ప్రధాన మంత్రి కార్యాలయం
గుజరాత్ రోజ్ గార్ మేళా ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
ఒక సంవత్సరం లో 35 వేల ఉద్యోగాల ను భర్తీ చేయాలి అని లక్ష్యంగా పెట్టుకొన్న గుజరాత్
పది లక్షల నౌకరీల ను ఇవ్వడం కోసం కృషి చేస్తున్న కేంద్రప్రభుత్వం
Posted On:
29 OCT 2022 12:45PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో సందేశం మాధ్యమం ద్వారా గుజరాత్ రోజ్ గార్ మేళా ను ఉద్దేశించి ప్రసంగించారు.
వేరు వేరు గ్రేడ్ లలో విభిన్నమైన పదవుల కోసం నియామక పత్రాల ను అందుకొన్న యువ అభ్యర్థుల కు ప్రధాన మంత్రి అభినందనల ను తెలియజేశారు. మంగళప్రదం అయినటువంటి ధన్ తేరస్ దినాన రోజ్ గార్ మేళా ను జాతీయ స్థాయి లో తాను ఆరంభించి డెబ్భై అయిదు వేల మంది అభ్యర్థుల కు నియామక పత్రాల ను పంపిణీ చేసిన సంగతి ని ప్రధాన మంత్రి గుర్తు చేసుకొన్నారు. ఇదే తరహా రోజ్ గార్ మేళాల ను వేరు వేరు రాష్ట్రాల లో మరియు కేంద్ర పాలిత ప్రాంతాల లో నిర్వహించడం జరుగుతుంది అని ధన్ తేరస్ నాడు ప్రధాన మంత్రి చెప్పారు. గుజరాత్ శీఘ్రం గా ముందుకు కదలింది; మరి 5000 మంది అభ్యర్థులు గుజరాత్ పంచాయత్ సర్వీస్ బోర్డు నుండి నియామక పత్రాల ను ఈ రోజు న అందుకొంటున్నారు. ఇంకొక 8000 మంది అభ్యర్థులు వారి యొక్క నియామక పత్రాల ను గుజరాత్ సబ్ ఇన్స్ పెక్టర్ రిక్రూట్ మెంట్ బోర్డు నుండి మరియు లోక్ రక్షక్ రిక్రూట్ మెంట్ బోర్డు నుండి అందుకొంటున్నారు. ఈ విషయం లో సత్వరమే స్పందించినందుకు గాను గుజరాత్ ముఖ్యమంత్రి ని మరియు ఆయన యొక్క జట్టు ను ప్రధాన మంత్రి అభినందించారు. ఇటీవలి కాలాల్లో పది వేల మంది యువతీయువకుల కు గుజరాత్ లో నియామక పత్రాల ను అందించడం జరిగింది, తదుపరి ఒక సంవత్సర కాలం లో 35 వేల కొలువుల ను భర్తీ చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకోవడమైంది అని ప్రధాన మంత్రి తెలిపారు.
గుజరాత్ లో ఉపాధి మరియు స్వతంత్రోపాధి తాలూకు అనేక అవకాశాల ను కల్పించిన ఖ్యాతి రాష్ట్రం యొక్క కొత్త పారిశ్రామిక విధానాని దే అని ప్రధాన మంత్రి అన్నారు. ఓజస్ వంటి డిజిటల్ ప్లాట్ ఫార్మ్ స్ ను మరియు 3వ, ఇంకా 4వ శ్రేణి పోస్టుల లో ఇంటర్ వ్యూ ప్రక్రియ ను అంతం చేయడాన్ని ఆయన ప్రశంసించారు. ‘అనుబంధం’ మొబైల్ ఏప్ మరియు వెబ్ పోర్టల్ ద్వారా రాష్ట్రం లో ఉద్యోగాల ను ఆశిస్తున్న వారిని, ఉద్యోగాల ను ఇచ్చే వారిని సంధానిస్తూ ఉపాధి కల్పన ప్రక్రియ ను సాఫీ గా మార్చడం జరుగుతోంది. ఇదే విధం గా, గుజరాత్ పబ్లిక్ సర్వీస్ కమిశన్ యొక్క సత్వర భర్తీ నమూనా కు జాతీయ స్థాయి లో ప్రశంస దక్కింది.
రాబోయే నెలల్లో ఈ విధమైనటువంటి రోజ్ గార్ మేళాల ను జాతీయ స్థాయి లోను, రాష్ట్రాల స్థాయి లోను ఏర్పాటు చేయడం జరుగుతూనే ఉంటుంది అని ప్రధాన మంత్రి అన్నారు. కేంద్ర ప్రభుత్వం 10 లక్షల నౌకరీల ను ఇవ్వడం కోసం పాటుపడుతూ ఉంటే, మరో వైపు నుండి రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ఈ ఉద్యమం తో జతపడుతున్నాయి; దీనితో ఉపాధి అవకాశాల సంఖ్య గణనీయం గా పెరగగలదు. ‘‘ఇది వరుస లో ఆఖరి వ్యక్తి కి సైతం సేవల ను అందజేయడం మరియు ప్రభుత్వ పథకాల ను అందరి వద్ద కు చేరవేయడం వంటి ఉద్యమాల ను బాగా బలపరుస్తుంది’’, అని ఆయన అన్నారు.
భారతదేశం 2047వ సంవత్సరానికల్లా అభివృద్ధి చెందిన దేశం హోదా ను సాధించుకొనే దిశ లో సాగిపోయే క్రమం లో ఈ యువజనుల కు మహత్వపూర్ణమైన భూమిక ఉంది అని ప్రధాన మంత్రి నొక్కిచెప్తూ, సమాజం పట్ల, దేశం పట్ల వారి యొక్క కర్తవ్యాన్ని వారు నెరవేర్చవలసి ఉంది అంటూ వారి కి విజ్ఞప్తి చేశారు. ఒక ఉద్యోగాన్ని సంపాదించుకోవడం తోనే వారి ఎదుగుదల సమాప్తం అయినట్లు భావించకుండా నేర్చుకొంటూ ఉండడాన్ని మరియు నైపుణ్యాన్ని సాధించడాన్ని కొనసాగించండి అని కూడా వారి ని ఆయన కోరారు. ‘‘ఇది మీకు అనేక ద్వారాల ను తెరుస్తుంది. మీ యొక్క ఉద్యోగాన్ని సమర్పణ భావం తో నిర్వహిస్తుండడం మీకు ఎల్లలు లేనటువంటి సంతృప్తి ని ఇవ్వడం తో పాటు గా వృద్ధి మరియు పురోగతి తాలూకు తలుపుల ను తెరుస్తుంది’’ అని పలుకుతూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.
**********
DS
(Release ID: 1871853)
Visitor Counter : 201
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam