మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థలలో జనజాతీయ గౌరవ్ దివస్‌ను ఘనంగా నిర్వహించనున్న విద్యామంత్రిత్వ శాఖ
దేశం కోసం గిరిజన స్వాతంత్య్ర సరయోధులు చేసిన త్యాగాలను భవిష్యత్ తరాలు గుర్తించడానికి స్ఫూర్తినిచ్చేలా వేడుకలు
దేశం నలుమూలలా ఉన్న గిరిజన సమాజాలు భగవాన్ అని గౌరవించే బిర్సా ముండా జయంతి 15 నవంబర్
Posted On:
06 NOV 2022 2:16PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, వృత్తిపరమైన ఉన్నత స్థాయి విద్యా సంస్థలు కేంద్ర విద్య, నైపుణ్యాలు &వ్యవస్థాపకత శాఖల మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ నేతృత్వంలో జన జాతీయ గౌరవ్ దివస్‌ను ఘనంగా జరుపుకోనున్నాయి.గత ఏడాది వీరులైన గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల స్మారకార్ధం ప్రతి ఏడాది నవంబర్ 15ను జనజాతీయ గౌరవ్ దివస్ గా ప్రకటించింది. దేశవ్యాప్తంగా గిరిజన సమూహాలు భగవంతుడిగా భావించే బిర్సా ముండా జయంతి నవంబర్ 15వ తేదీన. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, సామాజిక సంస్కర్త, దేశంలో అత్యంత గౌరవాన్ని అందుకునే గిరిజన నాయకుడైన బిర్సా ముండా బ్రిటిష్ సామ్రాజ్యవాద దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా సాహసోపేతంగా పోరాడి, తన జీవిత కాలంలోనే కీర్తినార్జించాడు. ఆయనను తరచుగా భగవాన్ అని ప్రస్తావిస్తారు. గిరిజనులకు ఉల్గులాన్ (తిరుగుబాటు) పిలుపునిచ్చి, గిరిజన ఉద్యమాన్ని నిర్వహించి, నాయకత్వం వహించారు. తమ సాంస్కృతిక మూలాలను తెలుసుకొని, ఐకమత్యంగా ఉండాలని గిరిజనులను ఆయన ప్రోత్సహించారు.
గిరిజన స్వాతంత్య్ర సమరయోధులు చేసిన కృషిని స్మరించుకునేందుకు, ఎఐసిటిఇ, యుజిసి, కేంద్ర విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలు, సిబిఎస్ఇ, కెవిఎస్, ఎన్ విఎస్, వృత్తినైపుణ్యాలను బోధించే సంస్థలను కలుపుకుని విద్యా మంత్రిత్వ శాఖ జనజాతీయ గౌరవ దివస్ ను నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలలో స్వాతంత్య్ర సమరంలో జనజాతి యోధుల కృషి అన్న ఇతివృత్తం పై చర్చల పోటీ, సామాజిక కార్యకలాలు, తదితరాలతో సహా పెద్ద సంఖ్యలో కార్యక్రమాలు జనజాతీయ గౌరవ్ దివస్ దేశవ్యాప్త వేడుకలలో చోటు చేసుకోనున్నాయి. ఈ వేడుకల సందర్భంగా భగవాన్ బిర్సా ముండా, ఇతర యోధులైన గిరిజన నాయకుల కృషిని పట్టి చూపనున్నారు. పనిలో రాణించిన విద్యార్ధులను సన్మానిస్తారు. ఈ వేడుకలు దేశం కోసం గిరిజన స్వాతంత్య్ర సమరయోధులు చేసిన త్యాగాలను, వారి వారసత్వాన్ని ముందుకు తీసుకువెడుతూ, గిరిజన సంస్కృతి, కళలు, సుసంపన్నమైన గిరిజన వారసత్వాన్ని భవిష్యత్ తరాలు గుర్తించడానికి స్ఫూర్తినిస్తాయి.
***
(Release ID: 1874187)