875038) Visitor Counter : 145