జౌళి మంత్రిత్వ శాఖ
పత్తికి విలువ ఆధారిత సరఫరా వ్యవస్థ అభివృద్ధి కోసం అమలు జరుగుతున్న చర్యలను జౌళి సలహా బృందం మూడో సమావేశంలో సమీక్షించిన కేంద్ర జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్
వస్తువులకు బ్రాండింగ్ సాధించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలకు పరిశ్రమలు తమ వంతు సహకారం అందించాలి.. శ్రీ గోయల్
అధిక దిగుబడి ఇచ్చే పత్తి విత్తనాల వినియోగం కోసం అధునాతన సాంకేతిక అంశాలను అమలు చేసే అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలి.. శ్రీ గోయల్
స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సీసీఐ ద్వారా పత్తి రైతులకు పత్తి గింజలు సేకరించడానికి చేతితో పట్టుకుని
పనిచేసే 75,000 యంత్రాలు అందించడానికి అవసరమైన నిధులు అందజేయడానికి జౌళి పరిశ్రమ, పరిశ్రమ వర్గాలు ముందుకు రావాలి శ్రీ గోయల్
Posted On:
08 NOV 2022 2:55PM by PIB Hyderabad
పత్తికి విలువ ఆధారిత సరఫరా వ్యవస్థ అభివృద్ధి కోసం అమలు జరుగుతున్న చర్యలను 07.11.2022న న్యూఢిల్లీలోని వాణిజ్యభవన్‌లో జరిగిన జౌళి సలహా సంఘం మూడో సమావేశంలో కేంద్ర జౌళి, వాణిజ్యం,పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ సమీక్షించారు. సమావేశానికి జౌళి,రైల్వే శాఖ సహాయ మంత్రి శ్రీమతి దర్శన వి. జర్దోష్, జౌళి శాఖ కార్యదర్శి శ్రీమతి రచనా షా, సలహా సంఘం అధ్యక్షుడు శ్రీ సురేష్ కోటక్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, విలువ ఆధారిత వ్యవస్థకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.
న్యూఢిల్లీ గత సమావేశంలో ఆమోదించిన అంశాలు అమలు జరుగుతున్న తీరును మంత్రి సమీక్షించారు.దేశంలో పత్తి దిగుబడిని ఎక్కువ చేసేందుకు అమలు చేస్తున్న సమగ్ర ప్రణాళికను ICAR-సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్ - (CICR), నాగ్‌పూర్ అమలు చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అమలు జరుగుతున్న ఉత్తమ విధానాలు, హెచ్డీ పిఎస్, రైతుల కోసం అవగాహన కార్యక్రమాలు అమలు చేయడం ద్వారా దిగుబడి ఎక్కువ చేయాలని నిర్ణయించడం జరిగింది. KASTURI దేశంలో ఉత్పత్తి అవుతున్న నూలు వస్తువులను కస్తూరి బ్రాండ్ పేరిట అమ్మకాలు సాగించాల్సిన సమయం వచ్చిందని రి గోయల్ అన్నారు. కస్తూరి బ్రాండ్ ఉత్పత్తులకు వినియోగదారుల నుంచి మరింత ఆదరణ లభించేలా చూడాలని పరిశ్రమ వర్గాలకు శ్రీ గోయల్ పిలుపు ఇచ్చారు. దీనివల్ల ఆత్మ నిర్భర్ భారత్ సాధనకు రంగం సిద్ధం అవుతుందని అన్నారు. కస్తూరి బ్రాండ్ ఉత్పత్తుల ఉత్పత్తి, నాణ్యతకు స్వీయ నియంత్రణ విధానంతో పరిశ్రమ వర్గాలు పనిచేసి తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని శ్రీ గోయల్ కోరారు. నాణ్యత అంశానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని శ్రీ గోయల్ అన్నారు. బిఐఎస్ చట్టం 2016 లో నిర్దేశించిన విధంగా పత్తి బేళ్లు ఉత్పత్తి సాగాలని అన్నారు. సాంకేతిక ప్రమాణాలు అమలు చేయడంతో పాటు పత్తి బేళ్లు గుర్తించడానికి వీలుగా ప్రమాణాలు అమలు చేసి సంబంధిత వర్గాల ప్రయోజనాల పరిరక్షణకు కృషి జరగాలని శ్రీ గోయల్ స్పష్టం చేశారు.
