వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
వినియోగదారుల మంత్రిత్వవిభాగ ,ప్రత్యేక ప్రచార కార్యక్రమం 2.0 కింద 156 ప్రజా ఫిర్యాదుల అప్పీళ్ళను పరిష్కరించింది.
ప్రజా ఫిర్యాదులలో 70 శాతం ఫిర్యాదులకు సమాధానాలు తెలియజేసింది.
ప్రత్యేక ప్రచార కార్యక్రమం 2.0 కింద పూర్తి స్థాయి కంప్యూటరైజేషన్ తో 7061 భౌతిక ఫైళ్లను తొలగించింది.
వినియోగదారుల వ్యవహారాల విభాగం కేంద్రకార్యాలయంలో, ఇతర కేంద్రాలలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది.
प्रविष्टि तिथि:
28 OCT 2022 12:28PM by PIB Hyderabad
వినియోగదారుల వ్యవహారాల విభాగం దేశవ్యాప్తంగా గల కార్యాలయాలు, కార్యాలయ ప్రాంగణాలు, సంస్థలలో పరిశుభ్రతకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమం 2.0లో పాల్గొంటున్నది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, నేషనల్ టెస్ట్‌హౌస్, నేషనల్ కన్సూమర్ కో ఆపరేటివ్ ఫెడరేషన్, నేషనల్ కన్సూమర్ కమిషన్‌లలో ఈ ప్రచార కార్యక్రమానికి సంబంధించి మొత్తం 73 కార్యాలయాలు గుర్తించడం జరిగింది.ఈ ప్రచార కార్యక్రమం అక్టోబర్ 2న ప్రారంభమైంది. 2022 అక్టోబర్ 31న ముగుస్తుంది.
ఈ 2.0 ప్రత్యేక స్వచ్ఛతా ప్రచార కార్యక్రమానికి వినియోగదారుల వ్యవహారాల విభాగం ముందస్తు ఏర్పాట్ల దశను నిర్వహించింది. ఇందులో స్వచ్ఛతా కార్యక్రమంలో దృష్టిపెట్టవలసిన అంశాలు, తొలగించవలసిన రికార్డుల ను నిర్ణయించడం జరిగింది. అలాగే 73 ప్రాంతాలకు సంబంధించి సిపిడబ్ల్యుడి, ఇతర నిర్వహణా కాంట్రాక్టర్లతో చర్చించే అంశంపైనా నిర్ణయించడం జరిగింది.
ఈ ప్రచార కార్యక్రమం సందర్భంగా గౌరవ పార్లమెంటు సభ్యుల నుంచి వచ్చిన లేఖలకు సమధానాలు ఇవ్వడం జరిగింది. రెండు అంతర్ మంత్రిత్వశాఖల రెఫరెన్సులపై అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది. 1516 ప్రజాఫిర్యాదులు అందగా 26.10.2022 తేదీ వరకు 1074 ఫిర్యాదులు అంటే 70 శాతం ఫిర్యాదులకు సమాధానాలు పండం పూర్తయింది. 156 ప్రజా ఫిర్యాదుల అప్పీళ్లను పరిష్కరించారు.
ఇక రికార్డుల నిర్వహణకు సంబంధించి, 15,285 భౌతిక ఫైళ్లను గుర్తించి, 13,131 ఫైళ్లను సమీక్షించిన అనంతరం 7061 భౌతిక ఫైళ్లను డిజిటలైజ్ చేసి , భౌతిక ఫైళ్లను తొలగించడం జరిగింది. ఇక 602 ఈ ఆఫీస్ కేటగిరీ కింద ఈ ఫైల్స్‌ను సమీక్షకు పెట్టగా 473 ఈ ఫైల్స్‌ను మూసివేయడం జరిగింది. దీనితో 86 శాతం గుర్తించిన రికార్డులను ఇప్పటివరకు మూసివేయడం జరిగింది. ప్రస్తుత ప్రచార కార్యక్రమం కింద చిత్తును అమ్మివేయడం ద్వారా 2,38,268 రూపాయలు రాబడి వచ్చింది. 5,121 చదరపు అడుగుల స్థలం ఖాళీ అయింది.



దేశవ్యాప్తంగా ఈ విభాగానికిగల కార్యాలయాలలో మొక్కల పెంపకానికి సంబంధించి ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించడం జరిగింది. దీని ఫలితంగా ఐఐఎల్‌ఎం, ఎన్‌టిహెచ్, బిఐఎస్ క్యాంపస్‌లలో 500 మొక్కలను నాటడం జరిగింది. ఇంధన సమర్ధత కలిగిన లైటింగ్, అన్ని క్యాంపస్‌లలో విద్యుత్ దీపాలను ఎల్.ఇ.డి లైట్లతో అమర్చడం వంటివి చేపట్టడం జరిగింది.
అత్యుత్తమ విధానాలను అనుసరించడంలో భాగంగా ,రెగ్యులర్‌ప్రాతిపదికన చిత్తు వ్యర్థాలను తొలగించేందుకు అలాగే మార్కెట్‌లోని వినియోగదారులు తమకు ఏవైనా ఫిర్యాదులు ఉంటే వాటిని వినియోగదారుల కమిషన్ లో ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఈ `దాఖిల్ లో దాఖలుచేయాల్సిందిగా వినియోగదారులకు అవగాహన కల్పించడానికి సబార్డినేట్ సంస్థలు ఎం.ఎస్.టి.సి (భారత ప్రభుత్వ ఎంటర్ ప్రైజెస్ )తో ఎం.ఒ.యును కుదుర్చుకుంది.
ప్రచారం దశలో , ముందస్తు దశలో రీమోడల్ సెక్షన్‌ను 5వ ఫ్లోర్‌లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో గ్రెయిన్ టెస్టింగ్ లేబరెటరీని ఏర్పాటు చేశారు. గౌరవ మంత్రి వర్యుల ఆదేశానుసారం, గ్రెయిన్ టెస్టింగ్ లేబరెటరీని రూమ్ నెంబర్ 545 నుంచి ఎన్.టి.హెచ్ ఘజియాబాద్‌కు మార్చడం జరిగింది. మొత్తం రూమ్‌ను యువ ప్రొఫెషనల్స్ , అధికారుల కోసం పునరుద్ధరించారు.
***
(रिलीज़ आईडी: 1871599)
आगंतुक पटल : 141