ప్రధాన మంత్రి కార్యాలయం

కాశీలో దేవ దీపావళి వేడుకల సుందర దృశ్యాలను పంచుకున్న ప్రధానమంత్రి

Posted On: 07 NOV 2022 10:03PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కాశీలో దేవ దీపావ‌ళి వేడుక‌ల సుందర దృశ్యాలను ప్రజానీకంతో క్లుప్తంగా పంచుకున్నారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“కాశీలో దేవ దీపావళి వేడుకలు అద్భుతం.. అలౌకికం.. ఉత్కంఠభరితం! ఈ పవిత్ర, ప్రాచీన నగరంలో వేడుకలపై క్లుప్తంగా నా మనోభావమిది.” అలాగే...

“ఈ దేవ దీపావళి ప్రత్యేకమైనదేగాక కాశీలో ఇదొక చిరస్మరణీయ వేడుక.. నిత్యసత్యమైన కాశీ నగరంలో వెలుగులీనిన ఈ అద్భుత చిత్రాలను తిలకించి పులకించండి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.



(Release ID: 1874594) Visitor Counter : 99