కస్తూరి ఉత్పత్తుల ప్రమాణాల నిర్ధారణ కోసం పరీక్ష వ్యవస్థ మరింత పటిష్టం కావాలని,డిఎన్ఏ, మూల గుర్తింపు కోసం ప్రమాణాలు అమలు కావాలని అన్నారు. బిఐఎస్,టీఆర్ఎ ల ద్వారా అధునాతన పరీక్షా సౌకర్యాలు కల్పిస్తామని శ్రీ గోయల్ హామీ ఇచ్చారు. దేశంలో పత్తి దిగుబడి పెంచేందుకు నాణ్యమైన పత్తి గింజ విత్తనాలు అందుబాటులోకి రావాలని శ్రీ గోయల్ అన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేసేందుకు వివిధ మంత్రిత్వ శాఖలు కలిసి యుద్ధ ప్రాతిపదికన చర్యలు అమలు చేయాలని అన్నారు. పత్తి దిగుబడి ఎక్కువ చేసేందుకు అధిక దిగుబడినిచ్చే పత్తి విత్తనాల వినియోగం కోసం అధునాతన సాంకేతికతలు ఉపయోగించడానికి అధిక సాంద్రత కలిగిన మొక్కల పెంపకం వ్యవస్థ వంటి వినూత్న వ్యవసాయ విధానాలు పరిచయం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. పత్తిని వేగంగా సేకరించడానికి దోహదపడే యంత్రాలను SIMA-CDRA అభివృద్ధి చేసిందని శ్రీ గోయల్ తెలిపారు. వీటి ద్వారా వేగంగా పత్తి విత్తనాలు సేకరించవచ్చునని శ్రీ గోయల్ వివరించారు. యాంత్రీకరణ ప్రోత్సహించడానికి మరియు ప్రాచుర్యం పొందేందుకు వస్త్ర పరిశ్రమ మరియు పరిశ్రమ సంఘాలు చేతులు కలపాలని శ్రీ గోయల్ కోరారు యంత్రాలను పంపిణీ చేయడానికి .కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సహకారంతో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ (CITI) ప్రత్యేక ప్రాజెక్టు అమలు చేస్తుంది. పత్తి రైతులకు పత్తి గింజలు సేకరించడానికి చేతితో పట్టుకుని పనిచేసే 75,000 యంత్రాలు సరఫరా చేయడానికి అవసరమైన నిధులు సమకూర్చడానికి పరిశ్రమ, పరిశ్రమ వర్గాలు ముందుకు వచ్చాయని శ్రీ గోయల్ తెలిపారు. పత్తి రైతులకు సాధికారత కల్పించేందుకు రైతు ఉత్పత్తి సంఘాలు మరింత కృషి చేయాలని మంత్రి కోరారు. పత్తి కలుషితం కావడానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా గుర్తించిన ఎరువుల సంచుల (రైతులు పత్తి తీయడం మరియు నిల్వ చేయడంలో తిరిగి ఉపయోగించే) రంగు మార్చాలన్న పరిశ్రమల డిమాండ్ పట్ల శ్రీ గోయల్ సానుకూలంగా స్పందించారు.సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ఇప్పటికే ' ఒక దేశం ఒకే ఎరువు' పథకాన్ని ప్రకటించిందని శ్రీ గోయల్ అన్నారు. ఎరువుల సంచులు రంగు, వినియోగం తదితర అంశాలపై పథకం మార్గదర్శకులు అమలు చేస్తుందని, దీనివల్ల సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు.
సంప్రదింపుల విధానం ద్వారా తమ సమస్యలను పరిష్కరించడానికి మంత్రి తీసుకున్న సత్వర మరియు ఆచరణాత్మక విధానానికి పరిశ్రమ మరియు వస్త్రాల విలువ ఆధారిత వ్యవస్థ వర్గాలు కృతజ్ఞతలు తెలిపాయి.
***
(Release ID: 1874632)
Visitor Counter : 163